శివం-117
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
నేను అనగా శివుడు
( కార్తికేయుడు తన రాజు అయిన హరి సిద్ధ గురించి చెప్పి.. అక్కడ కథ... కొన్ని మాసాలుగా ఏ కళా ప్రదర్శన లేకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన భూమిని రద్దు చేయడానికి చట్టంలో వీలుంది కాబట్టి రద్దు చేయమని కోరుకో గా.. నేను ఏమి చేయాలని హరసిద్ధ రాజు అడగగా దానికి కార్తికేయుడు చెబుతున్నాడు)
నేను " ఏమి ఆలోచన చెప్పావ్ మహారాజు కి నేనేమి ఆలోచించాలని అడిగాడు కదా . దానికి నువ్వేం చెప్పావు"
కార్తికేయుడు " ఉండు గురువా అదే చెబుతున్నాను నేను.. చెప్పేది వినకుండా మధ్యలో దూరి అది ఎట్లా ఇదట్ల అని అడిగితే ఎట్లా అయ్యా "అంటూ స్నేహంతో కూడిన అభిమానం వల్ల వచ్చే కసురుకునే ప్రక్రియ చేశాడు
ఇది చూసి కైలాస పరివారం అందరూ అనుకుంటున్నారు.. ఎవరన్నా కోపం తెప్పిస్తే ప్రళయ రుద్ర తాండవం చేస్తారు ఇప్పుడు ఈ భక్తుడు విసుక్కుంటుంటే మౌనంగా వహిస్తున్నాడు.. ఏమిటో ఈ మహా దేవుడు... బోలా శంకరుడు. అంటూ నవ్వుకుంటున్నారు..
నేను మాత్రం ఏం చేయగలను అందుకే వారితో జత కలిసి చిలిపిగా ఒక నవ్వు నవ్వాను
అక్కడ ఏం జరిగిందని.. కార్తికేయుడు నాకు చెబుతున్నాడు
కా " మహారాజా మీరు మాకు కొంత సమయాన్ని ఇవ్వండి.."
హర సిద్ధ " మిత్రమా నీవు చెప్పేది నిజమైతే మన రాజ్యపు రాజ్యాంగంలో ఆ చట్ట సవరణ ఎక్కడ ఉన్నాడో నాకు ఒకసారి చూపించుము.. అప్పుడు మాత్రమే నేను నీకు రాజ రాజముద్రిక వేసి ఈ ప్రాంతపు చక్రవర్తిగా నేను నీకు ఆజ్ఞను జారీ చేయగలను లేకపోతే ఉన్నపలంగా నువ్వు కళాకారులకు ఇచ్చిన భూమి మరియు దాని అధికారాలు ఉన్నవన్నీ వదులుకోవాలని ఆజ్ఞాపించగలను గుర్తు ఉంచుకో" అని చెప్పాడు
కా " నేను చూశాను మహారాజా.. ఆ చట్టం ఉన్నచోట రాజ్యాంగ పుస్తకంలో నేను గతంలో కొన్ని మైనపు బొట్లు వేశాను కావాలని "
హర సిద్దా " మరే భేష్ ఇంకేమి ఆ రాజ్యాంగ క్రమ సంఖ్య తీసి చూపించండి"
కా " అలాగే మహారాజా రేపు మన దర్బార్లో ఈ సవరణను మీకు చూపించెదను "
మరుసటి రోజు సభలో
హర సిద్దా " సభకు వందనాలు.. మనము కళాకారులకు ఇచ్చిన భూమిని రద్దు చేయవలసిందిగా దాని పైన వచ్చే అన్ని రకాల లాభాలను రద్దు చేయవలసిందిగా ఈ రాజ్య న్యాయదేవతని కోరి ఉన్నాము... కానీ మన మిత్రుడు కళాకారుల కోసం చట్టంలో ఒక సవరణ ఉంది ఆ సవరణ మీకు చూపించెదను అని చెప్పి ఈ రోజు ఈ అంతర్గత సభను పెట్టించాడు "
రాజ్యంలోని ఆర్థిక మరియు ధార్మిక మంత్రి అయిన హరసిద్దు సోదరుడు హరి సిద్దు
"మిత్రమా కార్తికేయ మీరు ఈ దర్బారు ఒక సభ్యుడుగా ఉండి ఎన్నో సేవలు అందించారు..
ఆ భూమిని ఊరికే వదిలేయడం వల్ల రాజ్యానికి ఎంతోకొంత ఆర్థిక నష్టం కలుగుతున్నది.."
