శివం- 116
(నేను అనగా శివుడు..)
రాజ కార్తీక్
{
ఇదివరకు జరిగిన కథలో
కార్తికేయుడు నేను కోటప్పకొండ లో కలుసుకోవడం కోటప్పకొండ నుండి మేమిద్దరము బయలుదేరడం. హనుమంతుడి రాముడి కథ. నాకు కార్తికేయుడు చెప్పడం..
కదా అయిపోయిన తర్వాత తన రాజు హరసిద్ధుడి గురించి ప్రస్తావించటం
ముఖ్య గమనిక.. గత భాగాలలో.. హరసిద్ధుని కథ చెప్పాను కదా హార సిద్ధుడిని రాజుని చేశాను కదా ఆ రాజు ప్రస్తావనే ఈ కథలో కూడా ఉంటుంది
}
నేను "ఇదేమిటయ్యా! ఇప్పటిదాకా ఒక రకమైన ఆంతర్యంలో ఉండి ఉన్నట్టుండి.. ఎవరు మీ రాజు హరసిద్ధుడు అంటున్నావు కళాకారుల భూమి అంటున్నావు.... నేనే సహాయం చేయాలి అంటున్నావు.. ఇదే మన కొత్త కథ ?"
కార్తీకేయుడు "గురువా కొత్త కథ కాదు జరిగిన కథ"
నేను " కథ మీద కథ బాగుంది ఈరోజున అదృష్టం
ఇప్పుడే రాములవారి కథ అయిపోయింది ఇప్పుడు
ఈ రాజా వారి కథ అన్నమాట "
కార్తీకేయ " మా ఊరిలో కళాకారుల యొక్క భూమి కోసం.. మా రాజు హర సిద్దుడు కి నాకు జరిగిన వాగ్వాదంలో నేను మా మహారాజుని శపధం చేశాను ఆ కథ నీకు చెబుతాను విను .. నా మతిమండ ఇది కథ కాదు నిజంగా జరిగినది "
నేను " బాగు బాగు సరే చెప్పు ఇంతసేపు అడిగిమరీ కొసరి కొసరి వడ్డించినట్టు కథలు చెప్పించుకున్నాను కదా ఇప్పుడు నీ అంతట నీ మీద చెప్తానంటే కాదంటే బాగుండదు చెప్పు" అన్నాను సరదాగా
కార్తికేయుడు "గురువా అలా అనమాకు నువ్వు పరిచయమైన కేవలం ఒక పూటే అయినా నీ మీద నాకు ఎంతో నమ్మకం కలిగింది నువ్వు నా కథ వింటుంటే సాక్షాత్తు శివుడే విన్నాడని అనుకున్నాను నీవు నన్ను ఆశీర్వదిస్తుంటే సాక్షాత్తు శివుడే నన్ను ఆశీర్వదించాడు నాకిక తిరుగు లేదని భావించాను అందుకే నీకు ఇది చెప్తున్నాను ఎట్లైనా సరే కళాకారుల కోసం నాకు నువ్వు ఈ సహాయం చేయాలి నీకన్నా నాకు ఆప్తుడు ఎవరు గురువా ఖచ్చితముగా ఏదో రోషములో అంత పెద్ద మహారాజుతో నేను చేసిన శపదం ఆయన కూడా దాన్ని స్వభావిక దృష్టితో చూసి సరే నీ శపదాన్ని నెరవేర్చుకో నువ్వు అడిగినది నేను చేస్తాను అని నన్ను రాజ మనస్తత్వంతో ప్రోత్సహించాడు "
నేను " చెప్పవయ్యా చెప్పు మారు మాట్లాడకుండా ఇది నేను వింటాను వెంటనే ఇక మా ఇంటికి వెళ్దాం "
జరిగినది వివరిస్తున్నాడు కార్తికేయుడు..
