శివం - 111
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
( నేను అనగా శివుడు.. కార్తికేయుడు మార్గమధ్యంలో బాల ఆంజనేయుడు కథ వివరిస్తున్నాడు.. ఆ కథలో భాగంగా ఆంజనేయుడు పార్వతీ మాత దగ్గర ఫలములు తిన్న తర్వాత గంగని జటలో నుంచి రాగా దాహము తీర్చుకున్నాడు)
నేను "కార్తికేయ నీ రచన బహు ముచ్చటగా ఉన్నది.. బాల ఆంజనేయుడు కథ తరువాత ఏమైనదో చెప్పు."
కా"గురువా గురువా ఇంకెంతసేపటికి మీ ఇల్లు వస్తుంది"
నేను "ఈ కథ అయిపోయేసరికి కచ్చితంగా వస్తుంది"
కా "ఇదేదో కథ పూర్తిగా చెబితే కానీ తీసుకుపోను అన్నట్లు బెదిరిస్తున్నావయ్యా "
నేను "అలాగే అనుకో ముందు కథ కానీ "
కా " పోనీలే గురువా ఒకందుకు నాకు అద్భుతమైన ప్రేక్షకుడు దొరికినందుకు అత్యద్భుతమైన శ్రోత దొరికినందుకు మాదానందంగా ఉంది ఈ కథ అయిపోగొట్టే మీ ఇంటికి వెళ్దాం"
కథ లో
{దాహం తీరిన ఆంజనేయుడు.. కాసేపు అల్లరి చేసి కల్లబొల్లి మాటలు చిలిపిగా మహాదేవుడికి చెప్పి మహాదేవుడికి ముచ్చట కొలిపి.. చిన్నపిల్లవాడివలె మహాదేవుడి భుజాల మీద చేతులు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఎన్నో ముచ్చట్లు చెప్పసాగాడు.. పార్వతి మాత కూడా ఈ తతంగం చూస్తూ పొంగిపోయింది
కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు హనుమంతుడు
అమ్మయ్య ఒక గోల తప్పింది అనుకుంది పార్వతి దేవి..
కానీ మహాదేవుడు ఊరుకుంటాడా ఆంజనేయుడు నిద్రపోతే అల్లరి చేసే వాళ్ళు ఎవరు? తన జటలో నీళ్లు కొంచెం కావాలని వదిలి ఆంజనేయుడు ను నిద్ర లేపాడు..
మళ్లీ ఆంజనేయుడు లేచి గోల గోల చేశాడు..
పార్వతీదేవి" ఇలా గోల చేస్తే ఎలా ఆంజనేయ అందరికీ అద్దోపొద్దు ఉండదా.. మహాదేవ అసలు అల్లరి చేసేది మీరే పడుకున్న వాడిన నిద్రలేపి మరీ దగ్గరుండి అల్లరి చేయిస్తున్నారు. అమాయకుడైన ఆంజనేయుడు మీద గోల చేసేవాడిని నింద వేస్తున్నారు."
బాల ఆంజనేయుడు " అవును మాత మీరు సత్యము గ్రహించారు.. బాలుడైన నేను అల్లరి చేయకుండా ఉంటానా అలాంటి నా సహజ లక్షణాన్ని మహాదేవుల వారు మరింత గా ప్రేరేపించి.. మీ చేత నన్ను తిట్టిస్తున్నారు."అంటూ మహాదేవుల వారి మీద అలిగి పార్వతీమాత వద్దకు చేరుకున్నాడు
శివుడు "బాగు బాగుంది పార్వతి నీకు నేనంటేనే అలుసు.. నాకోసం తపస్సు చేశా అంటావు ఎదురుగా ప్రత్యక్షంగా ఉంటే ఇలా విమర్శిస్తూ ఉంటావు.. తల్లి యొక్క మనస్తత్వం ఏమిటో బిడ్డని సమర్థిస్తూ చూపించావు ఇప్పుడు ఆంజనేయుడు నామీద అలిగాడు అతను అలకడంచటానికి నేను ఏమి చేయాలి.."
అంటూ ఆంజనేయుడు దగ్గరికి వెళ్లి "హనుమాన్ నా మీద నువ్వు అలిగావా నా మీద నీకు కోపంగా ఉందా"
అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుపోయాడు
హనుమాన్ "బోలె బాబా మీ వల్ల నేను అమ్మ దగ్గర తిట్లు తింటున్నా.. నాకు మీ మీద కోపం లేదు అలక ఉంది "
నీ అలక తిరుచాలంటే నాకు ఏమి చేయాలో తెలుసులే హనుమాన్ అంటూ పార్వతీదేవి వైపు చూసి ఆనందంగా నవ్వాడు
బాల హనుమంతుడిని పార్వతీ మాత చిన్నపిల్లాడి వలె ఎత్తుకున్నది శివుడు వెళ్లి మాదాలవంతుడు దగ్గరికి ఏదో చెప్పబోతుండగా ఇష్టం లేనట్టు తలకాయ అటు తిప్పాడు ఇటు వస్తే మళ్లీ ఇటు తిప్పాడు..
