శివం - 114 - అచ్చంగా తెలుగు

 శివం - 114

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


( కార్తికేయుడు చెబుతున్న కథలో.. నేను బాల హనుమంతుని అయోధ్య తీసుకువెళ్లి బాల రాముని కలపటం వరకు వచ్చింది )


నేను అనగా శివుడు 

కథ లో 
{
బాల హనుమాన్ రాముని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆనందభాష్పాలతో రామయ్య నువ్వేనా అని కన్నీటి పర్యంతమయ్యాడు 

శివుడు  కూడా మోకాళ్ళ మీద కూర్చున్నాడు నా 
ఎ డం వైపుగా శ్రీరాముడు నా కుడివైపుగా ఆంజనేయుడు ఇద్దరు నా సరిసామాను ఎత్తుగా ఉన్నారు..

శివుడు 

" హనుమ ఇప్పటిదాకా ఇంత అల్లరి చేసి ఎందుకని అలా ఏడుస్తున్నావు? ఏమైనది నీకు"

బాల హనుమ " ఏమో ప్రభు నాకు తెలియదు శ్రీరాములవారిని చూడగానే నేను ఈయన కోసమే పుట్టాను కదా అనిపించింది నా జీవిత గ మనాన్ని చేరాను అనిపించింది ఏదో తెలియని తన్మయత్వం ఏదో తెలియని ఆనందం బయటికి వచ్చింది తప్ప నేను ప్రత్యేకంగా ఏమీ కన్నీటి పర్యంతం కాలేదు ప్రభు" అంటూ శ్రీరామచంద్రుని అంతే చూస్తున్నాడు 


శివుడు " రామ నీకోసం హనుమంతుడు వస్తే ఏమిటి అలా చూస్తావు " 

బాల రామ " మహాదేవ నేను హనుమాన్ ముద్దాడదామనుకుంటే హనుమంతుడు ఏమిటి మోకాళ్ళ మీద కూర్చొని నా ముందు ఇలా వాపోతూ ఉంటాడు "

అనగానే బాల హనుమంతుడు ఒక్కసారిగా తలపైకెత్తి ఏమిటి అన్నట్టు ఒక చూపు చూశాడు 

రామ " హనుమ ఒకసారి పైకిలే "

శివుడు " చూడు హనుమ బాల రామచంద్రుడు నీకు ముద్దిస్తాడట " 

హనుమ " హాయ్ బలే బలే" 

రామ " ఏమిటి ఇది ఆంజనేయ.. అంటూ హనుమ బుగ్గలు గిల్లి.. తన మీద ఉన్న రాజ వస్త్రములతో హనుమ కన్నీరు తుడిచి మోహమంతా శుభ్రం చేసి..
తన తమ్ములని ఎలా ముద్దుగా ముచ్చటగా ముద్దాడతాడో అలా హనుమంతునికి పదేపదే పదు ల ముద్దులు కురిపించాడు" 

హనుమ మనసు ఆనందంతో రంకెలేస్తుంది..

హనుమ "రామయ్య నీ ఆలింగనమే నేను కష్టం అనుకున్న అలాంటిది నన్ను ఎంతో బాగా ముద్దాడావు నేను కూడా నిన్ను ముద్దాడతాను అని చెప్పి ఆనందముగా చెప్పాడు " 

రామ" దానికి నన్ను అభ్యర్థించాల హనుమా.. నీకన్నా నాకు అప్తులు ఎవరు కానివ్వంటూ."
. తన బుగ్గలను హనుమంతుడికి అందజేశాడు 

హనుమ తన తండ్రి గారికి ఎలా అయితే ముద్దులు పెడతాడు అలా రాములవారికి ఎన్నో ముద్దులు పెట్టాడు, 

"పసిపిల్లలు తమ ఇష్టాన్ని తెలుపుకునేది ముద్దుల తోనే కదా "అనుకుంటున్నాడు కథలోని శివుడు

మహాదేవుడు వీళ్లిద్దరి ఆలింగన చుంబనాలని ఎంతో ఆనందంగా చూస్తున్నాడు.. అయితే ఒక్కసారిగా హనుమ రాములవారు ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం మానేసి 

మహాదేవులు వారి దగ్గరికి వచ్చి 
మహాదేవులు వారి చెరొక. బుగ్గకి ఇద్దరూ తండ్రిని ముద్దాడినట్టు ముద్దాడుతున్నారు 

మహాదేవుని వారు కూడా ఎంతో ఆనందంతో బాల హనుమ బాల రాముని ప్రేమని ఆస్వాదిస్తున్నారు


}

ఈ కథ వింటూ 

హనుమంతుడు మైమరిచిపోయాడు

త్రిమాతలు ఒకసారి వాత్సల్యాన్ని గుర్తు చేసుకున్నారు 

త్రిమూర్తులు ఎన్నో భక్తి కీర్తనలో కన్నా ఈ భక్తి కల్పనలో ఎంతో భావం ఉందని సంతోషాన్ని వెలిబుచ్చారు 

ఇక కైలాస పరివారం అయితే తదుపరి ఏమిటంటారు అని ఆనందపడుతున్నారు 

నేను నా రెండు బుగ్గలు తుడుచుకుంటున్నాను 

కార్తికేయ " ఏమిటి గురువా శివుడికి బాల హనుమంతుడు బాల రామచంద్రుడు ముద్దులు పెడితే నీ బుగ్గలు తుడుచుకుంటావేంటి "

నేను " బాగుందయ్యా చాలా బాగుంది.. హనుమంతుడు రాముడు ఇద్దరు శివుడికి ముద్దు పెట్టడం అనేది చాలా బాగుందయ్యా "

కార్తికేయ " చూడయ్య రాజా నిజంగా బాగానే ఉందా? ఏమిటి? ఏమి చెప్పినా కూడా బాగుంది బాగుంది అంటున్నావ్ నిజంగా బాగుందా లేకపోతే ఏదన్నా వెలితి ఉన్న నేను బాధపడతానని చెప్పట్లేదా"

నేను " అదేమీ లేదు బాగోలేకపోతే బాగోలేదని కరాకండిగా చెప్తాను నేను... అంతేగాని మన దగ్గర రెండు మాటలు ఉండవు మన త్రినేత్రం అంత గమనిస్తూనే ఉంటుంది" అని చమత్కరించాను 

కా " బాగుందయ్యా నీ వేషధారణ నిజంగా నీ రెండు కన్నుల నడుమ మరో నేత్రం ఉన్నట్టే వేషం వేశాడు బాగా "

నేను " తరువాత కథలో ఏమైందో చెప్పవయ్యా ఇవన్నీ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు"

కా "ఏమయ్యా ఇందాకట్నుంచి నడిపిస్తున్న మీ ఇల్లు దగ్గరలో ఉందన్న నడిచి నడిచి నీరసం వస్తుంది .. ఇంకెప్పటికీ మీ ఇల్లు చేరాను ఎప్పటికీ మనం విశ్రమించేమో "

నేను " ఈ కథ అయిపోగానే మా ఇల్లు వచ్చేస్తుందిలేయ్యా అందుకే తొందరగా కథ అయిపోగొట్టు.. ఇంటికి వెళ్ళగానే. నువ్వు జీవితంలో ఎప్పుడూ తినలేని షడ్రుచుల సమ్మేళనం..  తిని విశ్రమిద్దుగాని " 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages