శివం - 115 - అచ్చంగా తెలుగు
శివం - 115

రాజ కార్తీక్ 


 


( నేను అనగా శివుడు..
నేను-ఈ కథలో నా పేరు రాజా మరియు గురువా- కార్తికేయుడు కోటప్పకొండ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో తన రచించిన బాల హనుమాన్ బాల రాముని కథ చెబుతుంటాడు కార్తికేయుడు )

తర్వాత కదా..


కథ లో 

{

అయోధ్యలో ఉన్న శివుడికి.. బాల హనుమంతుడు బాలరాముడు ఇద్దరూ కలిసి ఆటలాడుతూ తండ్రికి ముద్దు పెట్టిన విధముగా చెంప మీద ముద్దు పెట్టారు. 

ఆ ముద్దుకి మహాదేవుడు అసలే కరుణామయుడు దయామయుడు ఆనందకరుడు శివుడు సుమంగళ కారుడు..
తీవ్రమైన తన్మయత్వంతో పసివాళ్ళు ఇద్దరిని అక్కున చేర్చుకున్నాడు 

ఈ నిమిషంలో మహాదేవుడికి పుట్టిన బావవేశం అని అన్నాడు అని బొజ్జ గణపయ్యని షణ్ముఖున్ని పెంచే క్రమంలో కూడా ఎప్పుడు కలగలేదు ఏమో అన్నట్లుంది మహాదేవుడి ముఖారవింద విలాసం 

బాల రాముడు." మహాదేవ నీవు నా దగ్గరికి వచ్చి నీకోసం ఒక బహుమతి తెస్తాను అతన్ని చూడంగానే నువ్వు ఎంతో ఆనంద పడతావు రామా అని అని చెప్పింది హనుమ గురించేనా అని అప్పుడప్పుడు వస్తున్న ముద్దు ముద్దు మాటలతో అడిగాడు బాలరామయ్య "

శివుడు " అవును రామ.. ఇతగాడే నీ నిజమైన నేస్తం ఇతగాడే ని నిజమైన ఆప్తుడు ఇతగాడే ని నిజమైన బంధువు ఇతగాడే నీ యొక్క నిజమైన శాశ్వతం ఇతగాడే నీయొక్క బంటు.. సృష్టి చివరి వరకు నిన్ను తలుచుకుంటూ ఉండే నీ ప్రథమ భక్తుడు ఇతగాడే రామ.. నీకంటేను నీ నామ గొప్పతనం భవిష్యత్తులో మరింత తెలియజేస్తాడులే " 

బాల హనుమ " మహాదేవ తమరు నా వద్దకు వచ్చినట్టే రామయ్య దగ్గరికి కూడా వచ్చినారా.. భలేవారు మీరు మహదేవ.. నన్ను మీరు వెంటనే అయోధ్య రాకుమారుడు దగ్గరికి తీసుకు రావాల్సి ఉండేది అప్పుడు నేను ఇంకా ఆనందపడే వాడిని సుమీ" 

బాల రామా " హనుమ నీ గురించి నాకు బాగా తెలుసు మా యోధులు కూడా నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నాం.."

హనుమ " నా గురించి ఏమి కథలు ఉంటాయి రామయ్య "

రామ " అవును నువ్వు పండు అనుకోని.. సూర్యున్ని మింగబోయావట .. సూర్యకాంతికి నీ వడ్డు వస్తే మేము గ్రహణం అన భావించాం" 

శివుడు " హ హ" 

రామ " రాకుమారా హనుమ తమరి రాజ్యం గురించి చెప్పండి " 

హనుమ " నేను కిష్కిందకు యువరాజుని కేసరి నందునుడిని.. మా అమ్మ పేరు అంజనాదేవి.. అందుకే నన్ను ఆంజనేయుడని కూడా అంటారు.. ఎలా పిలిచినా పలుకుతాను. 

హనుమంతుడు రాముడు ఎంతసేపైనా ముద్దు ముద్దు గనే మాట్లాడుకుంటూనే ఉన్నారు
.. వారిద్దరి మాటలు చూసి.. ఎంతో ముచ్చట పడుతున్నారు మహా దేవుడు..
తెల్లవారుజాము కాబోతుంది 

మహాదేవుడు " హనుమ తెల్లవారపోతుంది ఇక రాజప్రసాదికులు ఇక్కడికి వస్తారు.. రామయ్య కి వీడ్కోలు చెప్పు మరొక్క మారు వద్దాం అని అంటున్నాడు..

బాల రాముడు " లేదు హనుమంతుని నా దగ్గరే ఉంచుకుంటాను మహాదేవ.."

హనుమ " అవును మహాదేవ అక్కడ మీరు పార్వతి మాత ఇద్దరు నా తల్లిదండ్రులకు రాముల వారి దగ్గర నేను ఉంటాను అని చెప్పండి.." అంటున్నాడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉషారుగా రాముడి వెనక్కి వెళ్లి రాముని భుజాలు పట్టుకొని 

మహా దేవుడు " రామయ్య నువ్వు అలా హనుమంతుడి కోసం వస్తే మీ నాన్నగారు నీకోసం దిగులు పెట్టుకోరా. అలాగే ఆంజనేయుడు తల్లిదండ్రులు కూడా అంతే కదా..
మీ బాల్యవస్థని మీ తల్లిదండ్రులతో సక్రమంగా గడపండి మునుముందు అతి తొందరలోనే మీరు ఇరువురు కలుసుకొని కొన్ని వేళా ఏళ్ల పాటు కలిసి ఉంటారు చిరంజీవిగా హనుమంతుడు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాడు ఇక బయలుదేరయ్యా కాబోయే బ్రహ్మ "అని హనుమంతుడి మీద సరదాగా అవాకు వేశాడు మహాదేవుడు

తన తల్లి అంజనాదేవి కేసరిని తెలుసుకొని మహాదేవుని వారు చెప్పిన సబబే వెళ్లాలేమో అన్నట్లు దిగాలుగా ఉన్నాడు హనుమయ్య రాముని వదిలి 

బాల హనుమ " అయితే వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపము" 

శివుడు &   రాముడు  " ఏమిటి హనుమ "

హనుమ " మహాదేవ ఈ రామయ్య ని ఒక్కసారి నా మీద ఎక్కించుకొని సరదాగా ఆకాశయానం చేస్తాను "

మహా దేవ " వలదు వలదు నిన్ను కిష్కిందలో దింపి నేను వెళ్లవలెను సమయము లేదు" 

హనుమ " మరి అయితే ఈ రామయ్య రాజప్రసాదంలోనే  అటు ఇటు తిప్పుతాను " అంటూ మహాదేవుల వారు ఇవ్వకుండానే రామయ్య అంటూ రామాయణం మీద ఎక్కించుకొని ఆ రాజప్రసాదంలో అటు ఇటు సరదాగా తిప్పి తనలో తాను ఎంతో ఆనందపడ్డాడు..

నంది యొక్క ఆనందం ఏంటో బ్రింగి యొక్క ఆనందం ఏమిటో హనుమంతుడి మొహం లో కూడా అదే ప్రస్ఫుటంగా ఉంది. 

హనుమంతుడి కేరింతలు రాముని కేరింతల చూసి మహాదేవుడికి బహు ముచ్చటగా  ఉన్నది..

ఇక సమయం మీరిపోవడంతో రామయ్య హనుమయ్యకి ఆలగనం ఇచ్చి

 తన తమ్ముని లక్ష్మణానికి ఎలా అయితే ముందుగ చిన్న చిన్న ముద్దులు పెడతాడు.. అలానే హనుమాన్ కూడా తదేకంగా ముద్దులు పెట్టుకున్నాడు..

"ఉంటారామయ్య "అంటూ కన్నీళ్ళతో రామయ్యకు వీడ్కోలు చెప్పారు మహాదేవుడు మరియు బాల హనుమంతుడు..

