శ్రీథరమాధురి - 124
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వచనాలు)
బుద్ధికి ఏమీ తెలీదు, అయినా కూడా అది మాట్లాడుతుంది. హృదయానికి అన్నీ తెలుసు కానీ అది మాట్లాడదు.
అందుకే మన సందేహాలన్నీ బుద్ధినించే పుడతాయి. హృదయానికి సందేహాలు తెలియవు.
గురువుతో ఉన్నప్పుడు అది హృదయగానం. సందేహాలతో గురువు వద్దకు వెళ్ళకండి. ఎందుకంటే మీ బుద్ధికి వ్యతిరేకంగా గురువు ఉండటం వల్ల మీరు నిరాశ పడతారు.
****
ఆమెకు ఒక సందేహం ఉంది...
ఆలయంలోకి ప్రవేశించే ముందరే బిచ్చగాళ్లకు భిక్ష వేయాలా లేక దైవ దర్శనం తర్వాతా? ఒకవేళ దైవ దర్శనం తర్వాత మనం దానం ఇస్తే మన పుణ్యాలన్నీ బిచ్చగాళ్లకు వెళ్ళిపోతాయా?
నేను ఎల్లప్పుడూ దైవదర్శనం తర్వాత దైవం యొక్క ప్రసాదంతో పాటుగా భిక్షను ఇస్తాను. తద్వారా దీనులు కూడా దైవం యొక్క దీవెనలను పొందుతారు. ఈ ప్రక్రియలో నా పుణ్యం కూడా వారికి వెళ్తుంది. దీనులకు అది అవసరం.
మహాభారతం నుంచి ఒక కథను చెబుతాను...
కర్ణుడు చాలా పుణ్యాన్ని పోగు చేసుకున్నాడు. అతడు అవసరంలో ఉన్న వారికే గాక ప్రతి వారికి దానాలు ఇచ్చాడు. ఆలయంలోకి ప్రవేశించే ముందు అతనికి దానం ఇచ్చే అలవాటు ఉంది. అది కూడా పోగయింది.
కురుక్షేత్రంలో కర్ణుడు చావబోయే ముందు, కృష్ణ భగవానుడు ఒక బ్రాహ్మణుడిగా అతడికి కనిపించి భిక్ష అడిగాడు.
కర్ణుడు 'ఓ బ్రాహ్మణుడా! నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఏ సమయంలో అయినా నేను చనిపోవచ్చు. నేను జీవించి ఉండగా నీవు నా వద్దకు రావలసింది. ఇప్పుడు నేను నీకు ఏమీ ఇవ్వగలను?'
బ్రాహ్మణుడు (కృష్ణ భగవానుడు) 'కర్ణుడా! నీవు గతంలో దానాలను ఇవ్వడం ద్వారా ఎంతో పుణ్యాన్ని పోగు చేసుకున్నావు. దయుంచి ఇప్పుడా పుణ్యాన్నంతా నాకు దానం చెయ్యి.'
కర్ణుడు తన బాణంతో, తన హృదయం వద్ద అయిన గాయం నుంచి కారుతున్న రక్తాన్ని తీసుకొని, తన పుణ్యాన్నంతా దానమిస్తున్నందుకు సంకేతంగా దైవం యొక్క చేతుల్లో ఆ రక్తాన్ని ధారపోశాడు.
మరణం తర్వాత కర్ణుడు కృష్ణ భగవానునిలో ఐక్యమయ్యాడు.
***
No comments:
Post a Comment