యయాతి
అంబడిపూడి శ్యామసుందర రావు
వేట ముగించుకుని వస్తున్న యయాతి బావిలో పడిన దేవయానిని రక్షిస్తాడు కానీ దేవయాని నగరానికి వెళ్లకుండా తన సేవకురాలు ద్వారా తండ్రికి తనకు జరిగిన పరాభవాన్ని తెలియజేస్తుంది ఆగ్రహించిన శుక్రాచార్యుని శాంతింపజేయటానికి తన కూతురు శర్మిష్ఠ తో పాటు దేవయానికి పరిచర్యలు చేయడానికి వేయిమంది దాసీలను పంపిస్తాడు ఆ తర్వాత దేవయాని యయాతి ప్రేమలో పడి యయాతిని వివాహమాడతానని తండ్రితో చెప్పి ఒప్పించి వివాహమాడింది. దేవయానితో పాటు దాసిగా శర్మిష్ఠ కూడా యయాతి రాజ్యానికి వెళుతుంది శుక్రాచార్యుడు ఎటువంటి పరిస్థితుల్లో శర్మిష్ఠ తో ఏ రకమైన సంబంధం పెట్టుకోకూడదు అని హెచ్చరిస్తాడు. కానీ యయాతి శర్మిష్ఠ బలవంతం మీద ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు రాజుగా అది తప్పు కాదని శర్మిష్ట యయాతిని ఒప్పిస్తుంది. దేవయాని యయాతి వలన యదు మరియు తుర్వసు అనే ఇద్దరు కుమారులను కంటుంది యదు యాదవ వంశానికి మూల పురుషుడవుతాడు అలాగే తుర్వసు వారసులు యవన రాజ్యాన్ని స్థాపిస్తారు. అలాగే శర్మిష్ట యయాతి వలన ద్రుహ్యు ,అనుద్రుహ్యు ,పురు అనే ముగ్గురు కుమారులను కంటుంది.వీరిలో పురు కురు వంశానికి మూల పురుషుడవుతాడు.
కాలక్రమములో దేవయానికి తన భర్త యయాతికి శర్మిష్ఠ ఉన్న సంబంధం తెలిసి తన తండ్రికి తెలియజేస్తుంది ఉగ్రుడైన శుక్రాచార్యుడు తన కూతురును మోసం చేసినందుకు వృద్దుడివి కమ్మని శపిస్తాడు శాంతించిన శుక్రాచార్యుడు యయాతి కుమారులలో ఎవరైనా వృద్ధాప్యాన్ని తీసుకుంటే యయాతి కి తిరిగి యవ్వనం వస్తుంది అని శాప విమోచనం చెపుతాడు. యయాతి కుమారులకు ఈ విషయం చెబితే ఎవరు వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు కానీ శర్మిష్ట చిన్న కొడుకు పురు తన తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకొని తన యవ్వనాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. యయాతి తన చిన్న కుమారుని త్యాగానికి సంతోషపడి పురు ను తన వారసునిగా ప్రకటిస్తాడు.యవ్వనా
యయాతి తపస్సుకు వెళ్లబోయే ముందు కొడుకు పురువుకు చేసిన హితబోధ అమోఘమైనది ఆదర్శప్రాయమైనది. అవి నీతులలో గొప్పవిగా సర్వ జనులకు అనుసరణీయంగా నిల్చిపోయినవి అవి : పాత్రత ఎరిగి దానం చేయాలి. ఒకరిని వేడుకోగూడదు .అది రాజధర్మ విరుద్ధం. [రాజు ఇచ్చేవాడే. ఊరక తీసుకునే వాడు కాదు] ఎదురుగా వచ్చి 'దేహి ' అని ఆశ్రయించిన సర్వ జీవుల ఆశలు రాజులు నెరవేర్చాలి. ఎపుడూ సజ్జనులతో గోష్ఠి చేస్తూ, ఆదర్శప్రాయమైన జీవితాలు గడపిన పుణ్యాత్ముల జీవితం ఎట్లా గడిచిందో గోష్ఠి ద్వారా ధర్మం ఏది? అని కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ధర్మం విషయంలో ఏమరక ఉండి , సమయోచితంగా నిత్య వ్యవహారంలో అనువర్తించు కోవాలి. రాజు సభలో ఎలా ఉండాలో చెప్తుతాడు. మితంగా, ప్రియంగా, ధర్మ విరుద్ధం కాకుండా , వ్యర్థ వాక్యాలు లేకుండా సభ రంజకంగా మాట్లాడాలి. మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు.. మర్మభేదకమైన మాటలతో ఎదుటివాళ్ళను నొప్పించే వాళ్లను వాళ్లు మహావీరులైనా సరే.. దరిచేరనీయవద్దు. దయ, ఆర్జవము( సూటిగా మాట్లాడటం ) , సత్యం, శమము,. శౌచము ఎపుడూ మనసును వీడగూడనివి. అరిషడ్వర్గ జయం సాధించిన వాణ్ణి బాహ్య శత్రువులేమీ చేయలేరు.ఈ సాధు మార్గం కొడుకుకు ఉపదేశించాడు. కొడుకు సజ్జనుడు..తప్పక అనుసరిస్తాడు అని నమ్మిక కలిగింది.
తపోవనాలలో వానప్రస్థ విధి చక్కగా పాటించాడు. దేవతలను, పితృ దేవతలను హవ్య కవ్యములతో సంతృప్తులను చేశాడు. శిలోంఛవృత్తి అనుసరించి కందమూలాలతో జీవిస్తూ ఒక 1000 సంవత్సరాలు గడిపాడు. సర్వసంగాలూ విడిచి 30 సంవత్సరాలు నిరాహారిగా తపస్సు చేశాడు . కేవలం వాయు భక్షణతో ఒక సంవత్సరం గడిపాడు .ఒక ఏడు పంచాగ్ని మధ్య లో , ఒక ఏడు ఒంటి కాలి మీద నిలిచి జల మధ్యంలో తపస్సు చేశాడు. దివ్య విమానంలో దేవలోకం చేరాడు. దేవర్షుల పూజలందుకున్నాడు. బ్రహ్మలోకం చేరి బ్రహ్మర్షుల పూజలందుకున్నాడు.
అనేక కల్పాలు గడిచాక దేవేంద్రుడు పరీక్ష పెట్టే సమయం వచ్చింది. "ఇంత కాలం అన్ని భోగాలు అనుభవించావు 'నీ తపస్సు చాలా గొప్పది కదా? "అని దేవేంద్రుడు అంటే "ఔను దేవేంద్ర దేవ దానవ యక్ష సిద్ధ గంధర్వ మునివర్యుల తపస్సులు నా తపస్సుకు సాటి రావు "అని యయాతి సమాధానం ఇచ్చాడు. నీవు తపోభిమానముతో మహర్షులనే అవమానించావు కాబట్టి నీవు మనుష్య లోకం చేరవలసి ఉంది" అని దేవేంద్రుడు అంటే "నేను భూలోకంలో ఉండలేను నన్ను అంతరిక్షంలోనే సద్భువన లోకములో
***
No comments:
Post a Comment