దక్షిణ - ప్రదక్షిణ - అచ్చంగా తెలుగు

 దక్షిణ - ప్రదక్షిణ

అంబడిపూడి శ్యామసుందర రావు 




ఈ రెండు మాటలను  గుళ్ల  లోను ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు వింటూ ఉంటాము మొదటిది దక్షిణ అంటే మనము పూజ చేయించుకునేటప్పుడు ఆ పూజ చేసిన పూజారికి మనము పండు తాంబూలంతో పాటు  సమర్పించే దక్షిణ అలాగే ఇళ్లలో పూజలు చేయించుకునేటప్పుడు కూడా దక్షిణ ఇస్తూ ఉంటారు. ప్రదక్షిణ అంటే గుడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనానికి ముందు భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుని  చుట్టూ చేసేదే ప్రదక్షిణ సాధారణముగా గుడిలో చేసే  ప్రదక్షిణలు ఒకటి లేదా మూడు సార్లు ఉంటాయి కొన్ని సందర్భాలలో మొక్కుగా 108 ప్రదక్షిణలు చేయడం చూస్తూ ఉంటాము.అంటే దక్షిణ ను పూజారికి సమర్పించుకుంటాము ప్రదక్షిణలు దేవునికి సమర్పించుకుంటాము. 

పూజాదికాలు యజ్ఞ యాగాదులు మనంతట మనము చేసుకోలేము కాబట్టి వేదం చదువుకున్న పూజారులను ఆశ్రయిస్తాము వారు వీటిని చేయడానికి దక్షత కలిగిన వారు కాబట్టే వారికి ఇచ్చేదే దక్షిణ మనము వారికి దక్షిణ ఇస్తున్నాము అంటే వారి లో ఉన్న వేద  విద్యకు మనము ఇచ్చేదే దక్షిణ అంటే వారు చదువుకున్న వేదానికి విలువకట్టే సమర్ధత మనకు ఉండదు కాబట్టి మనకు తోచిన విధంగా మన శక్తి కి తగ్గట్టుగా దక్షిణ ఇస్తాము దక్షిణ ఇవ్వకపోతే మనము చేయించుకున్న పూజకు ఫలితం ఉండదు. కాబట్టి మన హిందూ ధర్మమూ ప్రకారము గుళ్ళలో అర్చనలు అభిషేకాలు పూజలు లేదా ఇంటి వద్ద మనము చేయించుకునే క్రతువుకు విధిగా పూజారికి దక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమము దక్షిణ తీసుకున్న బ్రాహ్మణుడు దీవిస్తాడు. వేదము అంటే దైవము, పూజారులు మనకు కనిపించని దైవాన్ని మంతము రూపంలో మనకు వినిపిస్తారు మన  తరఫున దేవునికి వేదోక్తముగా పూజారులు పూజలను నిర్వర్తిస్తారు అంటే మనకు దేవునికి మధ్య సంధాన కర్త పూజారి అటువంటి పూజారికి కృతజ్ఞతా పూర్వకముగా మనం సమర్పించేదే దక్షిణ రూపంలో మనము ఇచ్చే పైకం  మనము పని చేయించుకున్నకా  ఎవరినైనా ఒట్టి చేతులతో పంపము మరి ముఖ్యంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులను అలా ఒట్టి  చేతులతో పంపకూడదు. అలా చేస్తే అది అధర్మం ఈ విషయాన్నీ వాల్మీకి రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మము ఆ ధర్మాన్ని పాటిస్తేనే పూజకి ఫలితము ఉంటుంది. 

పూజారులు పూజలు చేసేటప్పుడు వారి కంఠం, స్వరం, ఊపిరితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణముగా లయబద్ధముగా మంత్రం భాగాన్ని తప్పులు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహిస్తారు కాబట్టే అంత కష్టమైనా పనికి (మనకు చేతకాని పనికి) మనము ఇచ్చేదే దక్షిణ పూజలు మాత్రమే కాకుండా పూజారుల దగ్గరకు ముహుర్తాల కోసం జాతకాలు చెప్పించుకోవటం కోసం మంచి చేడు  తెలుసుకోవడం కోసం వెళుతుంటాము అప్పుడు కూడా వారికి దక్షిణ ఇవ్వకపోతే ఫలితం ఉండదు వారికి మనము ఋణపడి  పోతాము. దక్షిణ తీసుకున్న బ్రాహ్మణుడు అందజేసే దీవెనలు మనకు  మంచి చేస్తాయి.

ఇంతకూ ముందు చెప్పినట్లుగా ప్రదక్షిణ అనేది పూజారి ప్రమేయము లేకుండా మనము దేవుడికి  సమర్పించేదే ప్రదక్షిణ ముందు దేవాలయంలో దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనానికి వెళతాము తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లినప్పుడు క్యూల అంతరార్థం అదే. అలాగే చిలుకూరు   శ్రీ బాలాజీ గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు 18 ప్రదక్షిణాలు చేసే దర్శనం చేసుకుంటారు వారి కోరిక నెరవేరి నప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తారు  అలాగే అరుణాచలేశ్వరుని దర్శనానికి ముందు గిరి ప్రదక్షిణ (14 కి మీ ) చేసి దర్శనము చేసుకుంటారు ప్రస్తుతం చాలా గుళ్ళలో (కొండపై వెలసిన దేవుళ్ళు ఉండే గుళ్ళలో) ఈ గిరి ప్రదక్షిణలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా దేవునికి మనము సమర్పించేది ప్రదక్షిణ పూజారికి మనము సమర్పించేది దక్షిణ కాబట్టి వాటి ప్రాధాన్యత గమనించి ఈ రెంటిని నిర్వర్తించండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఆటోలలో తిరిగి పూర్తి చేస్తున్నారు అది అపచారం కాబట్టి అలా చేయకండి.భక్తి శ్రద్దలతో కాళ్లకు చెప్పులు లేకుండా దైవాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలి అప్పుడు ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment

Pages