మహాదేవుడు " మళ్లీ వస్తూ ఉండు కానీ లే హనుమాన్ ఎందుకు బాధ పడతావు పద నీ అంత పురానికి అంటూ చక్కలిగిలి పెట్టి.. నవ్వించాడు 

అలా హనుమంతుడు తన అంతపురానికి చేరుకున్నాడు ఆ తర్వాత మహాదేవుల వారు వచ్చి రామయ్య దగ్గరికి ఎవరికీ తెలియకుండా చాలాసార్లు తీసుకెళ్లి వాళ్ళిద్దరి ఆటలని గమనించి ఇద్దరిని ఆశీర్వదించేవారు
}

నేను " బ్రహ్మాండంగా ఉందయ్యా కదా " 

కార్తికేయుడు మాత్రం ఏదో సాధించిన వాడిలా మొహం పెట్టాడు..

కార్తికేయుడు "  నిజంగా బాగుందా? " 

అక్కడున్న కైలాస పరివారం అంతా ఆంజనేయుడు తో సహా .. కథ ఎంతగానో బాగుంది.. వాల్మీకి ఇప్పుడు ఉండి ఉంటే ఈ కథని బాలకాండలో జత చేసేవారు ఏమో అన్నట్లు అనుకుంటున్నారు మిగతా దేవత పురుషులు ..

విష్ణు దేవుడు హనుమంతుడు వైపు చూసి ఆనందంగా ఆనందం చేసుకున్నాడు మరొక మారు 

ఎవరి దగ్గర మాటలు లేవు కేవలం కార్తికేయుడు కల్పించిన సన్నివేశాల్లో లీనమైపోయి ఈ భావం ఎంత మధురంగా ఉంది అని అనుకోవటం తప్ప 

భక్తులారా చూశారా కార్తికేయుడు కల్పించిన కథ తనకున్న సృజనాత్మకతతో భగవంతుని పాత్రలో ఆహారాలు ఏమాత్రం దెబ్బ తినకుండా అమితమైన భక్తితో శ్రద్ధతో కల్పన చేసి కీర్తనలు వలే సంగీతంతో కూడిన గానం వలె మమ్మల్ని వాటికోసం ఎంతో ప్రతిభ తో పరితపించే విధంగా చేశాడు.. ఇదే కళ యొక్క గొప్పతనం.. కళారాదన శివ పూజ.. కళ ను సమాజం కోసం మానసిక ఉల్లాసం కోసం చైతన్యం కోసం.. ఉపయోగించి సమాజంలో తోడ్పాటు ఇవ్వండి. 


నేను " ఆ తర్వాత ఏం జరిగింది కొనసాగించు " 

కార్తీకేయ " గురువా రాజా ! కథ అయిపోయినదయ్య.. అసలు మహాదేవుల వారిని హనుమంతుడు రాముడు ముద్దు పెట్టుకున్నప్పుడే కధ అయిపోయినది, కానీ నీ ఆసక్తికి సంబంధించి ఆ తర్వాత నాకు మెరిసిన ఒక సన్నివేశాన్ని కొద్దిగా విడమర్చి చెప్పాను " 

నేను " అవునా అప్పుడే కదా అయిపోయినదా! " 

కార్తీకేయ " అతి అద్భుతంగా ఉంది.. గురువా మీ యొక్క మాటలు మీ యొక్క చతురత మీ యొక్క వినికిడి నా మనసులోని ఉద్దేశాల్ని నా మనసులోని భావాన్ని 100రేట్లు ఉత్తేజింపజేశారు "

నేను " ఏమిటి కార్తికేయ నీ కళ్ళలో దీర్ఘాలోచన నీ కళ్ళల్లో ఏదో ఒక అలజడి.. ఏమి నాకు చెప్పకూడదా"

కార్తీకేయ " చెప్తాను రాజా! మా ఊరిలో కళాకారుల కోసం ఇచ్చిన భూమి కోసం నేను హర సిద్ధ రాజు తో చేసిన శపదం నీకు కచ్చితంగా చెప్పాలి.. ఎందుకంటే ఆ శపదాన్ని నెరవేర్చడంలో నీవే ముఖ్యపాత్ర పోషించబోతున్నావు "

నేను " నేనా "

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages