స్థితప్రజ్ఞత - అచ్చంగా తెలుగు
 
స్థితప్రజ్ఞత

సి.హెచ్.ప్రతాప్

భగవద్గీత 3 వ అధ్యాయం ( కర్మయోగం) 42 వ శ్లోకం

ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య : పరం మన:
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు స:

స్థూల శరీరం కంటే ఇంద్రియాలు శ్రేష్ఠమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్ఠమైనది. మనస్సుకు మించినది బుద్ధి, అంతకు మించినది ఆత్మ అని పరమాత్మ పై శ్లోకం ద్వారా బోధిస్తున్నాడు.

పవిత్రమైన కామం (కోరికలు) సిద్ధించుకోవదం తప్పుకాదు కాని అపవిత్రమైనవి, అధర్మమైనవాటిని తీర్చుకోవాలనుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. కాని ఇంద్రియాలను నియంత్రణలో వుంచుకోకపోతే, అవి చిత్తం వచ్చినట్లు పరుగులు తీసి మానవులు వాటి సాధనలో విచక్షణను కోల్పోయేటట్లు చేస్తాయి. ఇది మానవులను చివరకు పతనావస్థకు దిగజారుస్తుంది.

అయితే ఇంద్రియాలను నిరోధించేందుకు దేహ కర్మలను ఆపివేయడం తగదు.శరీరం ఎలాంటి కర్మలు చేయకుండా నిశ్చలంగా వుంచినా, క్రియాశీలత వున్న మనస్సు  చంచలమవుతూ మనవులను తీవ్ర కలతకు గురిచేస్తుంది.దీనికి విరుగుడు మనస్సు కంటే ఉన్నతమైనదైన బుద్ధిని మన నియంత్రణలో వుంచుకొని బుద్ధి పూర్వకంగా, బలవంతంగానైనా  మన కర్మలను భగవంతుని సేవలో వినియోగించాలి.అపుడు ఇంద్రియాలు అటు ఇటూ సంచరించకుండా నియంత్రణలోకి వస్తాయి. ఈ విధానాన్ని క్రమశిక్షణతో  కనీసం 40 రోజులపాటు అభ్యసిస్తే మనస్సు సైతం కొంతకాలానికి మన నియంత్రణలోకి వస్తుంది. మనస్సు భగవత్ సేవ వైపు స్థిరంగా మళ్ళగలిగితే అది నిత్యం, సత్యం అయిన శాశ్వతానందానికి దారి తీస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు  దుఖాలు,బాధలు వంటివి మనలను ఏం చెయ్యలేక తోకముడిస్తాయి. మనస్సు వీట్ అన్నిటికీ  అతీతంగా వుండే స్థితికి చేరుతుంది. ఈ స్థితినే స్థితప్రజ్ఞత అని భగవద్గీత బోధిస్తోంది.  చిత్తవృత్తిని నిరోధించుకోవడమే యోగం అని భారతీయ యోగశాస్త్రం భావించింది. ఇది మనిషి తనను తాను నిగ్రహించుకోవడానికి సంపూర్ణంగా తోడ్పడుతుంది. అలాంటి యోగబుద్ధినే ప్రజ్ఞగా భావించాలి. స్థిత అంటే ప్రతిష్ఠితమైనదిగా తెలుసుకున్నప్పుడు, స్థితప్రజ్ఞత అంటే యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకోవడమని అర్థమవుతుంది. దాన్ని సాధించినవాడే స్థితప్రజ్ఞుడు.

అందుకే బుద్ధి చేతనే మనస్సు నియంత్రణలోకి రావడం సాధ్యం. భగవంతుని యందు సంపూర్ణ శరణాగతితో మానవుడు తన బుద్ధితో మనస్సును ఆయన యందు నిష్కల్మషమైన భక్తి భావన యందు నిలిపితే  మనస్సు అప్రయత్నంగానే ధృఢవంతమౌతుంది.ఆ స్థితిలో ఎంతటి బలవత్తరమైన కోరికలైనా సరే అతడిని ఏమీ చెయ్యలేక తోక ముడిచి పారిపోతాయి. మనస్సు ప్రశాంత సరోవరంగా మారిపోయి తాత్కాలికంగా సరోవరంలోకి విసిరిన రాయి కొద్దిపాటి అలజడిని సృష్టించి , త్వరగా యధాస్థితికి వచ్చినట్లు సమస్యల అలజడులు కూడా త్వరగా సమసిపోయి మనస్సు యధార్ధ స్థితి అయిన ప్రశాంతతకు  తిరిగి వచ్చేస్తుంది. ప్రశాంత జీవనానికి ఈ సాధనే అత్యుత్తమం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నిత్యం చిత్తశుద్ధితో, క్రమ శిక్షణతో, భగవద్ భక్తితో  సాధన చేసేవారు  బుద్ధి చేత మానవుడు ఆత్మ యొక్క నిజ స్థితిని తెలుసుకొని తద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.
 బోధిస్తున్నాడు.