కా " గురువా నీకు తెలుసు కదా ఇప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలు అన్నిటినీ పాలిస్తుంది చక్రవర్తి హరసిద్ధ మహారాజు.. ఆయన ఎంతో ఉత్తముడు ఎన్నో పరీక్షలకు తట్టుకొని సాక్షాత్తు శివుడే ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన పరీక్షింపజేసి ఆయన మహారాజుగా ప్రకటించాడు.. ఎవరైనా యుద్ధాలు చేసి రాజ్యాలు గెలుస్తారు కానీ ఆయన శివుడిని గెలిచి రాజ్యాన్ని గెలిచాడు ధర్మ పరిపాలనలో ఆయన ఎంతో నిష్ట కలవాడు.. ఆయన పాలనలో అన్యాయాలు అక్రమాలకు విధించే శిక్షలు చూసి మిగతావారు కూడా భయపడా సాగారు.. తద్వారా నేరాలు తగ్గాయి. ఆయన కూడా స్వయానా శిల్ప కళాకారుడు.. ఆయన పాలనలో ఎవరు ఆకలితో చావలేదు ప్రతి దేవాలయానికి ప్రతి వర్ణానికి న్యాయమే జరిగినది..
ఆయన కూడా మహా శివ భక్తుడు ఆయన ఎటువంటి భక్తుడంటే సాక్షాత్తు శివుడే ఆయనకు కనపడ్డాడు ఆయన పుణ్యమా అని మా ప్రజలందరికీ సాక్షాత్తు శివుడి దర్శనమే జరిగింది.. నీతి న్యాయం నిజాయితీల్లో ధర్మము విచక్షణా జ్ఞానాలలో చట్టము న్యాయము తీర్పులలో ఆయనకు తిరుగులేదు .."
నేను " బాగు బాగు ఆయనతో ఏదో శబ్దం చేశానని చెప్పి ఆయన ఒక కథానాయకుడిగా చెప్తూ నాకు చెప్తావేమిటయ్యా ! "
కా " విను గురువా !"
నేను " నాకు హరసిద్ధి మహారాజు గురించి తెలుసులే పూర్వ పరిచయం ఉందిలే.. నన్ను చూస్తే నువ్వు ఎట్లా ఆనందపడ్డావో నీకన్నా ఒక మెట్టును చూసి ఇంకా ఆనందపడతాడు కాబట్టి నాకు హరసిద్ధ మహారాజు గురించి చెప్పటం మానేసి నీకేం కావాలి నువ్వు ఏం చేశావు నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది చెప్పు "
కైలాస పరివారము వైకుంఠ పరివారము మిగతా లోకాల వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు అదేదో నాకు తెలియదు అన్నట్టు .. నేను అడిగాను కదా. అని .. కానీ కార్తికేయుడు నోట వింటేనే అదంతా బాగుంటుంది..
కా " గురువా హరసిద్ధ మహారాజు ది నాది ఒకటే ఊరు... నా కర్మ .. ఏరోజైతే హరసిద్ధుడు మహారాజుగా ఆవిర్భవించాడు అదే ఏ రోజైతే పరమేశ్వరుడు హరసిద్ధుడితో పాటు దర్శనం ఇచ్చాడు ఆరోజు నేను నాటకం ప్రదర్శించడానికి వేరే ఊరిలో ఉన్నాము.... కాబట్టి నాకు ఆ శివయ్య దర్శనం జరగలేదు మళ్లీ ఎప్పుడైనా జరిగితే బాగుంటుంది.."
నేను అందరూ చిలిపిగా నవ్వుకున్నాం..
కా " మా అందరికీ హరసిద్ధ మహారాజు అంటే ఎంతో గౌరవం ప్రేమ .. వారు ఎప్పుడూ తప్పు చేయరు. అంత రాజ్యపాలన చేసినప్పటికీ... ఏనాడు ఎవరిని విసుక్కోరు.. నేను వారిని కలిసినా కూడా నిజమైన స్నేహితుడిని కలిసినట్టు భావించి నాతో సరదాగా ఉండేవారు.."
