శివం - 113 - అచ్చంగా తెలుగు

 శివం - 113

రాజ కార్తీక్ 


( నేను అనగా శివుడు.. కార్తికేయుడు చెబుతున్న కథా మేమందరము వింటున్నాము ఆ కథలో భాగంగా నేను హనుమంతుడిని భుజాల మీద ఎక్కించుకొని రాముని చూపించటానికి అయోధ్యకు బయలుదేరాము చివరి అంకంలో ఆకాశంలోంచి చూస్తూ అయోధ్య వచ్చిందని నేను బాల హనుమంతునికి చెప్పాను)


నేను " హనుమ అయోధ్య వచ్చేసింది" 

కార్తికేయుడు " ఓహో గురువా కథలో భలే లీనం అయిపోయావే.. హనుమంతుడికి చెప్పినట్టు అయోధ్య వచ్చిందని చెబుతున్నావ్" 

నేను " అవును కార్తికేయ నేను బాగా లీ నమైపోయా. నిజంగా నా ఊహలో హనుమంతుడిని ఎత్తుకొని అయోధ్యలో ఉన్నట్టే అనుకుంటున్న" 

కా "పోనీలే గురువా.. అలా కథలు లినమైపోటమే నాకు కావాల్సింది"

నేను " అవును కార్తికేయ అలా కలలో లి నం చేయటం చాలా కొద్ది మంది రచయితలకు మాత్రమే సాధ్యమవుతుంది నిజంగా నువ్వు రాసినవి  పురాణాల్లో జరగకపోయినా జరిగి ఉంటే బావుంటుందని సాక్షాత్తు ఆయా దేవతలే అనుకునే విధంగా కల్పన చేశావు. ఇది కూడా భక్తి కిందకే వస్తుంది కార్తికేయ "

కా "సంతోషము గురువా.. నీవు ఆ మాట అనటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే నాకు పెద్ద భక్తి లేదేమో అనుకుంటున్నా కానీ ఆయా దేవతా పాత్రలని ఎప్పుడు రచిస్తూ ఉండటం ఆ దేవతా పాత్రల మీద ఎప్పుడూ కథ ఆలోచిస్తూ ఉండటం వలన ఎలాగైనా దైవ స్మరణ జరుగుతుందని నా అంతరాత్మ చెబుతున్నా అది పూజ చేయట్లేదు కదా అని మరొకవైపు నా మనసు చెబుతుంది కానీ నీవు చెప్పిన విషయం ప్రకారం గా నేను చేస్తున్నది దైవ పూజ అని ఆనందంగా భావిస్తున్నా ఎందుకంటే కళారాధన శివ పూజ ఏ కదా"

నేను "సర్వే ఇది విజ్ఞానానికి తర్కానికి  సమయం కాదు ఆ కథ ఏం జరుగుతుందో ఒక సెలయేటి ధారవలె ఆపకుండా చెప్పు నాయన"

కా " అలాగే రాజా " 

కథ లో 

{

శివుడు " ఆంజనేయ అయోధ్య వచ్చేసింది"

బాల ఆంజనేయుడు "  స్వామి మహాదేవ మా కిష్కిందలో కన్నా అయోధ్యలో నాకు ఎంతో ఆనందంగా ఉంది అయోధ్య గాలి పీలిస్తేనే నా సొంత ఊరి గాలి కన్నా నాకు ఎంతో బాగా నచ్చింది ఇక్కడ నాకు అందరికన్నా ఎక్కువగా కావాల్సిన వారు ఉన్నారు మహాదేవ.."


శివుడు " ఏమిటి ఆంజనేయ నాకన్నా నీకు కావాల్సినవారా"

ఆ " మహాదేవ నీవు ఎప్పుడూ నాతో ఉండవు కదా నీలాగా నాకు ఒక పెద్ద దిక్కు కావాలి కదా కాబట్టే కదా నువ్వు నాకు ఏర్పాటు చేశావు.. నాకు నువ్వెలాను రామయ్య కూడా అంతే. ఇంక నీకు వారికి తేడా ఏమిటట.. నువ్వు కైలాసం చూసుకుంటావు నేను రాములవారు అయోధ్య చూసుకుంటాము..,"


శివుడు "చిచ్చరపిడుగా సూర్యుని మింగినప్పుడే అనుకున్నాను.. మా ఇద్దరూ ఒకటే నీకు అని ఎంత చక్కగా ఎంత మురిపంగా చెప్పావు "

ఆ " నేను చెప్పేది ఏముంది అది నిజమే కదా సత్యము కాబట్టి నేను చెప్పాను సత్యము కాబట్టే నీవు దాన్ని ఒప్పుకున్నావు "

అనుకుంటూ అయోధ్య వైపు సాగిపోతూ ఇద్దరు ముందుకు వెళ్తున్నారు.


