అనన్య భక్తి ప్రాశస్థ్యం
సి.హెచ్.ప్రతాప్
శ్లో: అనన్య చింతయోమాం ఏ జన: పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగ క్షేమం వహామ్యహం ||
పై శ్లోకం భగవద్గీత లోనిది. అంటే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను అని అర్ధం.కాబట్టి ఎవరు భగవంతుడిని సదా స్మరిస్తారో, స్వార్ధం లేకుండా చింతిస్తారో వారికే భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది.అంతేకాక భగవంతుడు అర్జునిడిని నిమిత్తమాత్రంగా చేసుకొని బోధించిన భగవద్గీతలోని 8 వ అధ్యాయం, 14 వ శ్లోకంలో ఓ పార్థా, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి అని కూదా స్పష్టమైన అభయం ఇచ్చాడు. ఈ రెండు శ్లోకాల అనుగుణంగా మనన్మందరం భగవంతుని పట్ల అనన్య భక్తి కలిగి వుండదం ఎంతో అవసరం అన్నది స్పష్తమైతొంది కదా.
అనన్య భక్తి అంటే వేరే ఏ ఇతరమైనదీ లేకుండా, మనస్సు కేవలం భగవంతుని దివ్య మంగళ స్వరూపము యొక్క - నామములు, రూపములు, గుణములు, లీలలోనే నిమగ్నమై ఉండాలి. సాధనా యొక్క లక్ష్యం మనస్సుని పరిశుద్ధి చేయటమే, ఇది కేవలం మనస్సుని అత్యంత పవిత్రమైన భగవంతునికి అనుసంధానం చేయటం ద్వారానే సాధ్యము. కానీ, మనం మనన్సుని భగవత్ ధ్యానం ద్వారా శుద్ది చేసినప్పటికీ, మరల దానిని ప్రాపంచికత్వంలో ముంచి మలిన పరిస్తే, మరిక ఎంత కాలం ప్రయత్నించినా, మనము దాన్ని శుద్ధి చేయలేము.పరుల ద్వేషపూరిత హృదయాలలో శాంతి రాజ్యమేలదు. సహనం, పట్టుదల మరియు సహనంతో ఆధ్యాత్మికత యొక్క పవిత్ర మార్గాన్ని అనుసరించే వారు మాత్రమే దీనిని సాధించగలరు. ఇందులో సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ఒకడు తన మనసును ఛిన్నాభిన్నం చేసి అందులోని ఒక్క ముక్కను భగవంతుడికి సమర్పించకూడదు. మనస్సు పూర్తిగా పరమాత్మలో లీనమై ఉండాలి.
కృష్ణుడు అర్జునుడితో, “నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. మన మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఆధ్యాత్మిక సామీప్యత లభిస్తే నేను మీ దృష్టిలో ఉంటాను మరియు మీరు నా దృష్టిలో ఉంటారు"అని కూడాశ్ చెప్పాడు అంతే పరోక్షంగా భగవంతుడిని చేరుకునేందుకు అనన్య భక్తి ఒక్కతే మార్గమని స్పష్టం గా చెప్పాడు. నన్ను ఆరాధించే నాలుగు రకాల పుణ్యాత్ములు ఉన్నారు: బాధలో ఉన్నవారు, జిజ్ఞాసువులు, సంపదను కోరుకునేవారు మరియు జ్ఞానాన్ని పొందే వ్యక్తి. వీరిలో, జ్ఞానవంతుడు, నాతో ఎప్పుడూ ఐక్యంగా ఉన్నవాడు మరియు నాకు ప్రత్యేకంగా అంకితం చేయబడినవాడు ఉత్తముడు, ఎందుకంటే నేను అతనికి చాలా ప్రియమైనవాడిని మరియు అతను నాకు ప్రియమైనవాడు. ఈ వ్యక్తులందరూ నిజంగా గొప్పవారే, కానీ నేను జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నా నేనే అని నేను భావిస్తాను, ఎందుకంటే అలాంటి భక్తుడి మనస్సు నాపై స్థిరంగా ఉంటుంది. అంతే అనన్య భక్తి ద్వారా మాత్రమే భగవంతుడుని పొందడం సాధ్యం.
భగవంతుడిని నిరంతరం గుర్తుంచుకొని, సదా స్మరించే వారిని నిత్య భక్తులంటారు. అలా కాకుండా భగవంతుడిని కష్టాల సమయంలోనే, కోరికలు తీర్చేందుకు మాత్రమే గుర్తుంచుకొని, ప్రార్ధించేవారిని అవకాశపు భక్తులని అంటారు.
No comments:
Post a Comment