ఒకటైపోదామా.. ఊహలవాహిని లో! -14
కొత్తపల్లి ఉదయబాబు
"ఈ ప్రపంచం లోని మృగాళ్లనుంచి అవసరమైతే నన్ను
నేను రక్షించుకోవడానికి ఆత్మ రక్షణ విద్య నేర్చుకోవడానికి.''
''వావ్...మీలో నేను వూహించినదానికన్నా ఎక్కువ కోణాలే ఉన్నాయి.''అన్నాడు విరాజ్.
"ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, బహుశా మన స్నేహంలో మీకు నచ్చనిది మళ్లీ సరి మన ఈ గుడిలో కలిసినపుడు చెప్తాను. అందుకని మీరు మరోలా భావించవద్దు. " అంది హరిత.
"ఇన్ని విషయాలు చెప్పేసారు అదొక్కటి కూడా
చెప్పొచ్చు కదా. అంతవరకు నేను సస్పెన్స్ తో ఉండాలా?
... ప్రేమలో పడితే ఎన్ని బాధలు ఉంటాయా? చిన్న
ఆనందాన్ని కూడా కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేటటువంటి మనస్తత్వం నాది. ఏమీ అనుకోకపోతే
ఆ ఒకటి చెప్పొచ్చు కదా"
"తప్పనిసరిగా చెబుతాను. దానివల్ల మనిద్దరి మధ్య స్నేహం అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆ ఒక్కటి కచ్చితంగా రోజు చెప్తాను ఒక్క 20 రోజులు ఆగండి ప్లీజ్. " అన్న హరిత మాట్లాడడం పూర్తయినట్టు తల్లికి బొటనవేలు థమ్సప్ సింబల్ లా చూపించింది విరాట్ చూడకుండా.
విరాజ్ మాట్లాడలేదు.
"నిజంగా మీరు ఆ సస్పెన్స్ తట్టుకోలేను అంటే ఇప్పుడే చెప్పేస్తాను. కానీ నా స్నేహితుడు ఇంత బలహీన మనస్కుడా అనే భావం దయచేసి నాకు కలగనీయకండి. నిజంగా ఒక్క మాట అడుగుతాను చెప్పండి.... నాతో ఇలా మాట్లాడడం మీకు సంతోషంగా అనిపించిందా లేదా?"
"అలా అంటావేంటి హరితా. నేను మనసు పడిన స్నేహితురాలితో నాకు ఎంతో ఇష్టమైన భగవంతుని సన్నిధిలో ఇంత హాయిగా మాట్లాడిన ఆనందమే నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. మీ అమ్మగారితో వచ్చి నీ స్నేహాన్ని నాకందించినందుకు చాలా చాలా సంతోషం. నువ్వు చెప్పిన ఐదు పాయింట్లు ఫుల్ ఫిల్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను. కానీ 20 రోజులే నీ నీతో ఫోన్లో మాట్లాడకూడదు అంటేనే ఎలా అని ఆలోచిస్తున్నాను."
"అయితే ఒక పని చేయండి. నా పరీక్ష రోజున పరీక్షకి బయలుదేరబోయే ముందు మీకు అమ్మ చేత మిస్డ్ కాల్ ఇప్పిస్తాను. నేను పరిస్థితి వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అది నాకు టానిక్ లా పనిచేసి నేను పరీక్ష బాగా రాస్తాను. చెబుతారా?"
"అంత మంచి అవకాశం ఇస్తే ఎందుకు చెప్పను హరితా.తప్పకుండా చెప్తాను."
ఇంతలో శకుంతల అక్కడికి వచ్చింది.
"మనసువిప్పి మాట్లాడుకున్నారా బాబు."
"మాట్లాడుకున్నాం ఆంటీ."
" సరే బాబు మరి వెళ్ళి రామా? "
"ఓకే ఆంటీ. వెళ్ళిరానా.. హరిత?"
"స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ అండి."
***
గుళ్లో తాము ఏం మాట్లాడుకున్నామో అక్షరం పొల్లుపోకుండా తల్లికి చెప్పింది హరిత.
"సరేనమ్మా. పరీక్షలకి బాగా ప్రిపేర్ అవ్వు. నీ
నువ్వు తప్పక చేసుకుంటావని నేను
మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను" అంది శకుంతల.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment