ఉద్యోగాలు గ్రహాలు
PSV రవి కుమార్
బుధుడు
బుధ గ్రహం ఆలోచనలకు,
తర్కముకు (లాజికల్ థింకింగ్), లెక్కలకు, స్టాటిస్తిక్స్ కు, కంప్యూటర్స్ కు కారకత్వం
వహిస్తాయి.
బుధ గ్రహం రాణిస్తే
ఉద్యోగం లో పై స్థాయి కి వస్తారు, ఇబ్బందులు పెడితే, ఉద్యోగ ఎదుగుదలలో ఆటంకాలు ఎదురుకుంటారు.
బుధ గ్రహానికి మిథున,
కన్యా రాశి స్వక్షేత్రాలు, అవగా కన్యా రాశి ఉచ్చ్చ క్షేత్రం, మీన రాశి నీచ క్షేత్రం
అవుతుంది.
బుధ గ్రహానికి రవి,
శుక్ర గ్రహాలు మిత్రులు, చంద్రుడు శత్రువు .
బుధుడు వ్యాపారానికి
కారకుడు, బుధ గ్రహానికి సప్తమ, ఏకాదశ, ద్వితీయ స్థానాలకు సంబంధం ఏర్పడితే వ్యాపారం
లో రాణిస్తారు.
బుధ గ్రహం కలిగించే
వృత్తులు, ముద్రణా రంగం, కమ్యూనికేషన్స్ రంగం, లైబ్రెరీ రంగం, మార్కెటింగ్ రంగం, కౌన్సిలింగ్
రంగం, రీసెర్చ్ రంగాలలో వృత్తులు చేపడతారు.
బుధుడు కనుక దశమం లో
ఉంటే ఇంజనీరింగ్, టెలీ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో , కంప్యూటర్స్ రంగం లో , వృత్తి
చేపట్టే అవకాశం ఉంటుంది.
ముద్రణా రంగం లో వృత్తి
చేపట్టుట, పోస్టల్ డిపార్ట్మెంట్, కొరియర్ రంగం లో వృత్తి చేపట్టుట, కౌన్సిలింగ్ రంగం
లో, చార్టెడ్ అకౌంటెంట్ వంటి వృత్తులలో స్థిర పడతారు.
బుధుడు కనుక పంచమం
లో ఉన్నా, ఏకాదశం లో ఉన్నా, షేర్ మార్కెట్ లో ధన సంపాదన చేస్తారు (ఈ సందర్భం లో శని
దృష్టి ఉండకూడదు).
తృతీయం లో ఉన్నా, పంచమం
లో ఉన్నా రచనా సామర్ద్యం కలిగి, రచయితలుగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ప్రస్తుత పరిస్తితుల్లో,
కంటెంట్ రైటర్స్ గా వృత్తి చేపట్టే అవకాశాలు కలదు(ఈ సందర్భం లో పంచమం లో ఉన్నబుధుడికి,
దశమంఆధిపతి తో కానీ, షష్టాధిపతి తో కానీ సంబంధం ఏర్పడాలి).
బుధుడు ఉచ్చ లో ఉండి
అది కనుక సప్తమం లో ఉన్నా, సప్తమాధిపతి తో సంబందం ఏర్పడినా, వ్యాపారం లో రాణిస్తారు.
బుధుడు కి వ్యయాధిపతి
తో సంబందం ఏర్పడి సప్తమం లో ఉన్నా, ద్వితీయం, లాభ స్థానాలలో ఉన్నా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్
వ్యాపారాలలో రాణిస్తారు.
బుధుడు దశమం లో ఉంటే,
స్టాక్ మార్కెట్ సంస్థలలో వృత్తి చేపట్టుట లేదా స్టాక్ మార్కెట్ బ్రోకర్లగా వృత్తి
చేపడుతరు. మధ్యవర్తులుగా కానీ, బ్రోకర్లు గా కానీ, వృత్తి చేపడతారు.
బుధుడి కి గురు గ్రహానికి
సంబంధం ఏర్పడితే, టీచింగ్ రంగం లో వృత్తి చేపడతారు. బుధ గురు గ్రహాలు కలిసి సప్తమం
లో ఉంటే, కాలేజీ లు, విద్యాసంస్థలు ఎస్టాబ్లిష్
చేస్తారు.
జ్యోతిష్యం కోసం నన్ను కాంటాక్ట్ చేయవలసిన
నంబర్ 9113048787
No comments:
Post a Comment