శ్రీథరమాధురి - 123 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 123

Share This

                                                         శ్రీథరమాధురి - 123

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వచనాలు)



సందేహాలు ఎప్పుడూ బుద్ధి నుంచి ఉదయిస్తాయి. హృదయానికి సంబంధించిన అంశాలలో సందేహం అనేది ఉండదు. బుద్ధి ఎల్లప్పుడూ గతంలో లేక భవిష్యత్తులో ఉంటుంది. హృదయం ప్రస్తుతం లో ఉంటుంది. బుద్ధి పరిణామాల గురించి భయపడుతుంది. హృదయం పరిణామాలకు భయపడదు. బుద్ధి గతం తాలూకు చర్యలను కప్పిపుచ్చుకోవాలని లేక వాటి గురించి గొప్పలు చెప్పుకోవాలని చూస్తుంది. బుద్ధి భవిష్యత్తును కూడా మరుగుపరచడాన్ని ఇష్టపడుతుంది. కాబట్టి ఈ విధమైన మార్పిడులలో విశ్లేషణ, విచారణ జరుగుతాయి కనుక బుద్ధి సందేహిస్తుంది. హృదయానికి విశ్లేషణ, విచారణ తెలియదు. అందుకే అది దేనిని మార్చి చెప్పదు.
 
***
ఒకసారి సందేహం మనసులో ప్రవేశించాక, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్లనో లేక ఇతర కారణాలవల్లనో ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రతికూల శక్తులతో ఆవరించబడతాడు. ఆ ప్రతికూల శక్తి ఆ వ్యక్తిని నిజాయితీతో కూడుకున్న నిర్ణయం తీసుకొనివ్వదు.
 
ఉదాహరణకు ఒకరు అతి విశ్వాసంతో ఉంటే అప్పుడు కూడా ఆ వ్యక్తి ప్రతికూల శక్తితో ఆవరించబడతాడు. అతని నిర్ణయాలు కూడా మునుముందు చెడుగా పరిణమిస్తాయి.

ఒకరు సంతులనంతో ఉన్నప్పుడు మాత్రమే అనుకూల శక్తి ఆ వ్యక్తి నుంచి ప్రవహిస్తుంది. వారు నిజాయితీతో కూడుకున్న నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
 
తొందరపాటు వైఖరి, అతి లేక అల్ప విశ్వాసం అనేవి ఆ వ్యక్తిని చీకటి శక్తులు ఆవరించాయని చెప్పడానికి సూచికలు.
 
ఉదయిస్తున్న సూర్యుడిని చూడడం, పక్షులను చూడడం, పక్షుల కిలకిల రావాలని వినడం, వరద లేకుండా ఉన్న ప్రవహిస్తున్న ఒక నదిని చూడడం, దర్జాగా ఈదుతున్న చిన్ని చేపలను చూడడం, చక్కటి సంగీతాన్ని వినడం, అర్హత గల గురువుల యొక్క ప్రవచనాలను వినడం, ఒకరిని మరింత సంతులనంతో ఉండేలా చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో సరైనవిగా మారే  నిజాయితీతో కూడిన నిర్ణయాలను జీవితంలో తీసుకోవచ్చు.

***

No comments:

Post a Comment

Pages