చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 34
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
@@@@@@@@@@
(భోజనాలయ్యాక నాన్సీ మిత్రురాళ్ళతో కలిసి మిసెస్ విల్సన్ ఇంటికి చేరుకుంది. అక్కడికి చంద్రమణి కోట బురుజు కనిపించటం గమనించి, గతంలో జేక్ సగ్స్ ఇక్కడికే సిగ్నల్స్ పంపేవాడని అర్థం అవుతుంది. నాన్సీ ఆ యింటి తలుపు తట్టినపుడు ఎవరో
మధ్య వయసు స్త్రీ పై కిటికీ నుండి కిందకు తొంగిచూసినట్లు బెస్ చెబుతుంది. ఎవరో మాట్లాడుకోవటాన్ని నాన్సీ ఆ యింటి వెనుక కిటికీ దగ్గర పొంచి వింటుంది. తరువాత.......)
మధ్య వయసు స్త్రీ పై కిటికీ నుండి కిందకు తొంగిచూసినట్లు బెస్ చెబుతుంది. ఎవరో మాట్లాడుకోవటాన్ని నాన్సీ ఆ యింటి వెనుక కిటికీ దగ్గర పొంచి వింటుంది. తరువాత.......)
#@@@@#@@
రాస్పిన్ చెప్పసాగాడు, "జేక్ సగ్స్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను నోరు విప్పాడు!"
అది ఆరుబయలు ప్రదేశమైనా, ఒమన్ దంపతులకు దిగులు వల్ల కలిగిన ఊపిరి ఎగశ్వాసని కూడా నాన్సీ వినగలుగుతోంది. ఏం జరిగిందని వాళ్ళు అడిగారు.
"సతాయించే ఆ డ్రూ అమ్మాయి, ఆమె స్నేహితురాళ్ళు కోటంతా శోధించి సగ్స్ ను కనిపెట్టారు. అతను మంచి నమ్మకస్తుడు, ప్రాణం పోయినా పెదవి విప్పడని ఎప్పుడూ నేను చెబుతుంటాను కద! సరె! వాళ్ళు అతన్ని పోలీసుల వద్దకు తీసుకెళ్ళారు. అతను కొన్ని గంటలు బాధను అనుభవించాక, మిస్టర్ వీలర్ గురించి పోలీసులకు చెప్పాడు. వాళ్ళు కోటకు వెళ్ళి అతన్ని రక్షించారు సహజ."
"ప్రస్తుతం వీలర్ మాట్లాడుతాడు!" ఒమన్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ కంపిత స్వరంతో అన్నాడు. "మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో యిరుక్కొన్నాం!"
అతని భార్య ఆ కథను సందేహిస్తున్నట్లు ధ్వనించే స్వరంతో అడిగింది, "ఈ సమాచారమంతా ఎక్కడనుంచి సేకరించావు రూడీ! జైలు కెళ్ళి జేక్ ను చూసే ధైర్యం చేయవు కద!"
"లేదెహె!" వెటకారంగా అన్నాడు రాస్పిన్. "దీన్ని నేనెలా నడిపించానో చెబుతున్నా విను. నేనిప్పుడే నీకు నచ్చిన టీరూంకి వెళ్ళటం జరిగింది. అక్కడ ముసలి వదరుబోతు సగ్స్ పట్టుబడటం, వీలర్ విడుదల అవటం అంతా నాకు చెప్పింది. తరువాత నేను జైలుకి వెళ్ళాను."
రాస్పిన్ ఒక్కసారిగా నవ్వాడు. ""ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించాను. నేను మారువేషం వేసి, దొంగతనానికి గురైన అధికారిక రాష్ట్ర కార్యాలయ సామగ్రిపై ఒక లేఖ వ్రాసాను. ఆ ఫారాన్ని యితర ఉపయోగకరమైన ఫారాలతో గతంలో సంపాదించాను కద! చీఫ్ బుర్కెని సంబోధించిన ఆ ఉత్తరాన్ని బట్టి, నేను జైలు తనిఖీలకు వేసిన రాష్ట్ర కమిటీలో సభ్యుణ్ణి. ఆ ఉత్తరంపై దొంగ పేరుతో సంతకం చేసాను."
"అలా నువ్వు సగ్స్ తో మాట్లాడానంటావు?" ఒమన్ అన్నాడు.
"అవును. అతని నుంచి నేనొక విషయాన్ని తెలుసుకొన్నాను. నా చంద్రమణి నాన్సీ డ్రూ దగ్గర ఉంది."
"ఆమె ఎలా సంపాదించింది?" బెన్ ఒమన్ గట్టిగా అరిచాడు. "అది నీకెప్పుడు తెలిసింది రూడీ?" అతని భార్య అడిగింది.