నేను " ఓహో నీకు అతగాడికి పరిచయం ఉన్నదా"
కా " ఉన్నది గురవా అతను మహారాజు కాకముందు హర సిద్దు అన్న హర సిద్దు అన్నా అని అతన్ని ఎప్పుడు పలకరిస్తూ ఉండేవాణ్ణి.. అతను చాలా మంచివాడు నాకు తెలుసు
ఆ రోజు గనక అతనికి రాజు దండని విధించక ముందు నన్ను సాక్ష్యం అడిగి ఉంటే నేను కచ్చితంగా హర సిద్ధుడు ఎంతో మంచివాడు మీరు తప్పు చేస్తున్నారని పీకల మీద దాక వచ్చినా కూడా చెప్పేవాడిని నేను ఆరోజు ఊర్లో లేకపోవటం వల్ల ఆయనకి అవమానం జరిగింది.. అవమానం కాదులే అది అవమానం జరగబట్టే గాని సాక్షాత్తు శివుని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు అది అవమానం కాదు దేవుడు చూపించాలని అనుకున్న లీలా నిదర్శనం "
నేను " అబ్బా ! చెప్పు నీలో కథకుడు తో పాటు తాత్వికుడు కూడా ఉన్నాడు సుమీ "
కా " ఆరోజు హరసిద్ధ మహారాజుని చక్రవర్తిగా శివుడు ప్రకటించిన తర్వాత కుంభన్న రాజ్య .. రాకుమారి చేత కళ్యాణము జరిపించాలని శివుడు ఆజ్ఞ కావున.. హరసిద్ధ మహారాజు కళ్యాణంలో నేను ఒక నాటకం ప్రదర్శించాను.. అది చూసి మహారాజు గారు ఎంతో ఆనందపడి. రాజ్య సొత్తు ను బహుమానాలకు ఇవ్వటానికి నాకు ఎటువంటి హక్కు లేదని చెప్పి తన స్నేహాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు .."
నేను " సాక్షాత్తు మహారాజ్ కి స్నేహితుడివయ్యావ్ ఇక నీకేమి కష్టాలయ్యా "
కా " విను గురువా చెబుతున్నా నాతోపాటు నాటకం ప్రదర్శించే వారు కొంతమంది నా బృందం ఉన్నారు.. వారందరికీ వారణాసి వెళ్దాం అనే బుద్ధి కలిగి అటుగా వెళుతున్న ఒక వారణాసి బృందంతో కలిసి ప్రయాణం సాగించుకోవాలని నిర్ణయించుకొని ఏది ఏమైనా మహాదేవని దర్శించుకుని తిరిగి మన ఊరికి వస్తాము అని వెళ్లారు .. మా ఊరు వచ్చిన నేను సాక్షాత్తు హరసిద్ధుడికి శివయ్య దర్శనం జరిగిందని తెలుసుకొని ప్రజలందరికీ జరిగింది తెలుసుకొని అరెరే ఎంత తప్పు చేశామో ప్రదర్శన కోసం వేరే ఊరికి వెళ్ళాము మన తలరాత ఇంతే అని అనుకున్నాను .. చాలా మాసములు అయినవి అయినను వారు తిరిగి రాలేదు .."