ఇంద్రియాలు మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తంగా ఉన్నప్పటికీ అవి కామ సంబంధిత కర్మలకు ద్వారాలుగా వున్నందున అవి ఎంతో బలవత్తరమైనవి మరియు జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి.

పవిత్రమైన కామం (కోరికలు) సిద్ధించుకోవదం తప్పుకాదు కాని అపవిత్రమైనవి, అధర్మమైనవాటిని తీర్చుకోవాలనుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. కాని ఇంద్రియాలను నియంత్రణలో వుంచుకోకపోతే, అవి చిత్తం వచ్చినట్లు పరుగులు తీసి మానవులు వాటి సాధనలో విచక్షణను కోల్పోయేటట్లు చేస్తాయి. ఇది మానవులను చివరకు పతనావస్థకు దిగజారుస్తుంది.

కోరికలు అనేవి మానవునిలో సహజం. కాని కోరికలను నియంత్రించుకుంటే ఎంతో ఉన్నతిని పొందవచ్చు. దీనికి మనిషిలో ధర్మాచరణ పట్ల ఇచ్ఛ కలగాలి. కోరికను మునులు, రుషులు కూడా కోరికలను పూర్తిగా త్యజించలేకపోయారనే మన పురాణాలు చెబుతాయ. విశ్వామిత్రుడు కూడా తన కోరికలను అదుపు చేసుకోలేక ఎన్నో ఏళ్ల తపస్సును వ్యర్థపరుచుకుని తిరిగి జ్ఞానవంతుడై తపస్సు ఆచరించాడు. తాను అనుకొన్నదాన్ని సాధించాడు. కనుకలో మానవుడు కోరికలను పూర్తిగా లేకుండా చేసుకొలేకపోయనా సరే ఆ కోరికలను నియంత్రించుకున్నా వారికి సత్ఫలితాలే వస్తాయి.

అయితే ఇంద్రియాలను నిరోధించేందుకు దేహ కర్మలను ఆపివేయడం తగదు.శరీరం ఎలాంటి కర్మలు చేయకుండా నిశ్చలంగా వుంచినా, క్రియాశీలత వున్న మనస్సు  చంచలమవుతూ మనవులను తీవ్ర కలతకు గురిచేస్తుంది.దీనికి విరుగుడు మనస్సు కంటే ఉన్నతమైనదైన బుద్ధిని మన నియంత్రణలో వుంచుకొని బుద్ధి పూర్వకంగా, బలవంతంగానైనా  మన కర్మలను భగవంతుని సేవలో వినియోగించాలి.అపుడు ఇంద్రియాలు అటు ఇటూ సంచరించకుండా నియంత్రణలోకి వస్తాయి. ఈ విధానాన్ని క్రమశిక్షణతో  కనీసం 40 రోజులపాటు అభ్యసిస్తే మనస్సు సైతం కొంతకాలానికి మన నియంత్రణలోకి వస్తుంది. మనస్సు భగవత్ సేవ వైపు స్థిరంగా మళ్ళగలిగితే అది నిత్యం, సత్యం అయిన శాశ్వతానందానికి దారి తీస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు  దుఖాలు,బాధలు వంటివి మనలను ఏం చెయ్యలేక తోకముడిస్తాయి. మనస్సు వీట్ అన్నిటికీ  అతీతంగా వుండే స్థితికి చేరుతుంది. ఈ స్థితినే స్థితప్రజ్ఞత అని భగవద్గీత బోధిస్తోంది.  

అందుకే బుద్ధి చేతనే మనస్సు నియంత్రణలోకి రావడం సాధ్యం. భగవంతుని యందు సంపూర్ణ శరణాగతితో మానవుడు తన బుద్ధితో మనస్సును ఆయన యందు నిష్కల్మషమైన భక్తి భావన యందు నిలిపితే  మనస్సు అప్రయత్నంగానే ధృఢవంతమౌతుంది.ఆ స్థితిలో ఎంతటి బలవత్తరమైన కోరికలైనా సరే అతడిని ఏమీ చెయ్యలేక తోక ముడిచి పారిపోతాయి. మనస్సు ప్రశాంత సరోవరంగా మారిపోయి తాత్కాలికంగా సరోవరంలోకి విసిరిన రాయి కొద్దిపాటి అలజడిని సృష్టించి , త్వరగా యధాస్థితికి వచ్చినట్లు సమస్యల అలజడులు కూడా త్వరగా సమసిపోయి మనస్సు యధార్ధ స్థితి అయిన ప్రశాంతతకు  తిరిగి వచ్చేస్తుంది. ప్రశాంత జీవనానికి ఈ సాధనే అత్యుత్తమం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నిత్యం చిత్తశుద్ధితో, క్రమ శిక్షణతో, భగవద్ భక్తితో  సాధన చేసేవారు  బుద్ధి చేత మానవుడు ఆత్మ యొక్క నిజ స్థితిని తెలుసుకొని తద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.

*** 

No comments:

Post a Comment

Pages