}

ఇదంతా గమనిస్తున్న త్రిమాతలు.. ద్వి మూర్తులు ముల్లోకాలు కైలాస పరివారము మరీ ముఖ్యంగా ఆంజనేయుడు.. సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నట్లు నవ్వుకుంటున్నారు

కథ లో 
ఆ "మహాదేవ నన్ను సావధానంగా రాముల వారి దగ్గరికి తీసుకెళ్తావా?"

శివుడు " అవును మనిద్దరం ఇప్పుడు నేను ఎలా అయితే నీ దగ్గరికి వచ్చానో అలా రాముడు దగ్గరికి వెళ్తాము " 

ఆ "అయితే తొందరగా తీసుకెళ్ళు మహాదేవ ఇంకెందుకు ఆలస్యం"

శివుడు " ఉండు అంజనేయ అయోధ్య కేగా మనం వెళ్తున్నాం ఏమిటి అంత తొందర" 

అనుకుంటూ దశరథ మహారాజు భవనాల దగ్గరికి వచ్చారు..
సాక్షాత్తు పరమేశ్వరుడి మహిమ చేత వాళ్లు ఎవరికీ కనబడలేదు 
అక్కడ రాణివాసాలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఏ ప్రసాదంలో బాల రాముడు పడుకున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు }

నేను "అదేమిటయ్యా? సాక్షాత్తు మహాదేవుడికి రాముల వారి ఏ ప్రస్థానంలో ఉన్నారో ఎందుకు అర్థం కాకుండా ఉంటుంది."


కా "అది కథలో భాగమయ్యా సాక్షాత్తు శివుడు ఆంజనేయులు వారిని సరదాగా ఆట పట్టించడం కోసం అలా చేస్తాడు.. ఏమి మహాదేవుని వారికి వినాయకుడు తన కొడుకు అని అర్థమైనదా ఏమిటి? "

నేను "ఇది ఎందుకు వచ్చిందిలే కథను గుడ్డిగా అనుసరిద్దామని నేను ముభావంగా అయిపోయాను"

నేను అలా అయిపోవడం చూసి మీ మాట పార్వతీదేవి చాలా ఆనందంగా ఒక నవ్వు నవ్వింది 

"ఆరె బడవ సాక్షాత్తు మహా దేవుడిని మాట్లాడితే ఏమొస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు నిలబడేటట్లు చేశావే "


విష్ణు దేవుడు "సోదరీ పార్వతీదేవి! మహాదేవుల వారు ఎంత భక్త సులభడో ఇది ఒక ఉదాహరణ తనమీద రచనలు చేసే ఒక అతని కోసం అతను ఎటువంటి పూజ చేయకపోయినా తపస్సు చేయకపోయినా తన కోసం తన స్నేహితుడి వలె కొన్ని గంటలుగా అతనితో ఆటలాడుతూ పాటలు పాడుతూ మన దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళారు అంటే.. మహాదేవుల వారు ఎంతో ఇష్టపడి చేస్తున్నారు లీల ఇది ఇందులో మనందరం భాగస్వామ్యం అవ్వక తప్పదు "అంటూ ఏమో తిప్పలు పడబోతున్న అన్నట్లు నిట్టూర్పు విడిచారు 

విష్ణు దేవుడు " నంది"

నంది " విష్ణు దేవా చెప్పండి "

విష్ణు దేవుడు " బ్రింగి"

బృంగి " సిద్ధంగా ఉండండి నందీశ్వర బృంగేశ్వర"

నేను " తరువాత ఏమైనది కార్తికేయ"

కా " గురువా చెబుతాను.. వినవయ్యా .. సన్నివేశానికి సన్నివేశానికి మధ్యలో ఎన్ని ఆటంకాలు కల్పిస్తే ఎట్లా ? "


కథ లో 

{ అక్కడ ఒక రాజప్రసాదంలో.. ఒక అందమైన బాలుడు. ఒక పెద్ద అద్దాన్ని తీసుకువచ్చి ఆ అద్దంలో చంద్రుడిని చూస్తున్నాడు..
పైగా ఆరోజు నిండు పౌర్ణమి అవటం చేత.. ఇంకా ప్రకాశం గా ఉంది 

శివుడు " హనుమ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి ఆ బాలుడుతో యువరాజు రాములవారి సైన మందిరం ఎక్కడుందో కనుక్కొని వస్తాను ..

