శివం - 109
(కార్తికేయనితోపాటు నేను మా ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కార్తికేయుడు తను రచించిన బాల ఆంజనేయ కథ చెబుతూ బాలాంజనేయ మందిరం లోకి.. నేను రావడం నాతో పాటు పార్వతి మాత రావటం మా దగ్గర జరిగిన సంభాషణలు తరువాత హనుమంతుడు పార్వతీమాతని ఒక ప్రశ్న వేశాడు)
నేను అనగా శివుడు
కా " చెబుతున్న గురువా వినుకొ "
కథ జరుగుతుండగా .. కార్తికేయది నాది సంభాషణ కొనసాగుతుంది..
{పార్వతీ మాత " ఏమిటి ఆ ప్రశ్న"
బాల ఆంజనేయుడు " మాత ఈ ఫలములు నాకు మీరు మా అమ్మ వలె తినిపించగలరా? "
పార్వతి మాత " అటులనే తినిపిస్తాను"
బాల ఆంజనేయుడు "అటులైన నేను మహా దేవలు దగ్గర వలె కాకుండా అల్లరి చేస్తాను నా అల్లరికి అడ్డుకట్ట వేసి మీరు తినిపించవలెను "
నేను మాత్రం నవ్వుతున్నానుట. ఈ అల్లరి ఆంజనేయుడు ఏదో తిరకాసు పెడుతున్నాడని
అంజనాదేవికి హనుమంతుడికి అన్నము తినిపించేలోపు కిష్కింద కాండ ఖాండమంతా చూపిస్తాడు పాపం ఆ తల్లి హనుమంతుడికి అన్నం తినిపించలేక అలసిపోతుంది అలా ఉంటుంది మన బాల హనుమాన్ అల్లరి మరి పార్వతి మాత ఏం చేస్తుందో చూద్దాం
పార్వతీ మాత" చెప్పు హనుమ ఈ ఫలములు తినిపించనా ఇవి సాక్షాత్తు మహాదేవుల వారికి తెచ్చినవి కదా అంటే వారి ముందు ఉంచి మహా నైవేద్యం గావించావు ఇక ప్రసాదం వలె నీవు తినుటే మిగిలి ఉన్నది "
బాల హనుమ " ఐ ...నేను నా శ్వాస్తాలతో తెచ్చిన ప్రసాదాన్ని సాక్షాత్తు మహాదేవుల వారికి నివేదించి సాక్షాత్తు జగన్మాత చేత తినబోతున్నాను నాకు భలే ఆనందంగా ఉన్నది"
పార్వతీ మాత " సరే రా అయితే తిను "
మీ పార్వతీ మాత హనుమంతుడికి ఫలములు తినిపిద్దామని.. దగ్గరికి వెళ్లేసరికి ఆ రాజభవనం అంతా కోతి వలె గిెంతుతూ అమ్మకి దొరకకుండా. ఎట్లయితే ఒక ఆట ఆడుకుంటాడో అట్లా పార్వతీ మాత దగ్గరికి రావడం తిని పించే లోపల వెళ్ళిపోవటం ఇలా పార్వతీమాత అలసిపోయే విధంగా చేస్తూనే ఉన్నాడు అల్లరి హనుమ
పార్వతీ మాత " నాయనా హనుమ నీవు ఏది కోరి తెచ్చుకున్న ఫలములే కదా ఎందుకు తినవు ఏమిటి ఈ అల్లరి "
శివుడేమో నవ్వుతున్నాడు.
}
నిజంగా చిన్న బాలుడు అయిపోయినా హనుమ ఆనందంగా పార్వతి మాత వైపు చూసి చిన్నపిల్లాడి వలె నవ్వుతున్నాడు..
