పంచాయుధ స్తోత్రం వైశిష్ట్యం
సి.హెచ్.ప్రతాప్
స్ఫురత్స హస్రార శిఖాతితీ వ్రం - సుదర్శనం భాస్కర కోటి తుల్యం |
సురద్విషాం ప్రాణవినాశ విష్ణో - శ్చక్రం సదాహం శరణం ప్రపద్యే
ఇది పంచాయుధ స్త్రోత్రం లోని మొదటి శ్లోకం.
సచ్చక్రశంఖం గదాఖడ్గ శార్ జ్గణం - పీతాంబరం కౌస్తు భవత్స లాంఛితం |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం - విష్ణుం సదాహం శరణం ప్రపద్యే
ఇది ఎనిమిదవ మరియు ఆఖరి శ్త్రోత్రం. అన్ని స్త్రోత్రాలలో కెల్లా మహా శక్తివంతమైనది పంచాయుధ స్తోత్రమ్ అని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం.
శ్రీ మహా విష్ణువు ధరించే అయిదు ఆయుధాల విశిష్ట్యం తెలిపే ఈ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం వలన ఆర్థిక బాధలు, శత్రు బాధలు , అనారోగ్య బాధలు, గొప్ప ఆపదలు తొలగిపోతాయని అశేష భక్తజనావళి యొక్క విశ్వాసం. శ్రీ మహావిష్ణువు ధరించే అష్ట ఆయుధాలు :
1) శంఖము; 2) చక్రము; 3) చర్మము (డాలు); 4) శార్ఙ్గము (విల్లు); 5) ఖడ్గము; 6) శరము; 7) పాశము; 8) గద.
వీటితో సహితుడైన శ్రీ మహావిష్ణువును కీర్తించి, ప్రార్ధిస్తే అష్ట కష్టాలు తొలగుతాయని శ్రీ విష్ణు పురాణం తెలియజేస్తోంది.
జలమునందెల్లపుడూ ఏ ఆపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక, భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక ,! అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక,
బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక అని పై స్త్రోత్రం తెలియజేస్తోంది.
దేవతలు ధరించిన ఆయుధాలు జడశక్తులు కావు. అవి ఆ దేవత యొక్క లీలా విభుతులు . ఆయుధాలకు కూడా ప్రత్యేక అధిష్ఠాన దేవతలు,మంత్రాలు ఉన్నాయి. ఆయా మంత్రాలను అనుష్టించిన వారిలో ఆ ఆయుధశక్తులు ప్రతిష్టితమైన అమోఘ కార్యాలను సాధిస్తాయి.సుదర్శన దేవతా మంత్రాలు,సుదర్శన హోమాలు మనకు పరిచితమే. చక్రదేవత ,శంఖ దేవత భరత శత్రుఘ్నులుగా అవతరించారు కూడా. ఇలా ఆయుధాలు కూడా చైతన్య స్వరూపాలు. దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసే భగవద్కారుణ్యం ఈ ఆయుధాల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ ఆయుధాలు మనల్ని కాపాడాలని ప్రార్థించితే చాలు – ఆ దేవతల ప్రసాదంతో మనకు సర్వరక్ష లభిస్తుంది. ”ఏ వింటినారి మ్రోతచేత దేవ తల మనసులలోని భయం తొలగి రాక్ష సులపై పిడుగుల వంటి బాణ వర్షం కురు స్తుందో అటువంటి శార్గ్ఞ ధనువును నేను శరణు వేడుతున్నాను” అంటుంది పంచా యుధ స్తోత్రం. శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినమూ అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దు:ఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు అని విష్ణు పురాణం ఈ స్త్రోత్రం యొక్క మహిమను గురించి అపూర్వంగా తెలియజేసింది. అడవులలో దారితప్పి, జంతువుల బారినపడి, యుద్ధములో చిక్కుకొని, నీటి ప్రమాదమేర్పడి, అగ్ని ప్రమాదమేర్పడిగాని భయగ్రస్తులయినా, లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ యితర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ అయిదు ఆయుధములను మనసార స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును అన్నది ఈ స్త్రోత్రం యొక్క ఫలం.
వేదం కీర్తించినట్లు పంచాయు ధాలు భగవంతునికి అలంకారాలు. చక్రం మనస్త త్వాత్మకం, శార్గ్ఞం గుణ తత్వాత్మకం, కౌమోదకి బుద్ధి త త్వాత్మకం, నందకం జ్ఞానతత్వాత్మకం, ధనువు అహం కార తత్వాత్మకం.
వీటితో భూషితుడైన సర్వప్రహరణాయుధుడు ఆ శ్రీహరి సర్వ జగద్రక్షకుడై ఉండగా మనకు భయమేల అన్న భరోసాతో మనం జీవించాలి.
No comments:
Post a Comment