కార్తికేయ " మహారాజా హరసిద్ధు గారు! మీ ముందు నేను సవినయంగా ఎటువంటి పరస్పర మనోభావాల సంఘర్షణ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడవచ్చునా ఇప్పుడు మాట్లాడేది స్వయానా మీ తమ్ముడైనను సరే "
హర సిద్దు " తప్పకుండా కార్తికేయ న్యాయం ఎవరు చెప్పినా అది న్యాయమే అన్యాయం ఎవరు చేసినా అవి అన్యాయమే.. మీరు తమ వాదనతో మమ్మల్ని మెప్పించి ఏదైనా చేయవచ్చును "
కా " ఆర్థిక మంత్రివర్గ హరి సిద్దు.. మీకు ఒక విషయాన్ని విన్నవించదల్చుకున్నాను. మన వ్యవసాయ భూమి ప్రతి ఏడాది మూడు పంటలు పండుతున్న మాట వాస్తవమే.. మా కళాకారులకు ఆ పంటని అమ్ముకోగా లేక రాజ్యానికి ఇవ్వగా వచ్చిన పైకంతో మా జీవన్ముక్తి వెల్లదీస్తున్నాము
. గత కొన్ని మాసాలుగా మా కళాకారుల బృందం లేనంత మాత్రాన వారు తిరిగి వచ్చిన తర్వాత వారికి ఎటువంటి అవసరాలు ఉండవా.. లేక వారికి ఏమైనాను వారి నమ్ముకొని ఆధారపడిన కుటుంబ సభ్యులకి ఏమైనా అవసరాలు ఉండవా.. ఒక రాజ్యము తన ప్రజల సంక్షేమాన్ని కచ్చితంగా చూడాలి అదే అన్యాయం చేసిన వారైతే వారిని కచ్చితంగా కాఠినంగా శిక్షించాలి.. భగవంతుని చూడటానికి వెళ్ళిన వారు ఇంకా తిరిగి రావటం నేరం కాదు కదా..శాస్త్ర ప్రకారం కూడా ఇంకొన్ని మాసాలు తర్వాత తిరిగి రాకపోతే మాత్రమే వారు లేనట్టు అని అనుకోవాలి మీక తెలుసు కదా కాశీకి బృందాలుగా వెళ్లి కొన్ని మాసాల్లో తిరిగి వస్తారు అని .."
హరి సిద్దు " మిత్రమా నీ వాదన బాగున్నది "
కా " ఆర్థిక మంత్రివర్యులు ఒకటి గుర్తుంచుకొనవలెను.. వచ్చిన రెండు పంటల్లో ఒక పంటని రాజ్య ఖజానాకి ఇచ్చేసి మరొక పంటని కళాకారుల బత్యం కోసము రాజ అధికార ప్రణాళిక శాఖ దగ్గర ఆ పైకము పొందుపరిచాను అందులో నాకు వచ్చేది కూడా నేను తీసుకోలేదు "
హరి సిద్దు " మీకు ఎలా ఈ రాజ్యసభలో జీతం వస్తుంది కదా కొన్ని హోదాలు కల్పించబడ్డాయి కదా ఇక మీకెందుకు "
కా " అదేమిటి ఆర్థిక మంత్రివర్య నాకు ఆ ధనం వర్తిస్తాయి కదా అని అవి తీసుకోకుండా ఉండాలని చెప్పటానికి మీకు ఎటువంటి అధికారం లేదు నేను కేవలము కళల పట్ల నా బృందం పట్ల నాకున్న.. నిజాయితీ వలన మాత్రమే అలా చేశాను "
హరి సిద్దు " శభాష్ కార్తికేయ మీరు మరొకసారి నిజాయితీపరుల నిరూపించుకున్నారు.. ఈ ప్రశ్నల్ని మమ్మల్ని వెయ్యమని అడిగిందే హరా సిద్దు మహారాజు వారు.. మీరు ఇప్పుడు సమాధానం చెప్పింది రాజ్యసభలో ఉన్న వ్యక్తులకే కాదు.. మహారాజుకు కూడా "
హరి సిద్దు మహారాజు " అటులనే మిత్రమా ముందు ఆ రాజ్యాంగంలో ప్రతిని చూపించము అని అడుగగా కార్తికేయుడు వెళ్లి రాజ్యాంగ ప్రతిని తీసుకొని మహారాజుకి అది చూపించాడు..
దాంతో సంతష్టమైన ఆ రాజ్య దర్బారు ఇక విచక్షణ అంతా హరసిద్దు మహారాజుకు మాత్రమే మిగిలి ఉన్నది అని మహారాజు చిత్తానికి నిర్ణయం వదిలి వేశారు
హర సిద్దు మహారాజు
" సభ్యులారా మీరు నామీద ఈ వదిలేసిన ఈ బాధ్యతను కచ్చితంగా కళాకారులకి సేవ చేయాలనే తలంపుతో నెరవేరుస్తాను "
కా " సంతోషము మహారాజా మీరు మాకు ముందు నుండి తెలుసు సాక్షాత్తు మహా దేవుడ చేత వరం పొందినవారు.. స్వయానా మీరు కూడా కళాకారులు శిల్పకళలో మీయొక్క మేదస్సు అమోఘం.. కానీ ప్రదర్శిత కలలైనా నృత్యము సంగీతము అభినయము నాటకము ఇవి రంజింపచేసిన విధముగా ప్రజలని కానీ భగవంతుడిని కానీ మరేవి రంజంప చేయలేవనేవి ఒప్పుకోవాల్సిన వాస్తవం "
హర సిద్దా" మీరు చెప్పిన దాంతోని నేకే భావిస్తాను అయితే ఇప్పుడు నేను మీకు ఏం చేయాలని చెప్పండి "
కా " మహారాజా చెప్పండి నేనేం చేయాలో మరికొంత సమయాన్ని మీరు కళాకారుల కోసం వేచి ఉండవచ్చు లేక మీరేమన్న చేయవచ్చు అని మమ్మల్ని ప్రభువుగా ఆజ్ఞాపించవచ్చు"
హర సిద్దు " మిత్రమా ముందుగా నీ సాటి కళాకారుల మీద నీకున్న ప్రేమ వారిని అర్థం చేసుకున్న విధానానికి నా ప్రణామాలు..
నాకున్న ప్రత్యేక అధికారాలు ద్వారా మరొ మూడు మాసాలు వారి కోసం చూద్దాం.. వారు రాలేని పక్షంలో.. మీరు మరొక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కళా ప్రదర్శన నాటక ప్రదర్శన ఖచ్చితముగా ఇవ్వాలి.. అది మమ్మల్ని మెప్పించాలి.. ఒకవేళ మీ వారు తిరిగి వచ్చిన సరే మీరు ఈసారి ఇచ్చే నాటకాన్ని అమోఘంగా ప్రదర్శించాలి దానికి మీరు ఏ కనికట్టు వాడతారో మీ ఇష్టం "
కా " ప్రభు అయితే ముందుగా ఒక మూడు నెలలు వేచి ఉంటాను తదుపరి.. మూడు నెలల్లో వారు రాకపోతే.. మూడు నెలలు అయిపోయేసరికి కార్తీక మాసం అయిపోతుంది.. నేను దేశీయాటన చేసి వివిధ ఊర్లకు వెళ్లి కళాకారులను ఎంచుకొని శివరాత్రికి.. మీకు ప్రదర్శన ఇచ్చే ఏర్పాటు చేస్తాను"
హర సిద్దా "అలా చేయకుండా ఉన్నచో.. మీ భూమి మీ భూమి వల్ల వచ్చే లాభాలు రద్దుచేసి రాజ్యము పూర్తిగా వాటిని తీసుకొని విలీనం చేసుకుంటుంది ఆ తరువాత మీరు ప్రాధేయపడినను బతిమాలినను ఉపయోగం ఉండదు" అంటూ రాజాజ్ఞ ఏటువంటి మొహమాటం లేకుండా ఆజ్ఞాపించి రాజాజ్ఞ ముద్రించి దానికి ఒప్పుకున్నట్లుగా నా చేత సంతకం చేయించుకొని వారి దగ్గర ఒక ప్రతి పెట్టుకొని నాకు ఒక ప్రతి ఇచ్చారు
నేను "ఓహో హరసిద్ధుడితో అంత జరిగిందా? ఎంతైనా కఠినాత్ముడు హర సిద్దుడు .. మధ్యలో రాజు అయ్యేసరికి లేనిపోని డాంబికం చూపిస్తున్నాడన్నమాట "
కా " తప్పు తప్పు గురువా ఎంతమాటన్నావు.. హరసిద్ధుడు నాకు అన్నలాంటివాడు.. అతడు రాజుగానే ప్రవర్తించాడు. అలా ప్రవర్తిస్తాడనే కదా సాక్షాత్తు మహాదేవుడు అతని చక్రవర్తిని చేశాడు.. శివుడినే చేత్తో లాక్కొని పోయిన ఘనుడు.. అతగాడు అలాంటివాడు కాదు ఏది ఏమైనా బంధము బంధమే బాధ్యత బాధ్యతే "
నేను " ఓహో ఏమిటో ఈ చమక్కుల పదానికి అర్థము కొద్దిగా విశదీకరింపుము "
కా " గురువా రాజా! ఓ శివ వేషధారి నా పాలిట శివుడా ! మూడు నెలలు గడిచినను నా బృందం వారు ఎవరు రాలేదు .. వారికి ఏమైనాదాని కలవరపడ్డాను. కళాకారుల కోసం ఇచ్చిన భూమిని ఏమి చేయాలని ఆలోచించసాగాను , అప్పుడు హరసిద్ధుల వారు నన్ను వ్యక్తిగతమైన విందుకు పిలిచాడు "
ఎందుకని నేను వెళ్తే ఆయన అంతపురంలో లేడు
. తనకు ఎక్కడైతే శివుడు రాజ్యాధికారం ఇచ్చాడు అక్కడ ఒక దేవాలయం కడుతున్నారు.. ఆ దేవాలయానికి ఆయన సాధారణ శిల్పి లాగా పనిచేస్తున్నాడు.. తనకి శివుడు కనపడి వరమిచ్చినది తనే చెక్కుకుంటున్నాడు..
