ప్రాచీన భారతీయ ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహ మిహిరుడు - అచ్చంగా తెలుగు

ప్రాచీన భారతీయ ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహ మిహిరుడు

Share This
 ప్రాచీన భారతీయ ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహ మిహిరుడు

అంబడిపూడి శ్యామ సుందర రావు 


వరాహ మిహిరుడు ప్రాచీన భారతీయ గొప్ప ఖగోళ శాస్త్రవేత్త మరియు జ్యోతిష్యుడు. అయన అసలు పేరు మిహిరుడు ఈయన ఉజ్జయిని నగరానికి సమీపంలో సా.శ. 4 వ శతాబ్దంలో ఆదిత్య దాసుడను జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రంలో నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను  కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరం ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకుని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి శాస్త్రాలేగాక, ప్రత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం చేసినట్లు అక్కడకు వెళ్ళి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రం, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిహీరుని  శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు.

విక్రమాదిత్యుని సంస్థానంలో చేరినాక అనుకోని సంఘటన వలన మిహిరుని పేరు వరాహ మిహిరుడిగా ప్రసిద్ధి చెందింది పేరు మార్పుకు దారి తీసిన ఆ అనుకోని సంఘటన ఏమిటో తెలుసుకుందాము విక్రమార్కుని ఒక కొడుకు పుట్టాడు మహారాజు జ్యోతిష్యులందరిని పిలిచి ఆ పసివాడి జాతకాన్ని పరిశీలించామని కోరాడు రాజ్యం లోని ప్రముఖ జ్యోతిష్యులందరు జనన కాలాన్ని బట్టి జాతకాన్ని పరిశీలించి రాకుమారునికి 18 వ ఏట ఒక గండము ఉన్నదని కానీ ఆ గండం గడిచి బయట పడతాడని జ్యోతిష్యులందరు  రాజుకు తెలియజేసారు కానీ వీరందరికి భిన్నముగా మిహిరుడు ఆ బాలుడు 18 ఆ ఏట ,ఫలానా మాసంలో,ఫలానా రోజున , సూర్యోదయానంతరం 27 ఘడియలకు వరాహము (పంది) వలన మరణిస్తాడని ఏమాత్రము జంకు లేకుండా నిర్మొహమాటంగా రాజుకు జాతకం లోని విషయాన్ని చెప్పాడు 

ఆందోళన చెందిన విక్రమార్కుడు తన మంత్రులను సలహా మేరకు తన భవనానికి దూరంగా ఒక ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించి దాని చుట్టూ ఎత్తైన ప్రాకారాన్ని ఆ ప్రాకారము చుట్టూ కందకం నిర్మించి ఏ రకమైన జంతువు ,లేదా క్రిమి కీటకాదులు లోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి బాలుని విద్యాభ్యాసానికి కూడా ఆ భవనంలోనే తగు ఏర్పాట్లు చేశారు ఆ విధముగా తన కుమారుని రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటి ప్రాణి ఏ ఒక్కటి లోనికి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు  మిహిరుడు చెప్పిన గడువు సమీపిస్తున్న కొద్ది జాగ్రత్తలను అధికము చేసాడు క్షణక్షణానికి తన కుమారుడి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. మిగిలిన జ్యోతిష్యులు కూడా మిహిరుడు  జాతక గణనలో ఏదో తప్పు చేసి ఉంటారు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రాజుకు ధైర్యం చెబుతూ ఉన్నారు 

సూర్యోదయము నుండి 26 వ ఘడియ గడిచింది అప్పుడు ఒక భటుడు వచ్చి రాజుగారికి రాకుమారుడి క్షేమ సమాచారాన్ని తెలిపారు ఆ వార్త విన్న రాజుగారు ఇతర జ్యోతిష్యులు మంత్రులు రాకుమారుని చూడటానికి బయలుదేరారు. వారందరు దారిలో ఉండాగానే అంటే 28 వ ఘడియ సమయములో ఒక భటుడు వచ్చి రాకుమారుడు  క్షేమము అని చెప్పాడు అందరూ మిహిరుని వంక చూసారు కానీ మిహిరుడు మాత్రం రాకుమారుడు ఈ లోకం విడిచి అప్పుడే ఒక ఘడియ అయినది అని అంటాడు ఆందోళనగా రాజు ఇతరులు ఏడవ  అంతస్తు పైకి రాకుమారుని చూడటానికి వెళితే అక్కడ ఒక ధ్వజస్తంభం కింద ఇనుప వరాహ విగ్రహం రొమ్ముపై బడి నెత్తురు కారి మరణించిన రాజకుమారుని చూశారు. రాజు పుత్రశోకంతో విలపించాడు.ఆ కాలంలో భవనం నిర్మించేటప్పుడు వారి కులదైవం ఐన వరాహమూర్తి విగ్రహాన్ని శిల్పి స్తంభంపై నిలిపాడు. కానీ .దైవ వశాత్ అది రాకుమారుని మరణమునకు కారణమయ్యింది. ఆ విధంగా మిహిరుని జోస్యం నిజమైంది రాజు తన కుమారుడి మరణానికి దుఃఖించినా  మిహిరుని జాతజక గణనకు మెచ్చుకున్నాడు మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నాల వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిష్య  శాస్త్ర వేత్త వరాహమిహిరుడు గా  పిలువబడ్డారు.

వరాహ మిహిరుడు ఒక అబ్దుతమైన శాస్త్రవేత్త ప్రాచీన సూర్య సిద్ధాంతాన్ని వెయ్యికి పైబడిన సంవత్సరం అనంతరం చేయబడిన పరిశోధనలు, స్వకల్పనలతో మార్చి గ్రంథస్తం చేశాడు అలాగే హోరా శాస్త్రం లోని 26 అధ్యాయాలను, 417 శ్లోకాలు చందుస్సులలో గాక వృత్తాలలో అందంగా అందించారు. దీనికి సహాయకారిగా సవాంశ గణీతం కూడా రచించాడు ఈ రెండు గ్రంథాలు ఆధారంగా సరియైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటి వరకు కూడా ప్రచారంలో వుంది ఈ  శాస్త్రం.బృహత్సంహిత అనే గ్రంధం లో గ్రహాల సంచారం, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వై చిత్రాలు, శకున ఫలాలు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున  నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయుర్వేదం, వజ్ర లేపనము, జంతువులు, మణుల పరీక్ష తిథి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియజేశారు ఆయన చేసిన పరిశోధన మూలంగా ప్రాచుర్యం పొందిన త్రికోణమితి (ట్రిఙ్ఞామెంటరీ )సూత్రాలు కనిపెట్టబడ్డాయి అంక గణితం (Arithmetic) లో సున్నా, అభావిక సంఖ్యల (Negative Numbers) గుణాలని వివరించాడు. 

భౌతిక శాస్త్రంలో  కాంతి కిరణాలు ప్రతిఫలనం చెందటం (Reflection), వక్రీకరణం (Refraction) చెందటం గురించి ఆయన రాసారు.

***

No comments:

Post a Comment

Pages