శివం - 105
రాజ కార్తీక్
(నేను అనగా శివుడు --కార్తికేయనితో పరిచయమైన తర్వాత. కోటప్పకొండ లో జరిగిన సంఘటన ల తదుపరి.. నాతో పదా అని కార్తికేయని మాటలు వింటూ కోటప్పకొండ నుంచి మెట్లు దిగుతూ వెళ్తున్నాం..)
నేను " కార్తికేయ ఇక్కడ దగ్గర్లోనే మా ఇల్లు ఉంది మా ఇంటికి వెళ్దాం అన్నాను కదా మా ఇంట్లో చాలామంది పరివారం ఉంటారు ముందు రెండు మూడు రోజులు చక్కగా విశ్రాంతి తీసుకొని.ఆ తరవాత. మనం అనుకున్న పని మొదలుపెట్టేద్దాం"
కార్తికేయ " మనకి విశ్రాంతి అంటూ ఏమి ఉండదు గురువా అయినా మనం ఏమన్నా అలిసిపోతే విశ్రాంతి తీసుకోవాలి మనము మన నాటకం కోసం ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. మన వ్యక్తిగత జీవితంలో వచ్చిన సందర్భాలు కూడా ఎలా నాటకంలో సన్నివేశాలుగా మార్చాలి అని చూస్తాం చక్కటి నాటకాన్ని చక్కటి కళారూపాన్ని చూసినప్పుడే ఆనందం.. అప్పుడు కలిగి ఆనందం ముందు ఈ సుఖము ఈ విశ్రాంతి అవన్నీ ఏ పాటివి రాజా"
నేను " శభాష్ కార్తికేయ నీవు చెప్పింది నిజమే.. కళాకారులు ఎప్పుడైతే కళ ని విసుక్కుంటారో ఎప్పుడైతే కళ ని శ్రమగా భావిస్తారో .అప్పుడు వారి తిరోగమనం ప్రారంభము అవ్తుంది.. చిన్న మాటలు తో గొప్ప సూక్ష్మం చెప్పావు"
కా " నేనేమీ చెప్పలేదు గురువా నా మనసుకు తోచింది నేను చెప్పాను అది నీకు సమంజసం అనిపించింది చాలా సంతోషం"
నేను " హ్మ్మ్ "
కా "అవును గురువా నేనయితే నాకు వచ్చిన ఆలోచనలన్నీ పేర్చుకొని ఏదైనా మంచి అనుభవం ఎదురవుతాయి ఏదైనా మంచి సన్నివేశం విన్న ఎక్కడైనా ప్రధాన ప్రభావం పొందిన ఎవరైనా చెప్పిన అవన్నీ సంగ్రహంగా భావించి నా నాటకంలోకి పెట్టుకుంటాను"
నేను " సంతోషం ఒక రచయిత ఎప్పుడైనా అట్లనే చేస్తాడు"
కా " మహా మహా భక్తుల జీవితాల్లో నుంచి సన్నివేశాలు కూడా తీసుకొని ఆ విధంగా చేశాను.."
నేను" అవును నువ్వు కూడా భక్తుడివే భగవంతుడిని నీ రచనలతో మెప్పిస్తున్నావ్ కొంతమంది పూజ చేస్తారు కొంతమంది సేవ చేస్తారు కొంతమంది తపస్సు చేస్తారు కొంతమంది ధ్యానం చేస్తారు కొంతమంది జ్ఞాన సమపార్జన చేస్తారు కొంతమంది నీలాగా భగవంతుడిని ఏదో విధంగా తలుచుకొని ఆయన ప్రసన్నం చేసుకుంటారు నీవు కూడా భక్తుడివేనయ్యా "
కా " వామ్మో నాకొద్దయ్య ఆ భక్తుడనే పదవి.."
