'అవసరాన్ని అదుపులో పెట్టుకో!' - అచ్చంగా తెలుగు

'అవసరాన్ని అదుపులో పెట్టుకో!'

Share This

 'అవసరాన్ని అదుపులో పెట్టుకో!'

-సుజాత.పి.వి.ఎల్,సైనిక్ పురి, సికిందరాబాద్.




బాధ, బాధ్యత
జంట భావనల్లా
కంటిని అంటిపెట్టుకున్నప్పుడు..
రోజుకో వేషాన్ని మార్చే 
ఊసర వెల్లిలా బతుకీడ్చటం తప్పుకాదేమో..!

ఆకలితో మనిషి..
ఆశలతో మనసు నిత్యం పోరాటం చేస్తుంటే..
నటనలో జీవించటం సబబేమో..
అవసరాలు ముడివేసిన బంధాలు మనవి..
అందుకే నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోతుంటాయి..!

నిజమైన బ్రతుకునే మరచిపోయేంత 
నాటకీయతను పుణికిపుచ్చుకొన్నాయి..      
నేటి మానవ సంబంధాలు..!

మానవత్వాన్ని మంటగలుపుతూ..
కకావికలమైన జీవితాలు మళ్ళీ చిగురించాలంటే.. 
అవకాశాన్ని చూసి 
చిత్ర విచిత్ర విన్యాసాలు చేసే 
'అవసరాన్ని అదుపులో పెట్టుకొంటే సరి!

*****

No comments:

Post a Comment

Pages