"సగ్స్ నాకు చెప్పాడు. ఆ మూర్ఖుడు తను దొరికిపోయేవరకూ, ఆ డ్రూ అమ్మాయిని కొద్దిసేపు బందీగా పట్టుకొన్నాడట. ఆ అమ్మాయి స్నేహితురాళ్ళు కోటలోని సెల్లార్ కి వెళ్ళే మెట్ల దగ్గర ఉన్న రహస్య ద్వారం పక్కన బయట నిలబడ్డారు.
అప్పుడు వాళ్ళలో ఒకామె "ఎవడో ఆమెకు పంపిన చంద్రమణి వల్ల ఖచ్చితంగా ఆమెకు మేలు జరగటం లేదు" అనటం సగ్స్ విన్నాడట!"
అతని మాటలకు ఒమన్ ఈల వేసాడు. దానితో కోపగించిన రాస్పిన్ బిగ్గరగా అరిచాడు, "ఆమెకు ఎవడు పంపించాడో నాకు తెలియదు. కానీ నాకొక ఆలోచన ఉంది. నా ఆలోచనే గనుక నిజమైతే. నేను చేసేది. . . .నేను చేసేది. . . ఫరవాలేదు. . . అది వ్యక్తిగత విషయం. నేను ఆ చంద్రమణిని తిరిగి వెనక్కి తెచ్చుకొంటాను! అది మాయమైనప్పటినుంచి నాకు దురదృష్టం పట్టుకొంది!"
తాను అందుకొన్న చంద్రమణి రూడీ రాస్పిన్ దని విన్న నాన్సీ ఆశ్చర్యపోయింది.
దాన్ని ఆమె కెవరు పంపారు? దాన్ని అతని దగ్గరనుంచి ఎందుకు తీసుకోబడింది?
కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత, రాస్పిన్ మళ్ళీ మాట్లాడాడు, "నేను మీకు చెబుతున్నాను. ఈ విషయం ఈ చుట్టుపక్కల చాలా కాక పుట్టిస్తోంది. కనుక మనం యిక్కడనుంచి ఎంత త్వరగా బయట పడితే, అంత మంచిది!"
"ఒక్క నిమిషం!" చెప్పాడు ఒమన్. "ఈ ఉద్యోగాన్ని వదిలి నేను వెళ్ళదలుచుకోలేదు."
"నువ్వు, క్లారా పట్టుబడతారు!" రాస్పిన్ వాదించాడు.
"విను" బెన్ ఒమన్ బుజ్జగింపు స్వరంలో చెప్పాడు, "ఇప్పుడే మేము కోరుకొన్న చోట ఒక వృద్ధురాలు ఉంది."
"ప్రతిఘటించటానికి కూడా ఓపిక లేనంత బలహీనురాలు ఆమె" అని క్రూరంగా నవ్వాడు అవతలి వ్యక్తి.
"అది నిజమే" క్లారా ఒమన్ అంది. "ఆమె చెక్కుల మీద ఏమీ చూడకుండా సంతకం చేస్తుంది."
రూడీ రాస్పిన్, అతని మిత్రులలాగే అత్యాశతో, నవ్వాడు. "మనం ఈ దోపిడీని వదిలిపెట్టలేమని నేను ఊహించాను" అన్నాడతను. "సరె! ఈ రోజు ఆ ముసలామె చెక్కు పుస్తకంనుంచి బలవంతంగా ఎంత లాగగలరో, అంతా లాగేయండి. రేపు మనం యిక్కడ నుంచి బయటపడాలి!"
తరువాత వాళ్ళింకేమీ మాట్లాడలేదు. కొద్ది క్షణాల్లో రాస్పిన్ ఆ యింటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే, నాన్సీ అక్కడనుంచి జాగ్రత్తగా జార్జ్, బెస్ ఉన్న చోటికి తిరిగి వచ్చి, తాను విన్న కథంతా చెప్పింది. వాళ్ళు ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూసారు.
"వెంటనే మనం పోలీసులను కలవాలి!" నాన్సీ చెప్పింది. "ముసలామె మిసెస్ విల్సన్ నిజంగానే ప్రమాదంలో ఉంది!"
వెంటనే ఆ అమ్మాయిలు దాచిపెట్టిన నాన్సీ కారు వద్దకు పరుగున వెళ్ళి, వేగంగా పట్టణాన్ని చేరుకొన్నారు. వాళ్ళు మోటెల్ కి వెళ్ళే రోడ్డుని సమీపించగానే, "ఇది నాకు మంచి పని అనిపిస్తోంది. అదేమిటంటే, మనం పోలీసుల దగ్గరకు వెళ్ళే ముందు, నాన్న నుంచి కబురేమన్నా ఉందేమో చూద్దాం" అంది నాన్సీ.
