చెన్నకేశవ శతకము - గరిమెళ కృష్ణమూర్తి - అచ్చంగా తెలుగు

చెన్నకేశవ శతకము - గరిమెళ కృష్ణమూర్తి

Share This
చెన్నకేశవ శతకము - గరిమెళ కృష్ణమూర్తి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయం:

చెన్నకేశవ శతకము సుమారు 1921-22 సంవత్సరకాలంలో రచింపబడినది. ఇది గరిమెళ కృష్ణమూర్తిగారి ప్రథమ రచన. కవి ఈ శాతకాన్ని తన అన్నగారైన నారాయణమూర్తి ప్రోత్సాహంతో పాశర్లపూడి వేలుపైన చెన్న కేశవస్వామి సంభోదిస్తూ రచింపబడినది. ఈ కవి ఈ శతకాన్ని వారంరోజులలో పూర్తిచేసినట్లు చెప్పికొనినాడు. ఈ కవి తన గురించి ఈ శతకంలో ఏమి చెప్పుకొనలేదు. ఈకవి జీవితవిశేషాలు గానీ ఇతర రచనల గురించి గాని ఎటొవంటి సమాచారము లభించలేదు.

శతక పరిచయం:

"చెన్నకేశవా" అనే మకుటంతో చంపకోత్పలమాల వృత్తాలలో వ్రాయబడిన ఈశతకం భక్తిరస ప్రథానమైనది. ఈశతకం పాశర్లపూడిలో వెలసిన చెన్నకేశవస్వామిపై రచింపబడినది. కవి ఈ శతకాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు. అవి 1. సగుణ శతకము, 2. మహిమ శతకము, 3.శృంగార శతకము, 4.  ప్రకృతి శతకము, 5. మానస శతకము, 6. సాంఘీక శాతకము, 7. నీతి శతకము, 8. నిర్గుణ శతకము. కవి ఈ విభాగాలకు శతక నామకరణము ఎందుకు చేసెనో తెలియరాలేదు.

ఇప్పుడు ఒక్కొక్క విభాగము నుండి కొన్ని పద్యములను చూద్దాము.

సుగుణ శతకము:
ఉ. కాళీయదర్ప సంహారణ కంసవిభేదన ధేనుకాది దై
త్యాఇ పరాసుకారణ మహావిభవాసుర రావణాంత భూ
సాళి విమోచనాయుతశుభాన్విత పాండవపక్షపాత భూ
తాళి కధిష్ఠవర్తన విధానచరితన చెన్నకేశవా

ఉ.పాలిత యుగ్రసేన పరిపాలిత పాందవపంచకా సమాలోల
ధనంజ యాత్మపరిలోల విభంజనతత్త్వలోల వా
తూల సురద్విషాంతక విధుంతుద సంభవహేతుభూత పా
తాళ సమర్పితోగ్ర బల్దైత్య మురాంతక చెన్నకేశవా

చం. నళినదళాక్ష మాధవజనార్ధన శత్రుజితోగ్రచక్ర సం
కలితభుజాగ్ర పాండవనికాయసమర్ధన వంశవర్థ నో
జ్వలిత దవాగ్ని భోజన సువర్ణశరీర సుధన్వ కేశవాయ భూ
తలపురుషోత్తమాచ్యుత పతంగతురంగమ చెన్నకేశవా

మహిమ శాతకము:
ఉ. ఉరగభయంకరోన్నతశిరోపరితాండవరంగభూమి సు
స్థిరశయనోన్నతామలవిధిస్తవశేషభుజంగ మంబు నీ
కరయుగతల్ప మందుఁదరిఁగాననిసింధువుఁ గాపురస్థలం
బరిమురిఁగాదె నీచరిలద్భుతమన్నిట చెన్నకేశవా

చం. పరమఖలుండు రావణుఁడు బాహుబలంబున లంకనేలుచున్
ఖరుడుముఖాది సైనికులఁ గాపురముంచెను దండకాటవినిన్
పరమమునీంద్రసంఘముల భారతదేశమునందుబాధలన్
బొరియఁగ జేయ చెల్లినవె బోరిజయింపవె చెన్నకేశవా

శృంగార శతకము:
ఉ. రాసవిహారకేళి నొకరామకు రామకు మద్య నీవు నెం
తో సమయోచితాకృతి యధోచితవేషముబూని గ్రోవితో
భాసిలు హస్తపద్మమిరువాగులఁ గోపికలంటిరాగన
భ్యాసవిచిత్రలాస్యమున బాడుట నెంతును చెన్నకేశవ

చం. మకరపతాకసంగరసమాహ్వయలాంచనవేణునాద మా
గకవనవాయువీచికలఁ గర్ణరసాయనమైఁ దనర్చినన్
సకలముఁబాసి గాంతలభిసారికలై నినుగూఁడ రాగ చెం
తకు యమునాంబు తిన్నెలకుఁ దార్చుట నెంతును చెన్నకేశవా

ప్రకృతిశతకము
చం. అరయ నిమేషమాదిగల యబ్దములెన్ని గతించు చాయువున్
హరణమొనర్చె గాని సమయంబగు నొక్కనిమేషమందు నీ
స్మరణమెఱుంగ కాలమనిశంబునుబోయె వృధా! భవాబ్ధినే
స్థిరమని నమ్మిబొందితినిఁజేటు జనర్ధన చెన్నకేశవా

చం. పరిచయ పండితోత్తముల భావములుత్తముగాదు గ్రొత్తలౌ
గురువులభింప డెచ్చటను ఘోరవనంబుల నుండునేమొ నా
పరిచయభాష్యపాళి బలవంతముసేయవు శంకబోవు నే
నరుఁడనిగాని గృష్ణుడిక నాకు లభింపడు చెన్నకేశవా

మానసశతకము:
చం: అలయదు సిగ్గుచెందదు మహద్భుతసంగతినెట్టివస్తువుల్
గలసిజనించె మానసము గాసిలకొక్కక్షణంబులోన వం
దలు పదినూర్లు లక్ష లయుతంబులు నర్బుత సంఖ్యలైన వాం
చలు జనియింపజేయుటకు సారసలోచన చెన్నకేశవా

ఉ. స్థితిచెడి పెంపుకుక్రుంగి తగుచేతలులేక కుమరులెల్ల దు
స్థితికిరవైన దుర్జనుడు చేటులొనర్చుచు జీవశేషమున్
బ్రతికిన పట్టుబుచ్చుటకు బ్రాల్పడుగాని రమేశ నిన్ను నే
కతమున సంస్మరింప మది గాంక్షవహింపడు చెన్నకేశవా

సాంఘికశతకము:
చం. వలచుట చక్కజేయుట శుభప్రదరూపముదాల్చుటాత్మ భ
ర్తల వికసింపజేయుట కరంబనురాగము విద్యనేర్వకే
గలిగిన నైజవర్తనజగంబలరించెడు విద్యనేర్చినన్
పొలతు లికెంతవారగునొ బుష్కరలోచన చెన్నకేశవా

ఉ. మోసము బానిసత్వ మిల మోసము వర్తకవృత్తి భిక్ష
ష్బ్రాపము యాచకాళికి విపత్తు కవిత్వసమర్ధనంబు ల
ధ్యాపకవృత్తి పంచమజనార్హకమయ్యెను యిట్టి సర్వలో
కాదలందు సేద్యము సుఖంబిడు విప్రుకు చెన్నకేశవా

నీతి శతకము:
చం. కనుఁగొని రూపురూపవలెగాని వ్రణంబు ఋణంబు శేషముం
చిన పరశేషమట్లు కడుచేటు సుబాహు హతంబొనర్చి ద
మ్ముని మిగిలింప లేడియయి మోసముఁజేసి మహిజ లంకలో
మనికికి హేతువయ్యెగద మాధవ శ్రీకర చెన్నకేశవా

ఉ. పెట్టిననాడె చుట్టములప్రీతి గడించిననాడె భార్యతో
బట్టురమింప శత్రువులు బారుట శూరతజూపునాడె హోం
బట్టువుదాల్పుటంతకిరవైన ధనార్జననాడె తీర్థముల్
మెట్టుట పిన్ననాడె పరమేశరశ్రీ[అతిచెన్నకేశవా

నిర్గుణశతకము:
ఉ. ఆదినసత్తు రూపవివిధాకృతిదోపకయుండ దానిక
త్యాదిది సత్తురూపవివిధాకృతులొప్పగ జేసి యన్నిటన్
మాదిరి బట్టియున్ననిను నామవుఁడెవ్వడు విశ్వరూపిగా
గాదనకెంచువాఁడు నినుఁ గాంచినవాడిల చెన్నకేశవా

ఉ.మూలమెఱింగి చిత్తమూన్ మోహముజంపి తురీయభావనా
లోలుడు జాగతంభావములోబడి తత్త్వము విస్మరింపగా
బోలడనేకవాశితరవోక్తులు దాటిమురారిగోవిందౌ
యీలలె!రుంగు గోపికల యీప్సిత మట్టులు చెన్నకేశవా

చం. కలిగినశంకలన్ విడచి గాయముద్రిప్పగమూలమైన యే
దెలివి నిరంతరంబు దనతేజము పెంపున జీవభావమున్
గలుగ జరించి సంసరణ కర్మనిబద్ధముజేయుచున్న దా
తెలివి పరాత్పరుడంచు దేలుటలేదకో చెన్నకేశవా

ఇటువంటి యెన్నొ చక్కని పద్యాలున్న ఈ చెన్నకేశవ శతకము అందరు చదువదగ్గది. 

No comments:

Post a Comment

Pages