దైవం పక్షపాత రహితుడు - అచ్చంగా తెలుగు

దైవం పక్షపాత రహితుడు

Share This
దైవం పక్షపాత రహితుడు
సి.హెచ్.ప్రతాప్ 



శ్లో:సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।

(భగవదీత 9 వ అధ్యాయం, 29 వ శ్లోకం)

ఓ అర్జునా, నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో, అనన్యమైన భక్తితో  నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.అనుపలభ్యమైన నా రక్షణ కవచమును వారికి ఎల్లవేళలా ప్రసాదిస్తాను అని పై శ్లోకం భావం.

మానవులకు ఎన్ని వ్యాపకాలు ఉన్నప్పటికీ తమ సంతానానికి సర్వం సమకూర్చదంలోనూ, వారిని ఎన్నివేళలా కనిపెట్టుకొని వుండదంలోనిమగ్నమై వుంటారు. అట్లే భగవంతుడు కూడా ఈ సృష్టిలో తన చేత సృష్టించబడిన సర్వ జీవులను తన సంతానంగా భావించి వారి జీవిరాచసరములకు కావలసిన వాటిని సమకూరుస్తుంటాడు. భూమి, పర్వతాలు, అరణ్యాలు, సాగరాలు అనే బేధం ఎరుగకుండా అన్నింటిపై సమానంగా కురిపించే వర్షం వంటి వాడు భగవంతుడు అని వేదాలు తెలియజేస్తున్నాయి.పడే వానకి ఎలాంటి పక్షపాతం లేదు, అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి వాన బిందువులు బాధ్యత కాదు, వాటిని అందుకునే వాటి క్షేత్ర స్వభావాల్లో తేడాయే కారణం.వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచే ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకున్నారు అన్న విషయం సాధకులు గ్రహించాలి. ప్రతీ ఒక్కరు  తాను విత్తిన దానినే కోస్తారు. చట్టం సార్వత్రికమైనది మరియు శాశ్వతమైనది. సాధకుడు తనకు వచ్చే మంచి చెడ్డలకు పూర్తి బాధ్యతను గ్రహించాలి. అతను ఎప్పుడూ ఇతరులపై నిందలు మోపకూడదు .భగవంతుని దయ, గాలి వలె, ప్రతిచోటా వీస్తోంది. నిర్భయ నావికులు తెరచాపలను విస్తరించి, ఆధ్యాత్మికత అనే సముద్రంలో వేగంగా పురోగమిస్తారు, అయితే సోమరి వారు ఉన్న చోటనే ఉంటారు.

చిన్న ప్రాణి చీమపైనా, పెద్ద ఏనుగుపైనా కాచే ఎండ వేడిమి ఒక్కటే, అదే భగవంతుని సమత్వ భావం అంటూ, మెండైన బ్రాహ్మణుడు ఉండేది, చండాలుడుండే సరిభూమి యొక్కటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పద కవితా పితామహుడు అన్నమయ్య ఆలపించాడు.

సమచిత్తునకు చంచలముగాదు అంతే  దృఢ మనస్కుడికి, న్యాయాధీశుడికి, సమభావం గలవాడికి, మనస్సు ఎప్పుడూ ఒకేవిధంగా వుంటుందని అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలిపాడు. అలా సమత్వ భావంలో వుండేవారికి, తానే సృజించిన దేహాలలో ఉండి జీవులను భగవానుడే వారి కర్మలనుండీ తరింపజేస్తాడని రుగ్వేదం చెబుతోంది.

భగవంతుడు కల్పవృక్షం వాంటివాడు, ఎవ్వరు ఏది కోరినా అతను దానిని ప్రత్యుపకారం ఆశీంచక ప్రసాదిస్తాడని వేదం చెబుతోంది.అందుకే భగవంతుడిని భక్త పక్షపాతి అని కూడా అంటారు. అయితే అ భగవంతుడి అవాజ్య కరుణకు పాత్రులం కావాలంటే ఆయన చూపిన సాధనా మార్గాన్ని అనుసరించడం ఎంతో అవసరం.

భగవత్ సంకీర్తనం వలన సర్వోత్కృష్టమైన ఆత్మానందం కలుగుతుంది. ఒక్కసారి ఆత్మానందానుభూతి కలిగితే అద్దం పై ధూళి తుడిచినట్లు చిత్త మాలిన్యం తుడిచి వేయబడుతుంది.ప్రాపంచిక విషయ భోగవాంఛలు చల్లారిపోతాయి.భగవంతుడిని తెలుసుకొని భాగవతుడవుతాడు.ఆనంద సాగరంలో తేలియాడుతాడు.

***

No comments:

Post a Comment

Pages