శివం - 110 - అచ్చంగా తెలుగు
శివం - 110
(శివుడే చెబుతున్న కథలు)\

రాజ కార్తీక్ 



(కార్తికేయని బాలాంజనేయ కథను మార్గమధ్యంలో వింటూ మా ఇంటికి తీసుకు వెళుతున్నప్పుడు.. కథ లో బాల ఆంజనేయ డు.. మీ పార్వతి మాత వాత్సల్యా గ్రహానికి గురై పెట్టిన ఫలములు తిని.. నా ఒళ్ళు కూర్చున్న తర్వాత జరుగుతున్న కథ)

నేను అనగా శివుడు .

నేను " చాలా బాగుందయ్యా కార్తికేయ నీ ఉపమానం.. వాస్తవమే నువ్వు చెప్పింది.. అమ్మకి అలా ఎవరైనా భయపడాల్సిందే " 

కార్తికేయడు " గురువా రాజా! పైగా ఆంజనేయుడు అంటే ఎవరు సకల గుణ సంపన్నుడు.. ఏ భగవంతుడి నైనా.. కనీసము  వారికి ఏదో ఒక విమర్శ ఉంటుంది అది లోక కళ్యాణం కోసమయినప్పటికీ.. కానీ మా హనుమయ్య కి ఇటువంటి విమర్శ ఉండదు భగవంతుడా ఆయనే భక్తుడైన.. మాకోసం ఇక్కడే ఉంటూ.. పిలిస్తే పలికే దైవం ఆంజనేయుడు ఆంజనేయుడు ఉండగా.. భయాలన్నీ దండగ "

నేను "జై ఆంజనేయ.. వీరాంజనేయ శివరాంజనేయ ప్రసన్నాంజనేయ సీతారామాంజనేయ" 


సాక్షాత్తు నేనే అలా అనడంతో ఆంజనేయుడు కొద్దిపాటి ఆశ్చర్య చికితుడు అయ్యాడు.. మహాదేవుల వారిని నన్ను జైఅనటం ఏంటమ్మా, అంటూ మీ ముగ్గురు మాతల దగ్గర ఫిర్యాదు చేశాడు 
మీ మాటలు ముగ్గురు ఒక మహాదేవులు వారి ఇంటి నాయన మేము కూడా అంటాము జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ అని ..
ఆంజనేయుడు వినయ పూర్వకంగా నమస్కారం చేసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంతైనా ఈ కార్తికేయుడు కదా చాలా బాగుంది.. ఇతగాడి పుణ్యమా అని మరొకసారి బావ వేషం పొందాను.. అంటూ జైశ్రీరామ్ అంటూ తర్వాత కథ కోసం ఎదురుచూస్తున్నాడు..

నేను "బాగుంది బాగుంది ఇప్పుడు ఆంజనేయుడు బుంగమూతి.. శివుడిచ్చిన బహుమతి ఏమిటో"

కథలో 

{

మహాదేవుడు బాలాంజనేయుడు బుగ్గలు గిల్లుతున్నాడు..

పార్వతి మాతను చూసి ఆంజనేయుడు గుటకలు మింగుతున్నాడు.. అది చూడటానికి బహు హాస్యంగా ఉన్నది..

బాల ఆంజనేయుడు " మహాదేవ కొంచెం దాహం ఇస్తుంది ఇప్పుడే తిన్నాను కదా నీరు కావాలి అన్నాడు"

పార్వతీ మాత మాత్రం మహాదేవుల వారి వైపు బిడ్డకి దాహం తీర్చరానట్లు ఒక చూపు చూసింది

మహాదేవుడు " అట్లనే దేవి నీ కోపాన్ని నామీద ప్రదర్శించవాకు అసలే బాలాంజనేయుడు చూడు నాకు కర్చు కు పోయాడు"

నేను నా సిగలో ఉన్న జటను చూసి మా ఆంజనేయుడికి దాహం తీర్చడానికి.. భూమి మీదకు వచ్చినంత వేగంగా కాకుండా అని పిలిచాను..

బాలాంజనేయుడు సాక్షాత్తు శివుని జటలలో వచ్చిన గంగనే తాకబోతున్నానని ఉత్సాహంగా నోరు తెరిచాడు..

జటలో వచ్చిన చిన్నదారా సరిగ్గా ఆంజనేయానికి అందే విధంగా నోట్లో పడుతున్నాయి..

అవి స్వచ్ఛమైన గంగ..నీరు.. భూమి మీద కాదు సాక్షాత్తు మహాదేవుడి జటలోనే ఉన్నా ఎవరు రుచి చూడలేని రుచికరమైన ఆనందకరమైన గంగ..

ఆగంగా నీరు తాగబట్టే కూడా నేమో ఆంజనేయుడు చిరంజీవి అయ్యాడు అని ఆరోజు రాత్రి చంద్రుడు తారలు అనుకోసాగాయి..