"ఇది నిజంగా జరిగి ఉంటే ఎంత బాగుందమ్మా" అని ఒక మాట నమస్కారం చేస్తూ మీ పార్వతి మాతతో అన్నాడు
దానిదేముంది హనుమ ఈ మాత్రం దానికి నీవు నన్ను అడగవలనా రాతి ఎందుకని అని ఫలములు చేతిలోకి ప్రత్యక్షం చేసుకుని హనుమంతునికి ఎలా అయితే అంజనాదేవి ప్రేమగా తినిపించేదో అంతకన్నా ప్రేమగా హనుమంతునికి తిని పిస్తోంది
ఈ చర్యతో హనుమంతుడు రోమాంచితుడై
."తల్లి లంకకు వెళ్లి వచ్చిన తర్వాత రాములవారు నన్ను వాటేసుకొని నీకన్నా నాకున్న ఆప్తులు ఎవరు హనుమ అని అన్నప్పుడు ఎంత ఆనందపడ్డానో ఇప్పుడు అంత ఆనంద పడుతున్నాను అమ్మ..
మిగిలిన లక్ష్మీమాత సరస్వతీ మాతల కూడా ఏమి హనుమ మేము మాత్రం నీకు పెట్టకూడదా?.. అంటూ వారు కూడా అంతే తినిపించారు..
హనుమంతుడు చాలా ఆనందంగా వాడు ఎంత పెట్టినా తింటూనే ఉన్నారు ఫలములు ఫలములు హనుమంతుడి బజ్జల్లోకి వెళ్లిపోతున్నాయి.
కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చింది లక్ష్మీ మాత కి
ఎందుకో హనుమంతుడు.. తను పెట్టేది సరిగ్గా తినట్లేదు అని ఒక అనుమానం వచ్చి ఉన్నఫళంగా
సీతాదేవి రూపంలోకి మారిపోయింది..
"నాయనా హనుమ ఇవి కూడా భుజించు" అని అచ్చు సీతమ్మ అన్నట్టే అన్నది ఎందుకంటే తనే ఆమె కదా!
ఇప్పటిదాకా ముగ్గురు మాతల మీద సమాన ప్రేమ కనబరిచిన మన హనుమా ఉన్నపలంగా స్వార్థంగా మారిపోయి అమ్మ సీతమ్మ బాగున్నావా అంటూ ఆమె ముందు మోకరిల్లి నమస్కారం చేస్తూ.. "తల్లి నన్ను ఏల వదిలి వెళ్ళిపోయావు నీ తదుపరి రాములవారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ యుగము నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని తలుచుకుంటూ రాములవారిని తలుచుకుంటూ గడుపుతున్నాను తల్లి "అంటూ అమితమైన భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటా విన్నవించుకున్నాడు .
పార్వతీ మాత మరియు సరస్వతి మాత..
"ఏది ఏమైనా హనుమ సీతారాములు యందు చూపించే భక్తి వేరు"
పార్వతీ మాత "ఏమి హనుమ ఇప్పటిదాకా జగన్మాత జగన్మాత అంటూ మీ సీతామాత కనపడగానే మమ్మల్ని అందరినీ మరిచి అటు తిరుగుతావా.. కార్తికేయని కథలో కన్నా ఇక్కడ అల్లరి బాగా చేస్తున్నావు అంటూ తల్లి వలె కోపం నటిస్తూ అన్నది..
హనుమ "అమ్మ జగన్మాత అట్లా అనవాకుతల్లి నీవైన సరస్వతీమాత అయిన జానకిదేవైనా లక్ష్మీదేవి అయిన మాకు జగన్మాత అందరూ ఒకటే.. సీతాదేవికి నమస్కారం చేస్తే నీకు చేసినట్టు కాదా నీకు చేస్తే సీతమ్మకి నమస్కారం చేసినట్టు కదా తల్లి "అంటూ పార్వతీమాత పాదాలు శ్రద్ధతో కళ్ళకు
అద్దుకున్నాడు
సరస్వతి మాత "దానిదేముందిలే హనుమా.. సరదాగా చేసాము.. మా అందరి ఉద్దేశం కూడా నీకు పలాలు తినిపించటమే కదా "అని వాత్సల్యంగా అంది
కార్తికేయ నాతో చెబుతున్న కదా వింటున్నారు
{బాల హనుమంతుడు . పార్వతీ మాతకు చిక్కకుండా.. తోకతో రాజ మందిరం పైకి అధిరోహిస్తూ కిందకి దిగుతూ .. తినకుండా ఏడిపిస్తున్నాడు..
ఇక పార్వతీ మాత కి తల్లికి వచ్చే కోపము వచ్చినది
ఇక అంతే..
తన జడను పెద్దది చేసి బాల హనుమతుని తోకని పట్టుకొని ఒక్క ఉద్ధటునా దగ్గరికి లాగింది.
బాల హనుమంతుడు ఇక కదల లేకపోయాడు..
తన జడతో దగ్గరికి లాగ గా
"తెలుగు నోరు తెరువు అని కోప్పడి ఉన్న పలలు మొత్తము తినిపించినది"
పార్వతీ మాత పెట్టిన భయంతో చిక్కురుమనకుండా హనుమ గుటకలేసుకుంటూ పెట్టిందల్లా తిన్నాడు.
}
ఈ సంఘటన విన్న అందరూ గొల్లున నవ్వుకుంటున్నారు... అమ్మతో అంతే ఉంటుంది అని పగలబడి నవ్వుకో సాగారు.. హనుమంతుడు సైతం భలే ఉంది అంటూ నవ్వుకో సాగారు..
పార్వతీ మాత" ఏమి హనుమ అక్కడ నీవు భయపడినట్టు రచించిన కూడా నీకు నవ్వు వస్తున్నదా? "
హనుమ " తల్లి జగన్మాత నీకు ఎవరైనా భయపడతారు అమ్మ సాక్షాత్తు మహాదేవుడైనా సరే నేను.. నీకు భయపడి మారం చేయకుండా తినేయడమనేది చాలా చక్కటి రచన.."నమోన్నమః అంటూ నమస్కారం చేశాడు..
నేను కూడా కార్తికేయని ముందు కథ వింటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను ఆ సంఘటనలో బాల హనుమంతుడు యొక్క హావ భావాలు ముఖ కవళికలు తలుచుకొని నాకు కూడా.. విపరీతమైన నవ్వు వచ్చింది.. నా నవ్వు చూస్తూ విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు మీ మాతలు.. కైలాస పరివారం అంతా ముచ్చటి పడుతున్నారు..
తర్వాత ఏం జరిగింది
కా " గురువా ఎంత మంచి శ్రోతవి గురువా నువ్వు.. నేను చెప్పిన కథ ఉద్దేశం చెప్పినట్లుగా అర్థం చేసుకుంటావు"
కథలో
{
శివుడు " ఏమి హనుమ గొడవ చేయటం మానేశావు నాన్నతో చేసినట్టు అమ్మతో గొడవ చేస్తే అంతే ఉంటుంది అనుకున్నావా"
బాల హనుమంతుడు భయంతో కూడిన ఒక కవళికలతో " హో" అని అన్నాడు
మొత్తం తినేసిన తర్వాత పార్వతి మాత హనుమంతుడికి ఆహారం సరిపోయిందని నిర్ధారించుకొని దిష్టి తీసింది.
పార్వతీ మాత సాధారణంగా అయిపోయి హనుమంతుడిని ఎత్తుకొని బుజ్జిగా లాలిస్తుంది..
బాల హనుమంతుడికి మాత్రం ఎక్కడ గొడవ చేస్తే మళ్లీ కోప్పడతారని భయంతో ప్రతి మాటకి బాల రాముని వలె నిదానంగా సమాధానం చెబుతున్నాడు..
శివుడు "దేవి హనుమంతుని ఇటు తీసుకురమ్ము" అంటూ తన ఆసనం పక్కన కూర్చోమని చోటు చూపించాడు పార్వతి మాతకి
దగ్గరికి రావడంతో పార్వతీ మాత దగ్గర నుండి శివుడికి అతుక్కుపోయాడు బాల హనుమంతుడు..
శివుడు " హనుమ. మీ అమ్మకి కోపం వస్తే. నేను కూడా ఆపలే ను నీ గొడవ అంతా నా దగ్గరే.
అంటూ బుంగమూతి పెట్టుకున్న హనుమంతుని బుగ్గలు ముద్దుగా గిల్లాడు..}
No comments:
Post a Comment