నేను " అదేమిటయ్యా నిన్ను భక్తుడి వి నేను అంటుంటే ఆనందపడకపోగా అలా ఏదో భయపడతావ్ ఏంటి"
కా " బాబు రాజా! ఆ భక్తుడు అనే పదార్థమే నాకు వద్దయ్యా.. వాళ్లు పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదయ్యా.. మళ్లీ జన్మంటూ ఉంటే భక్తుల్లాగా మాత్రం పుట్టుకోవాలని నేను కోరుకొనే జన్మ వద్దని కోరుకుంటా గాని "
ఈ ఉత్సాహకరమైన సంభాషణ అందరూ చూస్తున్నారు
నేను "అదేంటయ్యా అలా అన్నావు ప్రపంచంలో తపస్సు చేసిన వారందరూ మరలా జన్మ భక్తుడుగా పుట్టాలని కోరుకుంటారు గాని.. నువ్వేందయ్యా ఇలా "
కా " అయ్యా నేను కూడా అంతే అనుకున్నాను మొదట్లో తర్వాత తెలిసింది ఆయన ఎవరో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు పాండురంగ స్వామికి మహా భక్తుడు సాక్షాత్తు పాండురంగ స్వామి ఆయనకి విమానం పంపించు గాక సశ రీరంతో వైకుంఠనికి తీసుకువెళ్ల గాక.. ఆయన పడ్డ బాధలు ఆయన పడ్డవి నేను పడలేను అయ్యా అదంతా మాయ పరీక్షా అని భగవంతుడు అనుకుంటాడు అది పరీక్ష కాదు శిక్ష అని నా మట్టి బుర్ర చెపుతూనే ఉంటుంది.. ఆఖరికి తన భార్యకి వైద్యం చేయించుకోలేక ఆఖరికి తన కన్న బిడ్డలకు అన్నం పెట్టుకోలేక అవమానాలు పాలు చీదరపాలై.. ఆ మహాభక్తికి నమస్కారం పెట్టి ఊరుకోవటం తప్ప భగవంతుని మనమేం ప్రశ్నించగలమయ్యా"
నేను " అంటే నువ్వు ఏమి అడగదలుచుకున్నావు"
కా " అయ్యా ఆ మహానుభావుడు.. ఎన్నో కీర్తనలు రాశాడు ఎన్నో గేయాలు రాశాడు.. ఎన్నోసార్లు నామ జపం చేశాడు.. సాక్షాత్తు దొంగలు దొంగలించిన విగ్రహాన్ని మూలస్థానంలో తిరిగి ప్రత్యక్షం చేయించగల భక్తి ఆయన సొంతము.. ఇన్ని చేయగలిగిన వాడి జీవితాన్ని కనీసం కొద్దిపాటి సాఫీగా చూడాలని ఆ పాండురంగడు కరుణించకపోతే ఏమిటయ్యా భక్తికి అర్థము"
నేను "బాగుంది బాగుంది నీ నూతన సిద్ధాంతము మరింత విశదీకరించి చెప్పుము"
కా "భగవంతుడి పట్ల జనులు ఆకర్షితులై సత్కర్మలు చేయాలంటే భగవానుడిని నమ్ముకుంటే జీవితం ఇలా ఉంటుందని భగవంతుడికి కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా అయ్యా అలా విపరీతమైన పరీక్షలు పెట్టి కొన్ని వందల జన్మల పాపాలు ఈ జన్మలో క్షేమం చేశాను అని చెప్పి కర్మ క్రియ కర్త అనే ఒక సిద్ధాంతంతో భక్తుల జీవితాలతో ఆడుకుంటూ వైరాగ్యం కల్పించడానికి నేనున్నానని చెప్పి పడరాని పాటలు పడి ఆ పిల్లలు.. వద్దయ్య వద్దు ఆ భక్తుడు జీవితమే నాకొద్దు.."
ఇదంతా చూస్తున్న విష్ణు దేవుడు ఒకసారి పాండురంగడిలాగా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు ఈ లీల తప్పదు అన్నట్లు
కా "ఇంకో మహా భక్తుడు ఎవరో భక్తి పారవశ్యంలో మునిగి కుండలు చేస్తూ తన బిడ్డనే తాను తొక్కి మట్టిలో మట్టిగా చేస్తే.. తిరిగి ఇవ్వకపోగా.. తన భార్యతో తగువపెట్టి తన భార్య చెల్లెలితో మరో పెళ్లి చేసి.. వారిని తాకరాదని ఒట్టు పెట్టించి.. వారు తాకిన తర్వాత తనంతట తానే తన రెండు చేతుల్ని కోసుకొని అర్పణం చేసుకున్నాడు "
విష్ణు దేవుడు " అవును సోదరి అవును అప్పుడు ఆ భక్తుడికి వెళ్లి నేను అన్ని సపర్యాలు చేశాను కదా అందులో నా తప్పేమిటి" అని చిలిపితనంతో ప్రశ్న వేశాడు
కా " నేను అదేనయ్యా చెప్పేది ఆయన తప్పంటూ ఏమీ లేదు భగవంతుడి ఊహకి భగవంతుడు ఆలోచనకి అందే అంత గొప్ప మనసు నాది కాదయ్యా.. పాండురంగడు కోసం ఆయన పడ్డ కష్టాలు పాండురంగడు కోసం ఆయన పడ్డ అవమానాలు అన్నీ కావు.."
నేను " అవునయ్యా నువ్వు చెప్పినంత బానే ఉంది చివరికి తన బిడ్డను తను తిరిగి ఇచ్చాడు కదా.. తన భార్యలతో సఖ్యత కుదిరించాడు కదా ఇంకేమిటి?"
మహాదేవుల వారు మీ తరఫున వకాలతపచకున్నారని
.. పార్వతి మాత కనుసైగలు చేస్తుంది
కా " బురద మీద కాలు వేయనేలా తొక్క నేల జారిపడనేలా.. నడుము విరగనేల.. దాన్ని తగ్గించనేలా ?"
బ్రహ్మ దేవుడు "కర్మ సిద్ధాంతాన్ని ఒక ముక్కలో చెప్పాడు భగవంతుడు కాపాదిస్తూ "
నేను "అలా మాట్లాడితే ఎలా నయ్యా సాక్షాత్తు భగవంతుడు కూడా దానికి బద్దుడే కదా!"
కా "ఏమో రాజా . భగవంతుని నింద చేసే వాడిని కాదు భగవంతుని ప్రశ్నించే వాడిని కాదు ఏదో నా జీవితం పదిమందికి సహాయపడుతూ.. కొద్దో
గొప్ప ఆనందంగా గడుపుతూ నా వాళ్ళని సరిగ్గా చూసుకుంటూ సమాజానికి చేత అయిన సేవ చేస్తూ గడిపితే చాలు అని అనుకునే వాడిని మాత్రమే"
నేను " అలా చేస్తావు లే కానీ ఇంకా ఈ సిద్ధాంతన్ని నిర్ణయించుకోవడానికి ఎలా పరిశీలించావు"
కా" మరొక మహా భక్తుడు ఉన్నాడు పాపం రాముడికి గుడి లేదని గుడి కడతాను అని నిర్ణయించుకున్నాడు.. అరే గుడి కట్టడం అనేది మంచి విషయం కదా పదిమందికి ఉపాధి దొరుకుతుంది కదా పదిమందికి అన్నం దొరుకుతుంది కదా దానికి సహాయం చేయకుండా ఆయన్ని కారాగరంలో పడవేశాడు ఆ రాజు.. చూసేవాళ్ళకి ఏ సందేశం వెళుతుంది గుడి కడదామని వెళ్తే కారాగార శిక్ష పడుతుంది అని భగవంతుడు తెలియజేసినట్టు ఉంది నాకు అది.. సరే ఆ తర్వాత రాములవారే వచ్చారు.. కానీ ఆ భక్తుడు పడ్డ మానసిక వేదా మానసిక బాధ ఎంతుంది చెప్పు.."
