అయ్యో, పాపం! - అచ్చంగా తెలుగు

 అయ్యో, పాపం!

  భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


అన్నపూర్ణ లాంటి అమ్మ

అధోగతికి లోనయ్యింది.(పాలైయ్యింది)

ఆదిలో పిల్లల పాలిట

అనురాగ జోలయ్యింది

సంసారాన్నంతటిని సవ్యంగా నడిపించే

దేవుని లీలయ్యింది.

భర్త వాళ్ళ కలిగే బాధలకు

పరితాపాల జ్వాలయ్యింది

ఒడి దుడుకులను ఒడుపుగా తట్టుకొని

అంతులేని సహనాల మాలయ్యింది.

కష్టాల కడగండ్ల శూలయ్యింది.

ఇష్టాల ఎండమావుల పాలయ్యింది

సరిలేని సహనశీలయ్యింది.

***

 

No comments:

Post a Comment

Pages