అశ్వత్థ వృక్షం..(రావి చెట్టు) - అచ్చంగా తెలుగు
అశ్వత్థ వృక్షం..(రావి చెట్టు)

అంబడిపూడి శ్యామసుందర రావు  




అశ్వత్థ వృక్షం.అంటే మనము సాధారణంగా  పిలిచే రావి చెట్టు  ఈ చెట్టును !ఆదిత్య వృక్షమని కూడా పిలుస్తారు ఇది దేవతా వృక్షాల్లో ఒకటి. ఈ వృక్షం త్రిమూర్తి స్వరూపముగా చెపుతారు అంతేకాకుండా ఈ వృక్షం సర్వ దేవతా స్వరూపంగా కీర్తిస్తారు.అంబరీష మహాముని శాపం వలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందెనని పద్మ పురాణం చెబుతోంది. అందుచేతనే  శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు. అశ్వత్థ వృక్షం యొక్క విశిష్టతను తెలియజేసే చిన్న శ్లోకం : 

మూలతో బ్రహ్మ రూపాయ
మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ 
వృక్ష రాజాయతే నమః!

అంటే మూలం బ్రహ్మ, మధ్యభాగము విష్ణువు, దాని చివర భాగం శివుడు అని అర్థం కాబట్టి రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే . ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలో కొమ్మలలో ఉంటారు తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్త సముద్రాల, అన్ని పుణ్య నదులు ఉంటాయి/. ఆ చెట్టు వేర్లలో మహర్షులు,గో బ్రాహ్మణులు,నాలుగు వెడలు ఉంటాయి. అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించుకొని అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాధిత్యులు  దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్ప వృక్షం ఈ వృక్షాన్ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వృక్షం యొక్క మహత్యాన్ని బ్రహ్మాండ పురాణములో నారదుడు వివరించారు.అశ్వత్థ వృక్షం మూలములో ఆ  కారము, మానులో ఉ  కారం, అది ఇచ్చే పళ్లలో ఎం కారము వెరసి వృక్షమంతా ప్రణవ స్వరూపమే. మొహంజదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయట పడింది. దేవదానవ యుద్ధం లో దేవతలు ఓడిపోయిన సందర్భములో విష్ణువు అశ్వత్థ వృక్షముగా మారాడని పురాణాల్లో చెప్పబడింది. అయన చెట్టు రూపం దాల్చడం వల్ల దానికి అంత పవిత్రత వచ్చిందని కూడా చెబుతారు. శ్రీకృష్ణ నిర్యాణము కూడా ఈ చెట్టు క్రిందే జరిగిందని చెబుతారు. ఇంట పవిత్రత కలిగిన అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని పురాణం కధనాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ  చెట్టు క్రిందే   అందువల్ల బౌద్దులు ఈ చెట్టును భోధి వృక్షం అని పిలుస్తారు. 
ఇంత  మహత్తు కలిగిన వృక్షము హిందువులకు అత్యంత పూజనీయము. ఈ వృక్షాన్ని శనివారం మాత్రమే ముట్టుకోవచ్చును అమావాస్య నాడు ఈ వృక్షానికి 21, లేదా 108 సార్లు ప్రదక్షిణాలు చేసి పూజిస్తే  సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. విష్ణు సహస్ర నామము మనస్సులో పఠిస్తూ ప్రదక్షిణలు చేస్తే అమిత ఫలం లభిస్తుంది. ఒక చెంబు నీళ్ళు తీసుకొని గర్భిణీ స్త్రీలాగా నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తే అశ్వ మేధ  యాగం చేసిన ఫలితం వస్తుంది అని మహర్షులు  సెలవిచ్చారు. అశ్వత్థ వృక్షం చుట్టూ ఎలా ప్రదక్షిణాలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కరించాలి.పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా శనివారం మాత్రమే ఈ చెట్టును చేతితో తాకి అశ్వత్థ వృక్ష స్తోత్రాన్ని పఠించాలి. ఈ ప్రదక్షిణలు చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో,గురు శుక్ర మౌడ్యాలలో . కృష్ణ పక్షంలో ,అది,సోమ ,శుక్రవారాలలో ,గ్రహణ,మరియు సంక్రమణ సమయంలో రాత్రి భోజనం చేసి ఈ వృక్షాన్ని పూజించరాదు. 
అశ్వత్థ వృక్ష పూజ ఫలితాలు తెలుసుకుందాం. అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్ధాలు (ధర్మము,అర్థము కామము, మోక్షము) సిద్ధిస్తాయి.చాలా మంది  సంతానం లేని స్త్రీలు బిడ్డలు కలగాలంటే సంకల్పముతో ప్రదక్షిణలు చేసి  ఫలితాన్ని పొందుతారు శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రం పఠించిన శని దోషం తొలగిపోతుంది. శని దోషం తొలగిపోవడానికి  చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం: 

కోణస్థో పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః
శౌరీ శ్ శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః

గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేద విప్రులకు భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.
గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్ధ వృక్షం నీడలో స్నానమాచరించిన మహాపాపములు తొలగును.అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది...రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి అని హిందువుల విశ్వాసము అందుకే హోమాలు రావి పుల్లలు ప్రశస్తం. ఆరోగ్యపరంగా రావి చెక్క కషాయాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి. నోటి పూత తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు తగ్గుతాయి. వివిధ కఫ దోషాలు తగ్గుతాయి.  

***

No comments:

Post a Comment

Pages