ఒకటైపోదామా ...ఊహల వాహినిలో! -18
"మరీ వింత వేషాలేస్తున్నావ్ ...అని నవ్వుతారేమోనని భయంగా ఉంది. మా నాన్నగారు పోయాక నాకు తమ్ముడు ఎవరు లేకపోవడంతో మరో మగ పిల్లాడి చెయ్యి పట్టుకునే అవసరం నాకు ఎప్పుడు రాలేదు. నిజంగా ఈ మూడు ఏళ్ల తర్వాత మీ నాన్నగారు ఒప్పుకుని మన పెళ్లికి ఓకే అంటే ప్రధానం జరిగే రోజున మీరు నా వేలికి ప్రదానపు ఉంగరం తొడుగుతారే... ఆరోజు మీరు ఆలా తొడుగుతుంటే మీ స్పర్శని తొలిసారి అనుభవిస్తూ ఆ ఉంగరం తొడిగించుకోవాలని ఉంది.''
''అంటే...అంటే...అంతవరకూ నిన్ను నేను ఏ రకంగానూ ముట్టుకోకూడదంటావ్..
"నా భావం మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు.. ఒక అతి చిన్న విషయం అడుగుతాను సమాధానం చెప్తారా? "
"అడుగు."
"మీ పెరట్లోనే ఒక అందమైన గులాబీ పూసింది అనుకోండి. దాన్ని వాసన చూసే దేవునికి పెడతారా? తిన్నగా తీసుకెళ్లి దేవుడికి పెడతారా? "
"నీ భావం అర్థమైంది నాకు. కానీ ఈ రోజుల్లో కూడా అలా నన్ను ముట్టుకోకు నా మాట కాకి అన్నట్టుగా ఉండటం మంచి పద్ధతి కాదు."
"మీరన్నమాట నిజమే. నేను మీ దగ్గరికి పవిత్రంగా వస్తాను అని చెప్తున్నాను. స్నేహితులు, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అందరితో కలివిడిగా ఉండడం నాకు ఇష్టమే. అలా అని ప్రతి ఒక్కరితో రాసుకుపూసుకు తిరగం కదండి. రేపు మనిద్దరం ఒక సినిమాకి వెళ్దాం. శాంతి థియేటర్లో మార్నింగ్ షోస్ మాత్రం వేస్తున్నారు. నాకు ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టం."
"మరి సినిమాల్లో నిన్ను నేను టచ్ చేస్తే? "
"అప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు చెప్పను. మీరే
చూద్దురుగాని. "
"సరే ఇంతకీ ఏం సినిమా అది? "
"మరో చరిత్ర అని కే బాలచందర్ అనే డైరెక్టర్ సినిమా. కమలహాసన్, సరిత యాక్ట్ చేశారు."
"ఏంటో ఆ సినిమాలో అంత ప్రత్యేకత? "
"ప్రేమించాను అంటున్నారుగా. అది చూశాక మీ ఫీలింగ్స్ చెప్పండి నాకు చాలు".
"అది కాదు హరిత ఏకంగా మూడు ఏళ్లపాటు కనీసం ముట్టుకోకూడదు అని నియమం పెడితే రేపు నా ఫ్రెండ్స్ నన్ను వెక్కిరిస్తారు."
"ప్రేమ అనేటువంటిది రెండు మనసులకు సంబంధించింది. స్నేహితులతో చెప్పుకునేది కాదండి. మీరు చెప్పే అంత దాన్ని కాదు నేను. నా స్నేహితురాలు ముట్టుకొని ఇవ్వలేదు అని చెప్పుకుంటే మీకే అవమానం. మగవారు మీకు ఏమి బానే ఉంటారు. రేపు ఏ కారణం చేతైనా సరే మీ నాన్నగారిని మీరు ఒప్పించ లేకపోతే, నేను పది మందిలో మీ చేత ప్రేమింపబడ్డాను అని అందరికీ తెలిస్తే ఒక ఆడపిల్ల ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. " అంది హరిత కంగారుగా.
"ఐ యాం సారీ హరిత. నేను అంత దూరం ఆలోచించలేదు. ఎవరో ఒకరు అడగక మానరు కదా. నువ్వు నాకు స్నేహితురాలు అనే చెబుతాను."
" ప్రామిస్? "
" ప్రామిస్"
యధా ప్రకారం అర్థసంకేతం శకుంతలకు చేరడం, శకుంతల వారి దగ్గరికి రావడం మరో రెండు నిమిషాల్లో జరిగిపోయాయి.
ఆమె వచ్చేలోగానే హరిత అంది.
"మీకు మరో చేదు వార్త. రేపు మనతో అమ్మ కూడా సినిమాకు వస్తుంది. "
" కొంపతీసి మనిద్దరి మధ్య కూర్చోబెడతావా ఏమిటి ఆవిడని? " వీరాజ్ అన్న తీరుకి హరిత పకపక నవ్వింది.
"మన వరుసలోనే చివర కూర్చుంటుంది. అమ్మకి కూడా ఆ సినిమా అంటే చాలా ఇష్టం " కవిత నవ్వు ఆపుకుంటూ అంది.
" బాబు వెళ్లి రామా మరి? " శకుంతల మాటకు తల ఊపి హరితకు బై చెప్పి
ముందుగా వికాస్ వెళ్లిపోయాడు.
***
మర్నాడు ఉదయం 10:00 గంటల ఆటకు
అనుకున్న ప్రకారం దియేటర్ దగ్గర కలుసుకున్నారు ముగ్గురు.
హరిత, విరాజ్ పక్కపక్కనే కూర్చున్నారు. శకుంతల అదే వరుసలో మొదటి సీట్లో కూర్చుంది.
ప్రకటనలు జరుగుతుండగా హరితతో అన్నాడు విరాజ్.
" ఆ సినిమాలో అంత ప్రత్యేకత ఏమిటో అని నిన్న రాత్రి ఫోన్ లోనే చూసేసాను. ఇలా రాకపోతే నువ్వు బాధ పడతావని వచ్చాను. పైగా నీ అంత నువ్వు నన్ను సినిమాకి ఆహ్వానించిన మొదటి అవకాశం ఇది."
" ఈ సినిమాలో కమలహాసన్, సరిత, మాధవి ముగ్గురు పాత్రలు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఈ సినిమా ఎన్నిసార్లు విడుదలైందో అన్నిసార్లు చూశాను. నేను కొన్ని సన్నివేశాలు చెప్తాను. ఆ సన్నివేశాలు దగ్గర మాత్రం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కాబట్టి. " అంది హరిత.
" అలాగే" అన్నాడు విరాజ్.
'' నిన్ను ప్రేమిస్తున్నాను ఒక పిచ్చిది'' అని సరిత కమల్ హాసన్ వీపు మీద ఐబ్రో పెన్సిల్ తో రాసి తన ప్రేమని అతని పట్ల ఎంత అద్భుతంగా వ్యక్తం చేస్తుందో చూశారా? ప్రతి సన్నివేశాలను హీరో హీరోయిన్ల ప్రేమ ఎంత పవిత్రమైందో మనకు తెలుస్తుందండి. "
"అవును. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే అత్యద్భుతం. ప్రతి సన్నివేశం చాలా చాలా బాగుంది."
" అప్పుడు కేవలం సినిమా చూస్తున్నట్టు చూసుంటారు. ఇప్పుడు ప్రతి సన్నివేశాన్ని మనసుపెట్టి చూడండి. ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా దర్శకుడు చూపించాడో... అది అసలు సినిమా అనిపించదు మనకి. సరిత తల్లి కమల్ హాసన్ ఫోటోలు కాల్చేసి ఆ బూడిదని అక్కడే వదిలేసినప్పుడు ఆ ఫోటో బూడిదని కాఫీలో కలిపేసుకు తాగేస్తుంది సరిత.
అలాగే మాధవి తన పెళ్లి శుభలేఖ పుచ్చుకుని కమలహాసన్ గారికి వచ్చి బాలు స్వప్నల ప్రేమ లేఖలన్నీ చదివి, హైదరాబాద్ వెళ్ళి సరితను కలుసుకుని, వారిద్దరిది అత్యంత పవిత్రమైన ప్రేమ అని తెలుసుకుని అప్పటివరకు పెట్టుకున్న బొట్టు తీసేసి శుభలేఖలు ఆపేస్తుంది.
కమల్ హాసన్ తో ' సరిత నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు 'అని అతని కర్తవ్యం గుర్తు చేస్తుంది.
అప్పుడు బ్యాంక్ పాప వచ్చి తన కోరికను తీర్చుకుంటుంది కమలహాసన్ ని.
'నువ్వు పెళ్లి చేసుకో నన్ను పవిత్రంగా స్వప్న దగ్గరికి వెళ్లనివ్వు' అని అని చెప్పి ఆ అమ్మాయిని పంపేస్తాడు.
సినిమా అంతా అయిపోయాక కెమెరా ఒక కొండ రాయి మధ్యలో ఉన్న నీటిలో తేలుతున్న ఉత్తరంలో కమలహాసన్ సరితకు రాసిన కవితని చూపిస్తాడు దర్శకుడు మనకి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ విలువ తెలిసిన ఇద్దరు ప్రేమికులు తాము ఒకటయ్యేంతవరకు ఎంత పవిత్రంగా ప్రేమించుకోవచ్చో... తెలియజేసే అద్భుత ప్రణయకావ్యం ఈ చిత్రం. " అని వివరించి చెప్పింది విరాజ్ కి మాత్రమే వినబడేటట్లు.
ఆమె విశ్లేషణ తర్వాత సినిమా చూడటంలో మునిగిపోయాడు విరాజ్. ఇంటర్వెల్లో సమోసా పాప్కార్న్ తెచ్చి హరితకి శకుంతలకి ఇచ్చాడు.
చిత్రం చివరలో గుంటలో ఉన్న కాయితం మీద కవిత విని
హరిత చెవిలో ఏదో చెబుదామని పక్కకు తిరిగిన విరాజ్ కు హరిత వాళ్ళమ్మ గారు
ఎప్పుడు వెళ్లిపోయారో గుర్తించనే లేదు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment