'నిషేధ నిశి వేడుక 'రేవ్'!
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
అదో మాయాలోకం
మత్తూమైకాల కలగలుపు
శృతి మించిన శబ్ధాల నడుమ అలరించే అతివల అర్ధనగ్న నృత్యాభినయ నిషాలోకం
బాహ్య స్పృహలేని మది విహార విహంగ స్వేచ్ఛాలోకం
అక్కడ మందుకేం కొదవ?
ముంచెత్తే మత్తుకేం కరువు?
చిత్తు చిత్తుగా తాగి తూగటానికి సిగ్గుకెందుకు మోమాటం?
మోతాదుకు మించిన మద్యం నరనరాన ఏరులై పారుతుంటే..
హద్దులకెక్కడ తావు?
అలవాటుపడ్డ మోహం
యావత్తు దేహాన్ని మైమరపించే
ఇంద్రియపక్ష వేడుకలకు అదో ఇంద్రలోకం
అరువు తెచ్చుకొన్న పాశ్చాత్య సంస్కృతిని అందలమెక్కించి..అదో అద్భుత సంప్రదాయంగా భావిస్తూ... భ్రమలో బతికేస్తూ..
సెలెబ్రిటిలమంటూ సర్వాన్ని వదిలి..
కొత్తందాల అహాన్ని పులుముకొని
బయట ప్రపంచాన్ని కాసేపు వెలివేస్తూ
నిశి ముసుగులో కలిసిమెలిగే కలగాపులగ బాంధవ్య నిషేధ సామ్రాజ్యలోకం
ప్రముఖుల ప్రత్యేక వేడుకలలో
కైపెక్కించే దిశగా మారిన వేలంవెర్రి 'కిక్' పార్టీ 'రేవ్'..
గోప్యత చౌరస్తాకెక్కితే... మోసిన మీడియా చేతిలోనే చాకి'రేవు' తప్పదు!
***
No comments:
Post a Comment