హనుమ "అలాగే మహా దేవా తొందరగా వెళ్లి క్షణంలో వచ్చేయండి"

శివుడికి తెలియదా గురువా రాముడు ఎవరో కానీ రాముల వారి దగ్గరికి కూడా వెళ్లి ఆయనని ముద్దాడటం కూడా శివుని యొక్క నిర్ణయం సుమీ 

అద్దంలో చంద్రుని చూస్తున్న రాముడికి, వెనుకనుండి శబ్దం వినిపించింది

"  ఏమిటిరామా అద్దంలో ఏమి చూస్తున్నావు"


బాల రాముడు " మహాదేవ తమరు ఎలా ఉన్నారు తమను చూసి చాలా రోజులైంది తమరి కోసం నేను బెంగపెట్టుకుంటున్న అని పరిగెత్తుకుంటూ వచ్చి పరమేశ్వరుని వాటేసుకున్నాడు ..

శివుడు " రామా నీవు లేకుండా నేను ఉండగలనా చెప్పు చెప్పు ఇంతకీ అద్దంలో ఏం చేస్తున్నావ్"

రాముడు " మహాదేవ ఇందా కౌసల్య మాత నేను అన్నం తినకపోతే అద్దంలో చంద్రుని చూపించి అన్నం తినిపించింది.. కానీ చంద్రుడు బింబం మే కానీ చేతికి దొరకడని బాధపడుతున్న దొరుకుతాడేమో అని అద్దం తెచ్చుకొని చంద్రుని పట్టుకుందామని చూస్తున్నాను మహాదేవ" అంటూ బహుముద్దుగా కొసరి కొసరి ముద్దొచ్చే విధంగా చెప్పాడు

శివుడు " రామా నీకు ఆ చంద్రుడు అందకపోయినా నా తల మీద చంద్రుడు ఉన్నాడు కదా ఆ చంద్రుని పట్టుకుంటావా నిజంగా నీకు ఎంతో గొప్ప అనుభూతి వస్తుంది అంటూ తన శిఖలో ఉన్న చంద్రుని తీసి రాముడికి ఇచ్చాడు"

రాముడు ఆ చంద్రుని చేత్తో పట్టుకొని హై బలే బలే బలే బలే మహాదేవుడు వారు నిజంగా నాకోసం చంద్రుని ఇచ్చారు. ధన్యవాదాలు మహాదేవ అంటూ అక్కడ కూర్చొని ఉన్న శివుడిని వాటేసుకొని తండ్రికి పెట్టినట్టు ఆనందంగా ముద్దులు పెట్టాడు రాముడు }


నేను పూర్తిగా తన్మయిత్వంతో కన్నీటి పర్యంతమయ్యాను..

బాల రాముని ముద్దు చేసే నాకు బాల రాముడు ముద్దుపెట్టటమా..

నేను " రామా నాకు నువ్వు ముదిచ్చావు కదా నీకోసం ఒక గొప్ప బహుమానం తెచ్చాను చూస్తావా"

రాముడు " చూస్తాను మహాదేవ తొందరగా" అంటూ 
ఎంతో ఉత్సాహం.. చూపిస్తున్నాడు..

గాలిలోనే ఎగురుతున్న బాల హనుమంతుడికి శివయ్య ఎక్కడున్నాడో అర్థం కాక అటు ఇటు అటు ఇటు బిత్తర చూపులు చూస్తున్నాడు. 

ఒకవైపు నుంచి శివుడు జటలు వచ్చి హనుమంతుని పట్టుకొని తన వైపుకు లాక్కున్నాయి 

బాల హనుమ " మహాసేవ మహాదేవ" అంటూ అల్లరి చేస్తున్నాడు..

మోకాళ్ళ మీద కూర్చున్న శివుడి ముందు ..
ఎడమవైపుగా రాముడు. 
కుడి వైపు తన జటను తీసుకొచ్చిన బాల హనుమంతుడు..

శివుడు " హనుమ ఇదిగో బాల రాముడు నువ్వు అడిగిన రాముడు ఈయనే" 

బాల హనుమ "రామయ్య" అంటూ ఒక్కసారిగా మోకాళ్ళ మీదను కూర్చొని.. కన్నీటి పర్యంతమయ్యాడు..

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages