ఉద్యోగాలు గ్రహాలు
రవి
ఉద్యోగం చూడాలి అంటే దశమ స్థానం మరియు షష్ట
స్థానం చూడాలి.
షష్ట స్థానం సేవక భావాన్ని సూచిస్తుంది అంటే,
ఉద్యోగం చేస్తామా లేదా అనే విషయాన్ని సూచిస్తుంది.
దశమ భావాదిపతి కి, షస్ట భావాది పతి కనుక ఏదో
విధం గా సంబందం ఏర్పడితే, ఆ వ్యక్తి కి ఉద్యోగం ఉంటుంది.
ఇక ఏ గ్రహం ఎటువంటి ఉద్యోగాలు సూచిస్తాయో తెలుసుకుందాం.
ఈ ప్రపంచం లో అభివృద్ది పెరిగే కొద్దీ, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
మనకు జ్యోతిష్య శాస్త్రం అందించినప్పుడు గ్రహ కారకత్వాలని బట్టి కొన్ని కొన్ని వృత్తులను
సూచించారు కానీ, అభివృద్ది జరిగిన తర్వాత కొన్ని
రీసెర్చ్ లు చేసి, ఏ గ్రహాలు ఎటువంటి ఉద్యోగాలు కలిగిస్తాయో వివరించారు.
రవి గ్రహం కారకత్వం వహించే వృత్తులు ఏమిటో తెలుసుకుందాం
రవి గ్రహం అన్ని గ్రహాలలో కీ రాజు, ముఖ్యమయిన
గ్రహం. రవి గ్రహం కనుక బాగుంటే ఉద్యోగం లో బాగా రాణిస్తారు, ఉన్నత స్థాయి కి ఎదుగుతారు.
రవి గ్రహం కి సింహ రాశి స్వక్షేత్రం, మేష రాశీ
ఉచ్చ క్షేత్రం, తులా రాశి నీచ క్షేత్రం.
రవి గ్రహానికి చంద్రుడు, కుజుడు, గురు గ్రహాలు
మిత్రులు. శుక్రుడు, శని, రాహు గ్రహాలు శత్రువులు.
రవి గ్రహం కనుక ఏ వ్యక్తి కి అయినా జాతకం లో
దశమం లో గానీ, షష్టం లో ఉండీ అవి స్వ క్షేత్రం, కానీ, ఉచ్చ క్షేత్రం అయితే, వీళ్ళు,
ప్రభుత్ర్వ ఉద్యోగాలు చేస్తారు. రవి కనుక దసమ భావికి కానీ, షష్టమ భావానికి అధిపతి ఆయి,
కోణ స్థానాలలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు, లేదా రాజకీయాలలోకి వెళ్ళటానికి
ఇష్టపడతారు.
ఉచ్చ క్షేత్రం లో రవి ఉండి అది దశమ భావం అయితే,
వీరికి ప్రభుత్వ రంగం లో ఉన్నత స్థానం లో ఉండే అధికారి స్థాయి ఉద్యోగం చేస్తారు, అదే
రవి స్వక్షేత్రం లో ఉండి, అది దశమ భావం అయితే ప్రభుత్వం లో గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి
ఉద్యోగం చేస్తారు.
ఇక మిత్ర క్షేత్రాలలో ఉంటే, ప్రభుత్వ రంగం లో
ఎదో ఒక మంచి స్థాయి ఉద్యోగం చేయటానికి ఇష్టపడతారు. కొంత కృషి తర్వాత ఆ ఉద్యోగం సాధిస్తారు.
కానీ,రవి కి శని యొక్క దృష్టి ఉండకూడదు, ఉంటే,
ఉద్యోగం లో ఆటంకాలు ఎక్కువ గా ఉంటాయి, ఎదుగుదల కొంత నిదానంగా ఉండును.
రవి మిత్ర క్షేత్రాలలో ఉండి దశమ భావం అయితే,
ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్ రంగం
లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తారు. చేస్తున్న ఉద్యోగాలలో నాయకత్వ లక్షణాలు కలిగి
ఉంటారు. ఉద్యోగం లో చేరిన కొన్ని సంవత్సరాలలో నే లీడర్లు గానూ, మేనేజర్లు గానూ ఎదుగుతారు.
సాఫ్వేర్ ఉద్యోగస్తులలో రవి గ్రహం కనుక దశమం
కానీ, షష్టం లో కనుక ఉంటే లీడర్లు గా ఎదుగుతారు.
రవి గ్రహం కనుక పంచమం లో కానీ, ఏకాదశం లో కానీ,
ఉండీ అవి మిత్ర, స్వక్షేత్రాలు అయితే, రాజకీయాలలో రాణిస్తారు.
మొత్తం మీద చూసుకుంటే రవి గ్రహం ఇచ్చే ఉద్యోగాలు
ప్రభుత్వ రంగం లో ఉన్నత స్థాయి అధికారి ఉద్యోగాలు
(ఐఏయెస్, గ్రూప్స్ లో ఉన్నత ఉద్యోగాలు)
ప్రభుత్వ రంగం లో గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు
రవి గ్రహం కనుక మిత్ర క్షేత్రాలలో ఉంటే ప్రభుత్వ
ఉద్యోగాలు.
ఇక ప్రైవేట్ సంస్థలలో అంటే, మేనేజర్ స్థాయి
ఉద్యోగాలు, లీడర్ స్థాయి ఉద్యోగాలు,
అడ్మినిస్ట్రేషన్ రంగం లో ఉండే ఉద్యోగాలు కలిగిస్తాడు.
జ్యోతిష్యం కోసం నన్ను కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9113048787
No comments:
Post a Comment