శివుడు హనుమంతుడు చెవి దగ్గరికి వెళ్లి నాకెంతో ఇష్టమైన నామం ఒకటి ఉన్నది అది నీకు చెప్పమంటావా అంటూ "రామ్ "అని చెవి దగ్గర అన్నాడు
అంటే ఆంజనేయుడు మనసు వైమర్చిపోయి తను కూడా తిరిగి రామ్ అని అన్నాడు.}
ఈ కథ వింటూ మీ త్రిమాతలు ద్విమూర్తులు.. కైలాస పరివారం.. మరియు ముఖ్యంగా ఆంజనేయుడు ఎంతో ఉల్లాసంగా ఉన్నారు ఆంజనేయుడు అయితే సాక్షాత్తు నేనే కథలో రామ్ అని అన్నానని ఎంతో మహదానందంగా పొంగిపోయాడు..
కథ లో
{శివుడు "ఆంజనేయ మనము రాముడు దగ్గరికి వెళ్దాం వస్తావా?"
అలా అనగానే బాల హనుమంతుడు ఏదో ఒక మత్తు ఆవరించినట్టు ఉన్నఫళంగా మహాదేవుని వారి మీదకు దుమ్కాడు
పార్వతీ మాత మాత్రం" ఎలాగో నా బిడ్డ నా దగ్గరికి వస్తే మళ్లీ మీరు ఎత్తుకొని తీసుకు వెళ్లలేక ఊరుకోరు కదా "అని వెక్కిరించింది
హనుమంతుడు " మహాదేవ మనము రాముల వారి దగ్గరికి వెళ్దాం అన్నావుగా ఎప్పుడు వెళ్దాం" అని అన్నాడు చిన్నపిల్లడు ముద్దుగా అడిగినట్లు
శివుడు " హనుమ నువ్వు నా భుజాల మీద కూర్చో అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడే వెళ్లి రామున్ని కలిసి వద్దాము "
రాముడు అంటే హనుమంతుడికి మనసు పొంగిపోతుంది.. ఆయన కోసం జన్మించిన భక్తుడు మరియు భగవంతుడు హనుమంతుడు కదా.. రాముడనంగానే అందరినీ మర్చిపోయాడు..}
హనుమంతుడు ఈ సన్నివేశాన్ని విని ఆనంద భాష్ప ఫరి తమయ్యాడు..
హనుమంతుడికి వెనక నుండి హనుమాన్ అనే ఒక శబ్దము వినపడదు
వెనక్కి తిరిగి చూసినా హనుమంతుడికి సాక్షాత్తు మహావిష్ణువు మళ్లీ రాముడి వలె హనుమంతుడు ముందు ప్రత్యక్షమయ్యాడు
హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి "నాకోసం వచ్చావా? నాకోసం నీవు తప్పక వస్తావు.. నువ్వు తప్ప నాకు వేరే ఎవరున్నారు తండ్రి "అంటూ శ్రీరామచంద్రుడి పాదాల దగ్గర కూర్చొని ఆర్తి గా ఆలపిస్తున్నాడు ..
ఈ సంఘటన చూసి మిగతా వారందరూ..
రాముల వారి మీద హనుమంతుడుకున్న భక్తిని చూసి ఆహా భక్తి అంటే ఇది కదా మాధుర్యం అంటే ఇది కదా. అంటూ పరవశించిపోయారు
ఆంజనేయుడు ఆనంద భాష్పాలతో
"రామయ్య నాకోసం నువ్వు వచ్చావా! రామయ్య ఇంతకన్నా ఆనందం ఇంకేం ఉంటుంది.. ఇంతకన్నా పరవశం ఇంకేముంటుంది.. ఆరోజు నీతో నేను వస్తానని చెప్పినా నీవు చిరంజీవి ఆంజనేయ లోకం కోసం నువ్వు ఇక్కడే ఉండు అంటూ సరైనది లోకి అంతర్దానమయ్యారు .. ఈ కోతిని వదిలేసి పోయావా రామయ్య" అంటూ రాముల వారి చేతులు తీసుకొనీ ఆ చేతులలో తన మొహాన్ని పెట్టుకున్నాడు..
రాముడు " హనుమ నీవు నేను వేరా?"
తప్పిపోయిన పిల్లవాడికి తన తల్లి కనపడితే వాటేసుకొని ఏడ్చినట్టు.. హనుమంతుడు రాముని వాటేసుకొని భక్తితో కూడిన తన్మయత్వంతో కనపడ్డావా తండ్రి అంటూ ఏడుస్తున్నాడు
అందరూ కార్తికేయని కథ వల్ల విష్ణు దేవుడికి కూడా రాముల వారి అవతారం ఎత్తుదామని కోరిక కలిగించాడు .. ఏది ఏమైనా మీరందరినీ చూస్తున్న మనం ధన్యులం అంటూ బహు ఆనందపడ్డారు
ఆంజనేయుడి భక్తి ఆనందం గమనించిన నేను కూడా పరవశించి పోయాను
ఈ కథ చెబుతున్న కార్తికేయుడు కూడా హనుమంతుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. బహు చక్కగా వివరిస్తున్నాడు..
(ఇంకా ఉంది...)
No comments:
Post a Comment