నేను " బహుశా వారణాసి తో పాటు మిగతా పుణ్యక్షేత్రాలు కూడా చూసుకుందామని ఆలోచించారేమో "
కా " అదే నేను కూడా అనుకున్నాను.. అయితే రాజా.. మా రాజ్యంలో ఉన్న తీర్పు సభ్యుల రాజ్య బృందంలో కళాకారుల తరఫున నన్ను ఎన్నుకున్నది ఏది ఏమన్నా తీర్పులు చెప్పేటప్పుడు.. నన్ను కూడా ఒక సభ్యునిగా పరిశీలించమని నాకు హరసిద్ధమహారాజు ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పారు .. నేను దాన్ని ఆనందంగా స్వీకరించాను అంతను బాగానే ఉంది "
నేను " మరి ఎక్కడ వచ్చిందో సమస్య "
కా " ప్రతి ఉగాది తర్వాత రాజ్య ఖర్చులు లెక్కలు లెక్కించుకొని తదనుగుణంగా ఆర్థిక విధానాలను అవలంబిస్తారు మహారాజు.. ఆ లెక్కలలో నాటక కళాకారుల బృందానికి ఇచ్చిన వెయ్యి ఎకరాల భూమిని.. ఆ భూమిపై వచ్చిన రాబడితో కళాకారుల చేయాలని ఉన్న శాసనాన్ని గుర్తించారు.. అక్కడి నిబంధనలో ఏమున్నదంటే కళాకారులు తమ ప్రదర్శన చేత జనాలకి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచిపెట్టి.. వారానికి ఒకటి రెండు నాటక ప్రదర్శనలు కళా ప్రదర్శనలు చేయాలని అప్పుడే రాజ్యంలో అలసిపోయిన ప్రజలకి ఆటవిడుపుగా ఉంటుందని ఉన్నది "
నేను " ఏమిటి మళ్ళీ చెప్పు "
కా " అబ్బా వినవయ్యా వారు చెప్పింది ఏమిటంటే కనీసము వారానికి ఒకటి లేక పౌర్ణమి కైనా అమావాస్యకైనా ఒక నాటకం కచ్చితంగా ప్రదర్శించాలని ఉన్నది... మా కళాకారులంతా కాశీ ప్రయాణం చేయడం వలన ఆ నిబంధనని మేము తృప్తి పరచలేకపోయాము. తద్వారా మాకు క్రితం రాజులు ఇచ్చిన వెయ్యకరాల భూమిరద్దు తో పాటు.. దాని మద వచ్చే జీవన ప్రమాణం అంతా పోతుంది
.. ఇదే నాకు సెలవిచ్చారు తీర్పు సభ్యుల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను తీర్పు ఇవ్వాలి కాబట్టి అది సమ్మతమే అని చెప్పాను కానీ వెనువెంటనే ఆ తీర్పు సభకి నేను రాజీనామా ఇచ్చి కళాకారుల పట్ల నేను సంవాదన చేయడం మొదలుపెట్టాను.."
నేను " ఏమిటి హర సిద్దు మహారాజుతో సంవాదం అంటే వాదన పెట్టుకున్నావా? అతగాడు మామూలుగా వాదించాడు కదా "
కా " ఏమి నేను మాత్రం తక్కువ ఏమిటి నేను వాదించగలను.."
నేను " నాకు ఆ వాదన మొత్తం వద్దులే గానీ ఆ వాదనలో ఏం తెలియదో చెప్పవయ్యా చాలు "
కా " మహారాజా మనకున్న రాజ్యాంగం ప్రకారం మహారాజుకున్న ప్రత్యేకమైన హక్కుల ద్వారా మీరు మాకు కొంత సమయాన్ని కేటాయించవచ్చు ఈ సమయంలో మా వారు తిరిగి రావలెను మా బృందం వారు కనక ఉండి ఉంటే మేము కచ్చితంగా నాటకమువారానికి ఒకటి వేసేవాళ్ళము సాక్షాత్తు పరమేశ్వరుడు చేత మహారాజు అయిన మీరు పరమేశ్వరుడు దర్శనానికి వెళ్లిన వాళ్ల గురించి ఆలోచించండి "
హర సిద్దు మహారాజు " నేను ఏమి ఆలోచించాలి కార్తికేయ "
అందరి ఆలోచనలు నాకు తెలుసు
. హరసిద్ధ మహారాజు ఏం ఆలోచించాడు కార్తికేయడు ఏం చేయబోతున్నాడు ఏమి జరగబోతుంది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment