శ్రీథరమాధురి - 122 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 122

Share This

                                                      శ్రీథరమాధురి - 122

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వచనాలు)




నమ్మకం ఎన్నడూ ప్రశ్నించదు. నమ్మకానికి శరణాగతి వేడడం ఒక్కటే తెలుసు. నమ్మకం సందేహాలకు అతీతమైనది. అన్ని చర్యల్లోనూ దైవాన్ని 100% నమ్మాలి, లేకపోతే మనం దాన్ని నమ్మకము అనలేము. మీరు మనుషులని, కొన్నిటికి లొంగాలని సాకులు చెప్పలేరు. నిజానికి మీరు మనుషులు కనుకనే ప్రతికూల శక్తులకు లొంగకూడదు. మీరు దైవేచ్ఛకు మాత్రమే లొంగాలి. దైవం పట్ల మన నమ్మకం, అంకితభావం విషయంలో మన బూటకంగా ఉండకూడదు. దైవం ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు, ఆయన మనకు అంతు చిక్కరు. మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసు కనుక అదే చేస్తారు. కాబట్టి నమ్మకం విషయంలో చలించకండి, స్థిరంగా ఉండండి.
  
***
మేఘాలను దాటి వెళ్ళినప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఆకాశాన్ని స్పష్టంగా చూడగలరు.
 
మనసులోని సందిగ్ధాలు మేఘాల వంటివి. మీరు సందిగ్దాలనే చూడకండి. వాటి గుండా చూడండి. వాటి గుండా చూసినప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది.
 

స్పష్టమైన ఆకాశాన్ని చూడాలంటే ఒకరు మేఘాల గుండా చూడాలి. కానీ చాలామందికి ఆ నైపుణ్యం ఉండదు, కేవలం మేఘాలనే చూస్తారు.

***
శృతనుమన ప్రజ్ఞాభ్యమన్య విషయా విశేషార్థాత్వాత్ - పతంజలి.
 
మీరు ఒక యోగి లాగా ఉంటే మీ జ్ఞానం మీ జ్ఞాపక శక్తి పై ఆధారపడి ఉండదు, కానీ మీ లోపల ఉదయించిన విచారణకు తక్షణమే స్పందిస్తుంది.

మనసులో సందేహాలు తలెత్తితే, అద్దంలో సహజంగా ప్రతిబింబించే వస్తువులా బుద్ధి దానికి సమాధానం చెబుతుంది. 
 
మనస్సునే అద్దంలో తలెత్తిన సందేహం తక్షణమే, అద్దంలో వస్తువు ప్రతిబింబించినట్లుగా సమాధానమై ప్రతిఫలిస్తుంది. 
 
ఒక యోగికి ఆ స్థాయిలో జాగరూకత, అవగాహన ఉండడంవల్ల వారు సదా అప్రమత్తులై ఉంటారు.

***

No comments:

Post a Comment

Pages