శ్రీథర మాధురి - 115 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 115

Share This

 శ్రీథర మాధురి - 115 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)


భైరవుడితో ఏదైనా సాధ్యమే!
 
అతని హేతుబద్ధమైన ఆలోచనలను నేను ఎల్లప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవాడిని. అవన్నీ అతని దైనందిన జీవితం గడపడంలో అతనికి పనికొస్తాయి.

----------------------------------------------------------
ఒకరోజున అతడు తన కారులో వస్తూ, నా కారును ఫాలో అవసాగాడు. నేను ఎడమ పక్కకు తిరగగానే అతనూ ఎడమ పక్కకు తిరిగాడు.  నేను కొన్ని గ్రామాలను దర్శించాను. అతను కూడా వెనకాలే వచ్చాడు.
ఇది చాలా విపరీతమైన సంగతి.
అతని భార్య అతని మొబైల్ కు కాల్ చేసింది.
ఆమె ఇలా అంది, 'గురూజీ మనింటికి వచ్చారు. ఇప్పుడే వెళ్లారు.‌ నేను ఎన్నిసార్లు మీ నెంబర్ ట్రై చేసినా ఎంగేజ్ వస్తూనే ఉంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?:
అతను షాక్ అయ్యి, కారాపాడు. అతని కారు ముందు ఎడమ టైరు పంచర్ అయింది.
ఇతను దగ్గరలో ఉన్న రిపేరు షాప్ నుంచి ఒకతన్ని తీసుకొని వచ్చాడు.
ఆ అబ్బాయి టైరు తీస్తుండగా, నా ఫోటో అతని చొక్కాలో నుంచి కింద పడింది.
అతడిలో అడిగాడు, 'మీకు ఈ వ్యక్తి తెలుసా?'
అబ్బాయిల అన్నాడు ,'నాకాయన తెలీదు. కానీ రెండు నెలల క్రితం ఈయన దగ్గరలో ఉన్న తిరుప్పచెట్టి అనే ఊరిలో యజ్ఞం చేసారు. నేనా యజ్ఞానికి వెళ్లాను. నాకాయన నచ్చారు. ఆయన శిష్యుడు నాకు ఈ ఫోటోని ఇచ్చాడు.
చివరికి అతడు మధురై లోని ఒక రెస్టారెంట్లో నన్ను కలిశాడు.
అతనిలా అడిగాడు ,'ఈ నాటకం ఏమిటి? నేను మీ కారును అనుసరించాను. అదే సమయంలో నా భార్య ఫోన్ చేసి మీరు మా ఇంట్లో ఉన్నారని చెప్తోంది.  నా కార్ పంచర్ అయింది. దాన్ని సరి చేయడానికి వచ్చిన అబ్బాయి మీ ఫోటో నాకు చూపించాడు. అతడు తిరుప్ప చెట్టి భైరవ యజ్ఞం గురించి చెప్పాడు. ఈ నాటకమంతా ఏమిటి?
నేను నవ్వి ఇలా అన్నాను ,'నాకెలా తెలుస్తుంది? మీ నాన్నగారు భైరవుడికి అంకిత భక్తులు. నీకు మతం పై ఆసక్తి లేదు. బహుశా భైరవుడికి నీతో ఆడుకోవాలని పిలిచి ఈ నాటకం ఆడారేమో.' 
అతను ఇలా అన్నాడు ,'నేను ఇది నమ్మను. నేను తర్కాన్ని నమ్మే వ్యక్తిని. ప్రతి దాన్ని హేతుబద్ధంగా విశ్లేషిస్తాను. ఇది అసాధ్యం.'
నేను ఇలా అన్నాను,' సరే నీ టైర్ పంచర్ వేసిన అబ్బాయి దగ్గరికి వెళ్లి మనం చూద్దాము. నువ్వు నన్ను ఆ షాప్ దగ్గరికి తీసుకు వెళ్తావా?'
అతనిలా అన్నాడు,'ఓ, అలాగే.'
నేనతని కార్ లో కూర్చున్నాను. మేము ఆ అబ్బాయి కోసం, అతని దుకాణం కోసం వెతుక సాగాము. అందుకు బదులుగా అక్కడ ఒక టీ స్టాల్ ఉంది. మేము ఆ అబ్బాయి కోసం పంచర్ షాప్ కోసం విచారించగా, టీ స్టాల్ యజమాని నవ్వి ఇలా అన్నాడు,' నేను గత 20 ఏళ్లుగా ఇదే చోట షాప్ నడుపుతున్నాను.'
అతను ఆశ్చర్యంతో అవాక్కయ్యాడు. 'ఇదెలా సాధ్యం?' అని నన్ను అడిగాడు.
నేను నవ్వి నవ్వి నవ్వి ఇలా చెప్పాను, 'భైరవుడి తో ఏదైనా సాధ్యమే.'
నాకు కాస్త పని ఉందని అతను నీకు చెప్పి నేను బస్సు ఎక్కి వెళ్ళిపోయాను.

----------------------------------------------------------

నేను యమనేశ్వర్ లోని పరమకుడి మంచి నా కారులో తిరిగి వస్తున్నాను. అతడు రోడ్డు పక్కన తన కార్ తో నిల్చుని ఉండడం నేను చూశాను.
నేను నా కారును ఆపి అతని వద్దకు వెళ్లాను.
అతను నా వంకే కళ్ళప్పగించి చూడసాగాడు. నేను ఇలా అడిగాను, 'ఏదైనా సమస్యా? నేను నీకు సహాయం చేయగలనా?'
అతను మాట్లాడలేకపోయాడు.
పదినిమిషాల తర్వాత, అతను జరిగిన కథంతా చెప్పసాగాడు.
అతను నన్ను ఇలా అడిగాడు,' కారు నడిపింది ఎవరు? నన్ను తన వెంట పడేలా చేసింది ఎవరు?'
నేను ఆ కార్ వెంట పడుతూ ఉండగా మా ఇంటికి వచ్చి నా భార్యతో మాట్లాడుతూ సమయం గడిపింది ఎవరు?
నా కారు టైరుకు పంక్చర్ వేసింది ఎవరు?
నన్ను మదురై లోని ఒక రెస్టారెంట్లో కలిసి, ఇక్కడి దాకా నన్ను తీసుకు వచ్చింది ఎవరు? 
ఇదంతా చేసింది ఎవరు? నాకు ఆశ్చర్యంగా ఉంది.
నేను నవ్వి ఇలా అన్నాను, 'భైరవుడితో ఏదైనా సాధ్యమే!'
ఆ తర్వాత మేమిద్దరం తిరుప్పచెట్టి వెళ్లి, రుణ విమోచన భైరవుడి దర్శనం చేసుకున్నాం.
 
ఓం క్షం మహా భైరవాయనమః

***

No comments:

Post a Comment

Pages