తీరని ఆశయం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
సీతాకోక చిలుకలా మారాలనే
ఆశయాన్ని చేరకుండానే,
రోజులను గడుపుతున్నాను.
గొంగళీ పురుగుగానే మిగులు
తున్నాను,
నాపై నేనే రోతతో రగులుతున్నాను.
కృంగిన నల్లటి జీవితాన్నొదిలి
రంగు రంగుల రెక్కలతో
ఎంచక్కా ఎగరాలని,
ఈ స్థాయి నుండీ కదిలి
హాయిగా స్వేచ్చగా తిరగాలని,
నాలోనేను ఎంతగా
కుములుతున్నా
ఈ బ్రతుకుచెర వీడటంలేదు.
విధి నన్ను వింతగా
నములుతున్నా,
చేసిన పాపాలపొర కరగటం లేదు.
అనుభవించటమే తప్ప
ఆశించే అవకాశమే లేదు.
ఎప్పటివో మరి ఆ తప్పులు,
అవే ఇప్పటి ఈ అనుభవాల చేదులు.
***
No comments:
Post a Comment