ఆమె మోటెల్ చేరగానే, ముగ్గురు అమ్మాయిలు కారులోంచి దూకి ఉత్తరాల కోసం లోనికి పరుగెత్తారు. అక్కడేమీ లేవు, డ్రూ నుంచి సందేశాలేమీ లేవు. కానీ మిసెస్ థాంప్సన్ తన డెస్క్ వెనుకనుంచి పిలిచింది.
"నాన్సీ! ఈ ఉదయం నీకొక కవరు యిక్కడ కనిపించింది. చిరునామా చాలా చిత్రంగా అనిపించింది. ఈ ఉత్తరాన్ని నా దగ్గరే ఉంచుకొని స్వయంగా నీకు అందించాలనుకొన్నాను." ఆమె కవరుని నాన్సీకి యిచ్చి వెళ్ళిపోయింది. వార్తాపత్రికల్లోని పదాల అక్షరాలను కత్తిరించి,ఆ అక్షరాలతో "నాన్సీ" అన్న పేరుగా కవరుమీద అతికించారు. ఆ కవరుకి ఒక చిన్న ముదురు ఆకుపచ్చ పెట్టె కట్టబడి ఉంది.
చంద్రమణిని కలిగి ఉన్న పాకేజీని గుర్తు చేసుకొంటూ, నాన్సీ త్వరగా ఆ కవర్ని చించి తెరిచింది. దానిలోంచి ఒక చీటీని బయటకు లాగింది. దాని మీద కూడా వార్తాపత్రికల్లో నుంచి కత్తిరించిన పదాలు ఒక కాగితంపై అంటించబడ్డాయి. ఆ సందేశంలో యిలా ఉంది:
"దయచేసి చంద్రమణిని వెనక్కి యివ్వండి. ప్రస్తుతం నేను మీలాగే ప్రమాదంలో ఉన్నాను. ఆ చంద్రమణిని ఈ పెట్టెలో ఉంచి, ప్రధాన రహదారినుంచి మోటెలుకి వెళ్ళే సందులో ఉన్న గన్నేరు చెట్టు కింద పొదలో వదిలిపెట్టండి."
దానికింద సంతకం "శ్రేయోభిలాషి" అని ఉంది.
నాన్సీ తన స్నేహితురాళ్ళకు ఆ చీటీని చూపించింది. దాన్ని చదివిన వాళ్ళకు ఆశ్చర్యంతో ఊపిరి ఆగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు దూరంగా వెళ్ళాక, "ఈ రాత్రి మనం ఈ పెట్టెను చెప్పినచోట వదిలేద్దాం, కానీ చంద్రమణితో మాత్రం కాదు. దాన్ని తీసుకొందుకు ఎవరొస్తారో జాగ్రత్తగా కనిపెడదాం!" చెప్పింది నాన్సీ.
@@@@@@@@@@@@@@@
నాన్సీ అందుకొన్న వింత చీటీలోకి బెస్ తొంగిచూస్తూ అంది.
"చంద్రమణిని వెనక్కి తీసుకోవటానికి ఒక మనిషి కన్నా ఎక్కువమంది రావచ్చు. వాళ్ళు బలిష్టులైన పురుషులే అయితే, మనకు బతికుండే అవకాశమే ఉండదు."
జార్జ్ తన బంధువుని అసహ్యంగా చూసింది. "ఎందుకు ఉండదు? మనమంత బలహీనులం కాదు."
"వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండొచ్చు" బెస్ హెచ్చరించింది.
ఒక వ్యక్తి మాత్రమే వస్తాడని నాన్సీ అనుకొంది. "నా ఉద్దేశమేమిటంటే-ముఠాలో ఉన్న వాళ్ళెవరో చంద్రమణిని తీసుకొని నాకు పంపారు. అది రాస్పిన్ కి చెందినదని యిప్పుడు మనకు తెలిసింది. అతనే ఆ రాయిని వెంటనే వెనక్కి తీసుకోమని, దాన్ని పంపిన వ్యక్తిని ఆదేశించాడని నేను అనుకొంటున్నాను."
"ఏదైతేనేం, నాన్సీ! నీ దగ్గర దొంగిలించబడ్డ ఆస్తి ఉంది" బెస్ చెప్పింది. "దాన్ని ఎంత త్వరగా వదిలించుకొంటే అంత మంచిది!"
చంద్రమణి యొక్క అసలైన యజమానికే అది తిరిగి చేరాలని నాన్సీ అంగీకరించింది.
(సశేషం)
No comments:
Post a Comment