మౌనంగా పలుకరించే ఆత్మీయత పుస్తకం. - అచ్చంగా తెలుగు
demo-image

మౌనంగా పలుకరించే ఆత్మీయత పుస్తకం.

Share This

 మౌనంగా పలుకరించే  ఆత్మీయత పుస్తకం.

    ..చందలూరి నారాయణరావు
         9704437247


book


పుస్తకమూ అచ్చం మనిషేలాగే
మౌనంగా పలుకరించే  ఆత్మీయత.
ఒక్క పుస్తకానిది ఒక్కో బంధం.
ఏ వయసువారైనా ఇష్టపడే పుస్తకంలో 
ఒక్కో రుచిది ఒక్కో ఔషదం .

చేతులెక్కి
లోకం భుజాలపై వాలి
నాలుకపై నడుస్తూ
భూమి అంచులను చేరి
కాలం ఖజానాలో
విలువైన ఆభరణం పుస్తకం.

ఏ ఊరిలో పుట్టినా
ఏ రూపంతో ఎదుటపడ్డా
ప్రేమను పంచే గొప్ప బంధం

ఒకరిలో జరిగిన తవ్వకంలో
బయటపడ్డ లంకె బిందెల్లా
వేల భావాలుకు వెలకట్టడంలో
తూనిక రాయి చదువరితనం.

ఒక కాలపు
అంచున కదిలిన అక్షరం
మరోకరిలో  ప్రయాణించి
మనిషికి మనిషిలా తోడులా
హుందాతమైన గౌరవం.

ఒక్క మాటలో చెప్పాలంటే
చరిత్ర నుదుట
మనిషి నడచిన మనసు
ముద్రల సంపుటి పుస్తకం .

***
Comment Using!!

Pages