'వన తన్వంగులు 'సమ్మక-సారలమ్మలు!'
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
అమ్మోరి ఆవేశ శివసత్తుల సిగాలు
దేవళమెరుగని అపూర్వ వన దేవతలు
కుంకుమభరణిలో కొలువుదీరిన గౌరమ్మలు
గద్దెలే గర్భగుడిగా తలచే జగజ్జనని ప్రతిరూపాలు
చింతానిష్ట చేత్తవ్య శాశ్వత సంహార కారకులు
సౌధములు కోరని సుప్రతిభా మణులు
పచ్చని వనారణ్య పర్యుపస్థానోద్భవ పైడి నెలతలు
కదనరంగ ఖడ్గ తురంగ తీక్షణా తన్వంగులు
ద్విహాయనమునరుదెంచు తీరతోత్సవ తిరునాళ్ల కొలుపులు
జంపన్నవాగులో భక్త జనుల కోలాహలాలు
జమిడిక డప్పు చప్పుళ్ళతో అంబరాన్నంటే సంబురాలు
బంగారు బెల్లపురాశుల నైవేద్యాలు
ఇసుకేస్తే రాలనంత భక్త ప్రభంజన మేడారం జాతర
భక్తి పారవశ్య తన్మయత్వ సందడులు
ధైర్యసాహసాలకు ప్రతిరూపం సమ్మక్కసారలమ్మలు
***
No comments:
Post a Comment