శివం - 112 - అచ్చంగా తెలుగు

శివం - 112

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


(నేను అనగా శివుడు. నేను కార్తికేయుడు వెళ్త ఉండగా మార్గమధ్యంలో తాను మొదలుపెట్టిన ఆంజనేయ కథలో.. భాగంగా కొన్ని సన్నివేశాలు వివరిస్తూ ఉండగా.. అక్కడికి స్వయానా వచ్చిన. హనుమ మీ త్రి మాతలు ముద్దు చేసిన తర్వాత సాక్షాత్తు విష్ణువు రామును వలె హనుమంతుని పలకరించగా ఆ సన్నివేశాన్ని చూసి పులకించిన అందరూ .) 

తరువాత జరుగు కథ

రాముడు ప్రత్యక్షంతో పులకించిన హనుమంతుడు ఎంతో బావఆవేశం లో మునిగిపోయాడు.. రాములవారిని ఆ లింగనం చేసుకున్నా హనుమంతుడు మాహాదానందముగా ఉన్నాడు..

రాముడు " హనుమ నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వైకుంఠనికి రావచ్చు.. నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు కైలాసానికి రావచ్చు.. నువ్వే కాబోవు బ్రహ్మవి.. ఇక నీకేమిటయ్యా ఈ దిగులు" 

హనుమాన్ " స్వామి రామచంద్ర అంటూ ఏమీ మాట్లాడకుండా ఆనాడు సీతమ్మ ఉంగరము తీసుకొచ్చిన తర్వాత.. నీ కన్నా బంధువు నాకెవరు హనుమాన్ ని వాటేసుకున్న ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి అదే ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్నాడు..

లక్ష్మీ మాత " స్వామి మీరు దయచేసి విష్ణు రూపంలోకి మారండి " 

పార్వతి మాత "విష్ణుమూర్తి కాదులే కానీ. మహాదేవుల వారికి తోడుగా వెళ్లే సమయం ఆసన్నమైంది.."


తదుపరి ఏమి జరగబోతుందో అని త్రిమాతలు.. కైలాస పరివారం ముల్లోకాలు ఎదురుచూడ సాగాయి 

నేను " సరే కార్తికేయ తదుపరి.. నేను ఆంజనేయుడి చెవిలో రామ నామం చెప్పిన తర్వాత ఏమైంది"


కార్తికేయడు "నువ్వేందయ్యా నువ్వు.. నేను చూడు అంటున్నా నువ్వు నేను అంటున్నావు ఓహో అదే వేషం లో ఉన్నావ్ కదా అని నేనని.. శివుడి గా స్థిరపడిపోయావా సరే తర్వాత కదా చెబుతా విను"

కథ లో 

{

శివుడు బాల ఆంజనేయుడు చెవిలో రామ మంత్రం చెప్పిన తర్వాత..
తన్మయత్వంతో హనుమంతుడు రామ్ రామ్ అనుకుంటూ.. పార్వతీ మత ఒడిలో నుండి
 శివుని బాహువులకు చేరాడు..

బాల ఆంజనేయుడు " మహాదేవ మరొక్కసారి రామనండి అని అడిగిమరీ అనిపించుకున్నాడు"

శివుడు " రామ్ అంటేనే నువ్వు అలా అయిపోతే మరి అయోధ్య వెళ్లి రాముడిని చూసి వద్దామా? "


బాల హనుమ " ఐ బలే బలే బలే.. వెళదాం పదండి మన అయోధ్యకి " 

పార్వతి మాత " ఏమి హనుమ రామనంగానే నన్ను వదిలేసి మహాదేవుల వారితో వెళ్ళిపోతావా , నీకోసం వచ్చిన నేను ఏం చేయాలి అని తిరకాసు పెట్టింది

బాల హనుమ "అమ్మ మా అమ్మ అంజనాదేవి ఎప్పుడు నీకోసం పూజ చేస్తూ ఉంటుంది కాసేపు నువ్వు మా అమ్మతో గడపవచ్చు కదా మా ఇద్దరమ్మలు అలా కలిసి ఆనందంగా ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది నాకోసం కోరిక తీర్చవా అంటూ ఆంజనేయుడు తిరకాసుకి అడిగి అడగకుండానే వరము లాంటి మాట తీసుకున్నాడు 


హనుమ " మహాదేవ జగత్ పిత రాముల వారి దగ్గరికి తీసుకెళ్తావా? "

శివుడు " అలాగే తీసుకెళ్తా కానీ "

బాల హనుమ " అవును మహాదేవ నాకైతే ఎగరటం వచ్చు మరి నీకు ఎగరడ వచ్చా? "

శివుడు " నాకు వచ్చు హనుమా నాకు వచ్చు కాబట్టే నా అంసేది నీవు కాబట్టే అది నీకు కూడా వచ్చింది.. సరే రా" అంటూ తిరునాళ్లకి పిల్లన తీసుకెళ్తున్న విధంగా మెడకు వేసుకుని.. ఒ కుదుటన శివయ్య గాలిలోకి ఎగిరాడు"

బలే బలే అంటూ ఆనందపడుతున్నా హనుమంతుడు ఊరికే ఉండకుండా శివుడు మెడలో నాగరాజని గట్టిగా పట్టుకొని.. అల్లరి చేయటం మొదలుపెట్టాడు.. హనుమంతుడి దెబ్బ శివుడు దెబ్బ ఒకేలా కనిపిస్తుంది నాగరాజుకి.. కసుకసుమని బుసని అన్నాడు..

శివుడు " హనుమ ఎందుకు నాగేంద్రుని ఇబ్బంది పెడతావు అల్లరి చేస్తావు.. అని అనగానే చాప మీద నుంచున్న  విధంగా  గాలిలో ఎగురుతున్న శివుడి మెడ మీద భోజనానికి కూర్చున్న బుద్ధిమంతుడిలాగా బాసిపట్లు వేసుకొని కూర్చున్నాడు 

గాలిలో రివ్వున ఎగురుతున్న శివుడికి ఆయన పైన కూర్చున్న ఆంజనేయుడికి మహాదేవుడు ఎన్నో సృష్టి రహస్యాలు ఖగోళ వింతలు సాంకేతిక పరంగా కూడా వివరించాడు..

శివయ్య "హనుమ అదుగో అయోధ్య రాబోతుంది."

బాల హనుమ " ఇక్కడైనా రాముడు ఉండేది హై బలే బలే బాధ రాముని చూడటానికి ఇక్కడికే వస్తున్నాను భలే భలే అంటూ ఆనందంగా శివుడి మెడ మీద చేతులు వేసుకొని ఆయన మెడ మీద పడుకొని బుగ్గలకి ముద్దులు పెట్టాడు." 
}

ఈ కథ వింటున్న నాకు.. రాముని వాటేసుకున్న ఆంజనేయుడికి ఎంత ఆనందం కలిగిందో నాకు కూడా నన్ను ముద్దు పెట్టుకున్న బాల ఆంజనేయులు తలుచుకుంటే అంత ఆనందమేసింది..

నేను "హనుమ అయోధ్య వచ్చేసింది." 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages