శివం - 107 - అచ్చంగా తెలుగు

శివం - 107 

(శివుడే చెప్పిన కథలు)

రాజ కార్తీక్ 


{ నేను అనగా శివుడు)


(కార్తికేయుడు నేను కోటప్పకొండ నుంచి వెళ్తూ భక్తుల గురించి హాస్యంతో కూడిన దీర్ఘపు చర్చ చేసుకుంటూ నేను ఎందుకు రాక్షసులకు వరాలు ఇస్తాను అని చెప్తూ.. మా ఇంటికి వెళ్దాం పద అని కార్తికేయని తీసుకు వెళ్తున్నాను)


కార్తికేయుడు " అబ్బా గురువా ఇంకా ఎంత దూరమయ్యా కాళ్లు నొప్పులు పడుతున్నాయి"

నేను " ఏమయ్యా ఈ కుతి దూరాన్ని అ లిసిపోతే ఎలా మునుముందు ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో"

కా " ఏదో దగ్గరలో అని అన్నావు కదా మానసికంగా ఇక్కడే దగ్గరేమో అనుకొని తయారయ్యాను అదే ముంద ముందటి .. దూరం చాలా ఎక్కువ అనుకుంటే మానసికంగా చాలా దూరం నడవాలని సిద్ధంగా ఉండేవాడిని పైగా సృష్టిగా భోంచేసాం కదా కోటప్పకొండ లో నిద్ర వస్తుంద సామి "

నేను "నృత్యం చేశావు కొండ పైన చాలాసార్లు తిరిగావు మళ్ళీ కొండ దిగావు చాలా దూరం నడిచావు అలసట తో కూడా నిద్ర వస్తుందిలే "

కా" కాసేపు ఎక్కడైనా ఒక మంచి కునుకు తీద్దాం గురువా"

నేను "కాసేపాగితే మన ఇల్లు వస్తుందిలే అక్కడ చక్కగా పడుకుంది గాని .. దేనికి మళ్లీ మళ్లీ ఆగడం ఆగకుండా .. నీ రచనలలోని ఒక మంచి సన్నివేశం చెప్పు విందాం .. ఇద్దరికీ హాయిగా ఉంటుంది"

కా "నిద్ర అనగానే నా బలహీనత మీద కొట్టావయ్యా సరే నేను రాసిన ఒక మంచి కథలో ఒక సన్నివేశం చెబుతాను " 

నేను " కానీ" 

కా "అది బాల ఆంజనేయుడు కథ .. హనుమ సూర్యుని మింగిన తర్వాత.. జరిగిన శాపాలు హనుమంతుడు మూర్చ పోయిన తరువాత  అందరి దేవతల వరాలు తెలిసిందే కదా.. అప్పుడు ఒక చిన్న కథానికం చేశాను "

నేను "ఏమిటి అది."

కా" కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి తన అంశయన ఆంజనేయుడికి దెబ్బ తగలటం తండ్రి మనసుకు వచ్చిన బాధ వలె విపరీతంగా మానసిక సంకటనగా ఉన్నది.. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా?

 కేసరి నందన డు... అంజనాదేవి.. రాజప్రసాదంలో ఆంత రంగిక మందిరంలో తమ ఆంజనేయుడికి ఏమీ కాలేదు మరింత బలంగా తిరిగి వచ్చాడు.. అని దీర్ఘ నిద్ర లో ఉన్నారు..
మన అంజనా సూతుడు మెలకువ వచ్చింది బాగా నిద్రపోతున్న అమ్మానాన్నని లేపటానికి ఇష్టపడని 
బాల హనుమయ్య.. లేచి అటు ఇటు తిరిగి  కిటికీ దగ్గరకు వచ్చాడు..
ఆరోజు పౌర్ణమి కాబట్టి.. చంద్రుడు నిండుగా కనపడుతున్నాడు..

మన బాలయ్య కి కొద్దిగా ఆకలి అనిపిస్తుంది.
ఎప్పుడూ తినే ఫలాలు తన చుట్టుపక్కల ఉన్నా కూడా సూర్యుని ఫలముగా భావించి తిన్న తన ఆకలి తీరింది తనకి ఉన్న వరాలు వచ్చాయి కాబట్టి తన ప్రయత్నం నెరవేరింది అని మనసులో తనకు తానే చిలిపిగా ఆలోచన చేసుకుంటున్నాడు..
ఇక చంద్రుని కూడా తిందామా.. ఏదైతే అది అయింది చూద్దాం ఏం జరుగుతుందో అని తన అల్లరి మొదలు పెడదాం అనుకున్నాడు..
ఎగిరి చంద్రుడి దగ్గరికి వెళ్దామనుకొని సిద్ధం కాబతుండగా మళ్లీ తాను కనపడకపోతే తన అమ్మానాన్న తన స్నేహితులు దిగులు పడతారని భావిస్తూ ఏం చేద్దామా అని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు..
అటు ఇటు తోక ఊపుతుండగా తనకొక ఆలోచన వచ్చింది. తాను ఎగరడం ఎందుకు తోకతో చంద్రుని పట్టుకొని లాక్కొని నోట్లో వేసుకుంటే పోలా? అనే ఆలోచన చేసి తన వాలాన్ని గురిపెట్టబోయాడు..

చంద్రుడేమో శివుడు తల మీదే ఉంటాడు కదా
"స్వామి మీరు ఏమో చాలా హుందాగా ఉంటారు మీ అంశ చూడండి ఎంత అల్లరి చేస్తాడు నన్ను మింగేస్తాడట నాకోసం తోకను పంపిస్తున్నాడు.. హనుమ ని.. కి అన్ని వరాలు వచ్చేసాయి కదా చూడండి అతగాడి అల్లరి..
శివయ్యకేమో ఒకటే నవ్వు ఈ హనుమంతుడు ఉంటాడు చూడు ఇక్కడ ఉంటే అక్కడ అందరికీ ఆనందం ..ధైర్యం..
హనుమంతుడేమో తన తోకను పెంచసాగాడు 

మన శివయ్య హనుమంతుడి వెనకాల ప్రత్యక్షమయ్యాడు

శివయ్య "ఏమి హనుమ  హద్దు పొద్దు ఉండదా నీ అల్లరికి "అని లాలనగా తిట్టాడు ..

హనుమ ఒక్క నిమిషం తండ్రికి భయపడినట్టు భయపడి తన తోకను వెనక్కి లాక్కొని .
"బోల శంకర స్వామీ అదేం లేదు ఊరికే సరదాగా చేశాను నువ్వు నన్ను కోప్పడవకు అని బుంగమూతి పెట్టాడు."

శివయ్య" అదేం లేదులే ఇటు రా నిన్ను కోప్పడిన నన్ను నేను కోప్పడినట్టే.. దగ్గరకు రా అనగానే ఆంజనేయ స్వామి పరిగెత్తుకుంటూ వెళ్లి శివుడి పాదాలకు నమస్కారం చేశాడు అక్కడ కూర్చున్న శివుడు ఆంజనేయస్వామి ఎత్తుకొని ముద్దాడి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.


చెప్పవలసిన అవసరం లేదుగా ఈ కథంతా మీ మాటలు బ్రహ్మ విష్ణు మన కైలాస పరివారం దేవతలు వింటున్నారు.. ఇక మన హనుమ కూడా ఒక చెవి ఇటు వేశాడు..

హనుమ మనసులో "ఎంత గొప్ప కల్పన చేశావు కార్తికేయ నన్ను మహాదేవుల వారి కోపడటం నేను వెళ్లి ఆయన దగ్గర లాలనగా ఉండటం మహాదేవుల వారు నన్ను ఒడిలో కూర్చో మని ముద్దాడటం..తలుచుకుంటుంటేనే శ్రీరామ జపం చేసినంత ఆనందంగా ఉంది ఎంతో ఘనుడివి కాబట్టే మహాదేవుల వారే వచ్చి నీ చేత కథలు చెప్పించుకుంటున్నాడు."

కార్తికేయ డు తన కథ కొన సాగిస్తున్నాడు..

 హనుమ  "స్వామి మీరు  జగత్ పిత కదా! మీరు కూడా నాలాగా ఏమన్నా మింగేసారా నేనైతే సూర్యుడిని మింగాను మీరు  కృష్ణ బిలాలను పూర్తి అంతరిక్షాన్ని మింగేసారా."

శివుడు "హా హా ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ నాకు ఆకలేస్తుంది ఏమైనా పెడతావా.."

హనుమ "అమ్మను నిద్ర లేపుతాను మీరు వచ్చారని తెలిస్తే మీకేది కావాలంటే చేసిపెడుతుంది నాన్న అయితే మీరు వస్తే ఉత్సవమే చేస్తారు."

శివుడు "వారు నిద్రపోతున్నారు కదా వారిని లేవడం భావ్యమా?  లేపకుండా ఇక్కడున్న పలాలు తీసుకురా."

హనుమ "అయితే ఒక్క నిమిషం స్వామి చిటికెలో వచ్చేస్తా అంటూ కిటికీలోంచి వాయువేగంతో ముందుకెళ్ళిపోయాడు.. మళ్లీ అంతే వెనక్కి వచ్చి.. నవ్వుకుంటూ చిన్న బుట్ట లాంటిది తీసుకు వెళ్ళాడు.

రెండే రెండే నిమిషాల్లో తిరిగివచ్చి బుట్టనిండా పళ్ళతో వచ్చాడు..

శివుడు "ఏమిటాంజనేయ ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ వాటి కోసం వెళ్లావు ఎందుకు"

హనుమ "ఇక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి స్వామి ప్రతి చెట్టుని పరిశీలించి ఏ చెట్టు పండు రుచిగా ఉంటుందో కచ్చితంగా అవి కోసుకోవచ్చాను మీకోసం ఆరగించండి మీరు  అడిగారు కదా అందుకని మీకోసం అతి శ్రేష్టమైన రుచి కరమైన పండ్లు తీసుకొచ్చాను స్వామి " 

శివుడు " సరే రా ! ఇద్దరం కలిసి తిందాం వచ్చి ఒడిలో కూర్చో" అని ఆజ్ఞ వేశాడు.


మరి నేను తిన్నానా? ఆంజనేయుడు అల్లరి చేయకుండా తిన్నాడా? 

కా "బాబు రాజా! కధనం జరిగేది ఆంజనేయుడికి శివుడికి అయితే నువ్వెందుకు తింటవ్?" 

నేను "కథలో అలా లీనమైపోయానబ్బా నన్నే శివుడని చెప్పు అన్నావు కదా ఏం తప్ప?"


కా "ఏమీ లేదులే అల లీనమై పోవడమే నాకు కావాల్సింది " 

నేను "ఇంతకీ చంద్రుడు సురక్షిత మేన, ఆంజనేయుడికి ఏమీ కాలేదుగా కథలో"


కా "కథలో అయినా నిజమైన ఆంజనేయుడికి ఏమవుతుంది ఎందుకంటే ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణు ఆయనే మహేశ్వరుడు"

నేను "సత్యము పలికితివి జైశ్రీరామ్ .. జై హనుమ రామ్"

హనుమంతుడు అత్యంత ఆనందంగా చిలిపిగా మరి చూస్తూ నవ్వుతున్నాడు ఆంజనేయుడు ఆనందం మహా ఆనందం ఆంజనేయుడు ఆనందం లోకకళ్యాణార్థకం..

(

No comments:

Post a Comment

Pages