అశాశ్వతమైన జీవితం
సి.హెచ్.ప్రతాప్
భగవద్గీత 2 వ అధ్యాయము, 16 వ శ్లోకం
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత: |
ఉభయోరపి దృష్టోద్యంతస్త్వనయోస్తత్త్వదర్ శిభి:
అశాశ్వతమైన వాటికి ఓర్పు ఉండదు మరియు శాశ్వతమైన వాటికి విరమణ ఉండదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తర్వాత, సత్య దర్శకులు దీనిని నిశ్చయంగా గమనించి, నిర్ధారించారు అని పై శ్లోకం భావం.ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ప్రపంచం ఉనికిలో ఉందని, కానీ అది క్షణికమైనదని వివరించాడు. అందువలన, అతను దానిని అసత్ లేదా "తాత్కాలికం" అని పిలుస్తాడు. అతను దానిని మిథ్యా లేదా "అస్తిత్వం లేనిది" అని అనలేదు. జీవితం అశాశ్వతం..ఏ క్షణమైనా ముగిసిపోతుంది. అందుకే మన వారు వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదని అంటుంటారు. ఈ విషయం తెలిసిన
బహు కొద్ది మంది మాత్రమే అశాశ్వతమైన వాటిని త్యజించి, శాశ్వతమైన భగవత్ అనుగ్రహం కోసం క్ర్షి చేసితమ జన్మను చరితార్థం చేసుకుంటారు.ఇందుకు సారూప్యంగా శ్రీ రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో హంసలు..కొంగలు ఒకే రంగులో కనిపిస్తాయి.కానీ వాటి గుణాల్లో ఎంతో తేడా.వుంది.జ్ఞాన సంపన్నులైన యోగి పుంగవులను హంసతో పోల్చి చెపుతూ పరమ హంస అని పిలవడం పరిపాటి. నీటినుండి పాలను వేరు చేయగల వివేకం హంసకే సొంతం.కాబట్టి ప్రతి మనిషి కొంగలా కలకాలం కపటత్వంతో బ్రతకడం కంటే హంసలా వివేకంతో..జ్ఞానంతో కొంత కాలం జీవించినా చాలన్న విషయాన్నిచక్కగా చెప్పారు.ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతం, ఏదీ మన వెంటరాదు, అన్నింటికీ పుట్టుక మరణం తప్పవు, అటువంటి వాడికి వెంపర్లాడడం వృధా. విచిత్రంగా భగవంతుడు జీవితం అనేది సేకరించలేని అశాశ్వతమైన క్షణాల సమాహారంతో రూపొందించాడు. వ్యక్తులు మరియు అనుభవాలతో మనకున్న అనుబంధం, మంచి మరియు చెడు రెండింటినీ, ఇప్పుడు జీవించే జీవితాన్ని దూరం చేస్తుంది. దుఃఖం మరియు ఆనందం ప్రతిరోజూ మనల్ని కలుస్తాయని మనం అంగీకరించాలి. ఇవి అసాశ్వతమని గ్రహించి సాధన ద్వారా ఈ ద్వందాల నుండి శాశ్వతంగా విడివడడానికి ప్రయనించడమే వివేకుల లక్షణం. జీవితం మూడు నాళ్ల ముచ్చటే అని, అది నీటి బుదగ వలే అశాస్వతమని గ్రహించని మానవుడు తాను ఈ లోకంలో శాశ్వతంగా ఉంటాననుకుంటూ క్షణభంగురమైన, అశాశ్వతమైన సుఖ సంతోషాలు, ఆడంబరాల్లో మునిగి తేలుతుంటాడు. కానీ మృత్యువు తన తలపైనే కాచుకు కూర్చున్నదని, అది కాలసర్పం వలే ఏదో ఒక క్షనంలో కాటు వేస్తుందని తెలుసుకోలేడు. ఈ భూమ్మీదికి వచ్చిన పేదవాడైనా మహారాజైనా ఏదో ఓ రోజు పోయేవాడే కాబట్టి నలుగురు మెచ్చే నాలుగు మంచి పనులు చేసి పరమాత్ముని కృపకు పాత్రుడు కావాలంటారు మహాత్మా కబీరుదాసు. అదే మనకు ఆదర్సం. నీకు ధనముందని, నీవారున్నారని, యౌవ్వనంలో ఉన్నావని, అధికారంలో ఉన్నానని గర్వపడకు. ఇవన్నీ కాలగమనంలో కొట్టుకుపోయేవే!ఈ భూమి మీద అశాశ్వతమైన ఈ శరీరంతో ఉన్నంతకాలం ఆ భగవంతుడి పరమ పదాన్ని సేవిస్తూ నిజకర్తవ్యాన్ని నెరవేరుస్తూ శాశ్వత ఆనందాన్ని అనుభవించు’’ అని ఆదిశంకరులు ‘భజగోవిందం’లో అద్ణుతంగా తెలియజేసారు.
***
No comments:
Post a Comment