ఎంత గంగ ఉద్భవించి వస్తున్నప్పటికీ కూడా ఆంజనేయుడు నోటిలో అవి పడి తాగుతూనే ఉన్నాడు.." దాహం తీరిందా "ఆంజనేయ అనే మాటకి సమాధానం చెప్పకుండా, ఆస్వాదిస్తూ అనుకుంటూ తాగుతూనే ఉన్నాడు 

పార్వతి మాత " చాలులే అంటూ ఆంజనేయుడు వీపు మీద తట్టింది" 

అంతే దెబ్బకు ఆంజనేయుడు దాహం తీరిపోయింది గంగ రావటం ఆగిపోయింది..


}

నేను " బాగుంది బాగుంది.. గంగను ఆంజనేయుడు రుచి చూడటం .. మీ పార్వతి మాతయేమో పొలములు తినిపించడం మహాదేవుడు నీరు త్రాగించటమే చాలా బాగుందయ్యా" 

కార్తికేయ " అవును రాజా నువ్వు అలా అంటుంటే నాకు చాలా బాగా ఆనందంగా ఉంది.. నిజంగా ఈ కథ ఆంజనేయుడు విని ఉంటే చాలా సంతోషపడేవాడు.. ఎందుకంటే సాక్షాత్తు ఆంజనేయుడు అంటే శివుడే కదా.. అందుకే అలా కథా సంకలనం చేశాను... నేను చిన్నప్పట్నుంచి 
హనుమంతుడి భక్తున్ని.. ఆయన్ని పూజించడం వల్లే నాకు ఈ రచన కళ వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నాను.. కానీ ఆయనకేమో నేనంటే చిన్న చూపు.. అందర్నీ అనుగ్రహిస్తాడు కానీ నన్ను మాత్రం అనుగ్రహించడు.. ఎవరికి ఏమన్నా ఇబ్బంది అయితే నేను వారి గురించి అడిగితే వారి కష్టాలని ఇట్టే నెరవేరుస్తాడు.. కానీ నాకు మాత్రం చేయడు.. బహుశా ఆయనకి నా మీద కోపం ఏమో ఇలా చేశానని అంటూ తీవ్రంగా మదనపడ్డాడు" కార్తికేయుడు..

ఆంజనేయుడు మాత్రం కార్తికేయుడు వైపు చూసి అనుగ్రహిస్తూ " ఏ కర్మలు ఉన్నవొ ఈ రచన సంకలనం చేసి సాక్షాత్తు మహాదేవుడికి మాకే చెబుతున్నావు కదా ఇక మీద నీకు అన్ని దిగ్విజయాలు అవుతాయిలే కార్తికేయ అని దీవిస్తున్నాడు"

నేను "అలా ఏమీ ఉండదులే కార్తికేయ.. ఆంజనేయుడు ఈ కథ విని ఎంతో ఆనందపడి ఉంటాడు నాకే ఇంత ఆనందం కలుగుతుంటే ఆంజనేయుడికి ఈ కథ ఎంతో ఆనందం కలిగించి ఉంటుంది తప్పక జీవిస్తాడు తప్పక అందరి దేవతలు ఆశీస్సులు నీకు ఉంటాయి తప్పక నువ్వు అనుకున్నది సాధిస్తావు"

కార్తికేయ " తధాస్తు గురువా నువ్వు ఏం చెప్తే అదే"

నేను "వస్తాయిలే కార్తికేయ నీకు రావాల్సినవన్నీ బారు చక్రవడ్డీ కలిపి వస్తాయిలే" 

కా " ముందు ఆ శివయ్య  హనుమయ్య అందరూ కలిసి సీతమ్మ తల్లి అదే మా లక్ష్మీదేవికి నా గురించి కొంచెం చెప్పి కొంచెం గట్టిగా ఆమె ఆశీర్వాదం ఇప్పించండి అయ్యా ! అమ్మ తల్లి లక్ష్మీదేవి భవతి భిక్షాందేహి.. తండ్రి మహావిష్ణు నీవే చెప్పి ఆమె అనుగ్రహం కలిగింప చేయవలసిందిగా నా ప్రార్థన"

విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు 
"మహాదేవుల తరపున వచ్చిన వ్యక్తివి నీకు అనుగ్రహం ఇవ్వకపోతే మహాదేవుడు ఊరుకుంటాడా అసలే లక్ష్మీదేవికి సంపద ఇచ్చిందే మహాదేవుడు.. కచ్చితంగా ఇస్తాం తధాస్తు"


నేను "నాకు వినపడిందయ్యా కార్తికేయ వాళ్ళని కచ్చితంగా ఇచ్చేస్తారంట.."

కా " పోనీలే భయ్యా పండగ పూట కనపడిన శివుడివి నువ్వు చెప్తే సాక్షాత్తు శివుడే చెప్పాడు అనుకుంటాను హర హర మహాదేవ.. శంభో శంకర"
అంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము 

నేను " అంత బానే ఉంది నీకు కావాల్సిన హామీలు బానే తీసుకున్నావు తర్వాత కథ ఏమైందో చెప్పవయ్యా నాయనా!"

కా " ఆ చెబుతున్న గురువా.. తర్వాత ఏం జరిగిందంటే మన ఆంజనేయుడు...."

అందరూ నవ్వుకుంటున్నారు సరదాగా..

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages