నిత్య సంతుష్టి తత్వమే శ్రేయోదాయకం - అచ్చంగా తెలుగు

నిత్య సంతుష్టి తత్వమే శ్రేయోదాయకం

Share This
నిత్య సంతుష్టి తత్వమే శ్రేయోదాయకం
సి.హెచ్.ప్రతాప్  



భగవద్గీతలో తృప్తి గురించి శ్రీకృష్ణుడు ‘‘మనం సృష్టించుకున్న ఆనందాన్ని అధిగమించాలి’’ అని మానవాళికి ప్రబోధించాడు. అట్లే సమస్త కర్మల పట్ల, వాటి ఫలితాల పట్లా సర్వదా ఆసక్తిని వదలుకొని, సంసార-ఆశ్రయ రహితుడై, నిత్యతృప్తుడైన మానవుడు కర్మల్లో చక్కగా నిమగ్నుడైనప్పటికీ అతను ఆ కర్మలకు కర్తకాదు అని కూడా చెప్పాడు.మానవులు చక్కత శ్రద్ధతో కర్మలను చేసి, కర్మ ఫలాలపై ఆసక్తిని ఒదులుకోవాలన్నది ఈ సూక్తి సారాంశం.ఈ స్థితికి చేరినవారు అనుకూల, ప్రతికూల పరిస్థితులలో కూడా సంతృప్తిగా ఉంటారు మరియు ఎన్నడూ కూడా ఎటువంటి ద్వందాలకు లోను కారు.

అనుక్షణం మన సర్వ శక్తులు ఒడ్డి , భోగాలు, ఆస్తులుగా మనం భావించి వెంబడించేవన్నీ ఎండమావులు తప్ప మరేవీ కావనీ, అలా వెంబడించడం వల్ల మనకు అనారోగ్యం, అలసట కలుగుతుందని అవగాహన ఏర్పడినప్పుడు... కర్మఫలాలమీద మోహం వదులుకొని, నిత్యతృప్తులం అవుతాం అని శాస్త్రం చెబుతోంది.

దాన ధర్మములు వ్రతపూజలు నిత్య నైమిత్తిక కర్మలు దైవభావముతో ఆచరించి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి మరియు ఏ పని చేస్తున్నా కూడా భగవత్ స్మృతికలిగి "మామనుస్మరయుధ్యచ" అని భగవానుడు చెప్పినటుల తానాచరించు ఆయాకర్మలు ఈశ్వరార్పణము చేస్తే చిత్తశుద్ధి కలుగగలదు మరియు అదే నిత్య సంతుష్టులమై వుండేందుకు దోహదం చేస్తుంది.

నిజజీవితంలో మనం చేసే ప్రతీ కార్యం చిత్తశుద్ధితో, ఆత్మ ప్రబోధానుసారం జరగాలి. మన మనసులో  జనించే ఆలోచనలు హృదయం వరకు వచ్చేసరికి, మంచిచెడుల అంతర్మధనం జరు గుతుంది.విజయవంతమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి దారితీసే ముఖ్యమైన అంశాలలో స్వీయ-సంతృప్తి ఒకటి.మనం  చేసే పనితో లేదా మనం విజయవంతం కావడానికి నిర్ణయించుకున్న లక్ష్యాలతో మనం సంతృప్తి చెందకపోతే, ఆ లక్ష్యాలు లేదా ఆ పని భారంగా మారుతుంది.

 చెడు వలదని ఆత్మ ప్రబోధిస్తున్నా, చెడు వైపే దృష్టి సారించడం దైవ ద్రోహమే. అంత రాత్మ అంగీకారమే దైవం మెచ్చిన సత్కారం. ఈ నిజాన్ని దాచి, అంత రాత్మకు విరుద్ధంగా ప్రవర్తించడం మానవ బలహనత. మానవుడు తన బలహనతలను జయించిన నాడు మహనీయుడు కాగలడు అన్నది శాస్త్ర వాక్యం.అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత మనిషి తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు. ప్రాపంచిక సుఖాన్ని కోరుకునే మనస్సు భోగలాలసతో, సుఖ సౌఖ్యాదుల కోసం మాత్రమే అర్రులు చూచుతుందనే సత్యాన్ని గ్రహిస్తాడు. క్షణికానందాన్నిచ్చే కోర్కెలు తీరిన తర్వాత ఏదో వెలితి, ఇదంతా భ్రమ అని బోధపడుతుంది. ఆ భ్రమ తొలగిన వెంటనే నిత్య తృప్తి, ఆత్మశాంతి అన్నది కోర్కెలు తీర్చుకోవడంలో కాదు, కోర్కెలను జయించడంలో వున్నది అన్న సత్యం అవగాహనకు వస్తుంది.

నిత్య సంతుష్టి అనేది భవంతునికి ఇష్టమైన భక్తుల లక్షణం. ఆ లక్షణమే  సాధకునికి భగవంతునికి ఇష్టమైన భక్తుడు అగుటకు సాధనము కూడా. అంటే ఈ గుణములన్ని సాధకులు , ముముక్షువులు అలవరుచుకోవాలి అని భగవంతుని సందేశము. ఈ గుణములు లేక లక్షణములు అలవరచుకొను వాడు, ఏ జాతి మత వర్ణాలకి సంభంధించినా, ఉత్తమ మానవుడు అవుతాడు.

స్వీయ-సంతృప్తి కోసం ఉన్నత స్థాయి స్వీయ-అవగాహన అవసరం. ఒక వ్యక్తి తన బలాలు మరియు బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఇది వ్యక్తికి వివిధ విషయాలలో అతను  ఎంత మంచివాడో చెడ్డవాడో తెలుస్తుంది. అతను జీవితం నుండి అతను  ఏమి కోరుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకునేలా చేస్తుంది. ఒక వ్యక్తి అతను  ఏమి చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు, అది ఆ వ్యక్తిలో అపారమైన సానుకూల అనుభూతిని కలిగిస్తుంది అందుకే మనం నిత్య సంతుష్టులమై మెలగదం ఎంతో అవసరం.

***

No comments:

Post a Comment

Pages