నేను "బాగుగానే పరిశీలించావు కానీ ఈ సృష్టి చక్రంలో ప్రకృతి నియమాలు ఎవరికైనా తప్పవు కార్తికేయ.. ఎవరు ఎన్ని కఠోర పరీక్షలు ఎదుర్కొంటారు అంత గొప్ప స్థానానికి చేరుకుంటారు సమయమే తేడా కానీ సందర్భం ఒకటి ఫలితం ఒకటే"
భక్తులారా మీరు కూడా మీ పని చేయండి అది నా మీద వదిలేయండి సమయం వచ్చినప్పుడు మీరు పడ్డ ప్రతి కష్టానికి నూరు రెట్లు ఫలితాన్ని నేను కచ్చితంగా ఇస్తాను
కా "అవులే రాజా నువ్వు చెప్పినది సత్యమే దానికాదునుటకు నేను ఎవరిని ఈ చరాచర సృష్టించిన భగవంతుడికి ఆ మాత్రం తెలియదా ఊరికే ఏదో మనం ఆక్రోశం కొద్ది దేవుని అడగటమే తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు"
నేను "మనము ఒకటి చేయగలం ఎప్పుడు మంచి పనులే చేయగలం. అది చేస్తే చాలు అన్నీ మంచిగానే జరుగుతాయి "
కా "అదే కదా స్వామి నేను చెప్పింది మంచి పనులు చేసినందుకే కదా వాళ్ళ జీవితాల్లో కఠోర పరీక్షలు ఎదుర్కొన్నారు ఆఖరికి భగవంతుడి పేరు జపించే వాళ్ళు చివరికి అన్నం కూడా దొరక్క ఆ పూటకి ఆ పూట భగవత్ బిక్షం దేహి అని ఎంతమంది అడుక్కునేవారు ఉన్నారు. తమకున్న బంధాలన్నీ కోల్పోయి చివరికి ఒక్కరే మిగిలింది ఎలా దిక్కుమాలిన వారిలాగా ఈ భౌతిక సమాజంలో ఉన్నారు సరే వారి యొక్క దృష్టి వేరు కావచ్చు వారి యొక్క స్థితి వేరు కావచ్చు ఎవరిని ప్రశ్నించే స్థితిలో నేను లేను నాకనిపించింది నా జ్ఞాన పరిధిలో మాత్రమే చెప్పాను"
నేను " న్యాయ జ్ఞాన సంవాదం లో రాటు దెలి పోయావు "
కా " ఒకటి అడగనా రాజా నిన్ను"
నేను " హా అడుగు"
అందరూ ఆలకిస్తున్నారు
కా"ఈ రోజున నాకు ఎదురు అయిన శివుడిగా నేను భావించాను నాలో శివుడు ఉన్నాడు నీలో శివుడు ఉన్నాడని అనుకుంటాం కదా. నాలో శివుడు నిన్ను అడుగుతున్నాడు.. శివపార్వతు లు అయిన .. సీతారాములైన.. వారిని తల్లిదండ్రులుగా భావిస్తారు కదా అందరు.. సరే అందరికీ అన్నీ చాలా అవసరం లేదు.. పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించకపోయినా తల్లిదండ్రులు చాలా ప్రేమ చూపిస్తారే.. అలాంటిది వారి తల్లిదండ్రులుగా భావించే మంచి భక్తుల జీవితాన్ని సరిచేసే బాధ్యత వారిని కాదా కర్మ కర్త క్రియ ఈ పదార్థాన్ని ఒక దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటారు ఏడుస్తున్న అవమానాలు పాలవుతున్న ఏం జరుగుతున్నా కూడా నీ చావు నువ్వు చావును వదిలేస్తారు కానీ.. పోనీలయ్య నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు దానికి ఒక కారణం ఉంటుంది ఎందుకంటే భగవంతుడు కారణం లేకుండా ఏమి చేయడు కాబట్టి ఈ ప్రశ్న అనవసరం .."
నేను" అంటే నువ్వు నీ విషయంలో మాట్లాడుతున్నావా అందరి విషయంలో మాట్లాడుతున్నావా
కా " నేను మంచివాడిననే అనుకుంటున్నాను అందరి కోసం కాదు నాలాంటి మంచి వారి కోసం మాట్లాడుతున్నాను అనుకో ఆయన మన మాటలు విని ఉన్నపలంగా ఏమన్నా మారుతుందా ఏమిటి? ఏదో నా స్వర ఘోష "
కార్తికేయుడు వేసిన ప్రశ్నలకు అందరూ సున్నితంగా చిరు మందహాసంలో ఉన్నారు..
మరి నేనేం చెప్పాను..
No comments:
Post a Comment