నేను గతంలో శివుడు ప్రత్యక్షమైన చోటికి వెళ్లలేకపోయాను ఆ ఊరిలో లేకపోవడం వల్ల కానీ ఇప్పుడు అక్కడికే వెళ్లి హరసిద్ధుడు ఇప్పుడైనా మహారాజు కాదు కేవలం శిల్పిహరసిద్ధుడు.. చూసి.. హరసిద్ధుణ్ణి ఆయన చెక్కిన శిల్పాన్ని చూసి సాక్షాత్తు శివుడనే అనుకున్నాను అంత బాగా చెక్కాడు గురువా.. ఆ విగ్రహం చూసే శివుడు ఇలా ఉంటాడని అనుకోని నిన్ను చూసి ఆ విగ్రహం కి దగ్గరగా ఉన్నావని శివుడి పాత్రకి ఎంచుకున్నాను గురువా..! "
నేను " తర్వాతే ఏమైనదో చెప్పు "
కైలాస పరివారం అంతా ఈయనకేదో తెలియనట్టు భలే అడుగుతున్నాడే చిన్నపిల్లడు వలె అని అనుకున్నారు..
విష్ణు దేవుడు బ్రహ్మ దేవుడు మాత్రం " ఈయన చిలిపి కవళికలు లీలలు కృష్ణుడిగా నేను సైతం చేయలేదు" అని చమత్కరించారు
కా " అక్కడికి వెళ్ళగానే నేను కూడా మహారాజని పిలవకుండా హరసిద్దన్న అని పిలిచాను "
హర సిద్దా " తమ్ముడు కార్తికేయ "
కా"అన్న చెప్పన్న నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా "
హ " లేదు కార్తికేయ బహు చక్కగా మాట్లాడావు కళాకారుల కోసం నువ్వు పోరాడుతుంటే సాటి కళాకారుడుగా నేను మౌనంగా ఉండగలనా ఎట్లా అయినా సరే ఈ ఒప్పందంలో నీవు గెలిచి కళాకారుల భూమిని కాపాడాలి "అని నా భుజం తట్టాడు
కా "అన్నా నాకు నీ మనసు తెలుసన్న ! రేపటితో కార్తీక్ మాసం అయిపోతుంది మూడు నెలలు గడిచిపోతాయి తదుపరి శివరాత్రికి ప్రదర్శన ఖచ్చితంగా ఇవ్వాలి.. కానీ నాకు ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నాను" అని అనగానే
హర సిద్దా " తమ్ముడు కార్తికేయ ! రాజ్యం కోసం ఈ దేవాలయం కడుతున్నాను కదా ఈ దేవాలయంలో నేను చేసిన శిల్పి పనికి నాకు కొంచెం కూలి వచ్చింది .. ఆ కూలి తీసుకో అని మొత్తం పైకం నా చేతిలో పెట్టాడు.. అంతేకాకుండా నీ ప్రదర్శన కోసం నువ్వు ఏమన్నా చేయని చెప్పి గతంలో ఆయనకి కుంభరాజ్యంలో వచ్చిన బంగారు నాణేలు వెండి నాణాలు కూడా నాకు ఇచ్చాడు. కార్తికేయ ఇది నా వ్యక్తిగత సంపాదన రాజుగా నేను నీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు.. నీకు హర సిద్దు అన్నగా మాత్రమే ఇచ్చాను ఒక అన్నగా నేను నీకు చేత అయిన సహాయం చేస్తాను కచ్చితంగా న్యాయముని ధర్మముని చట్టమును కాపాడవలసిన బాధ్యత నాది, అందుకే నీకు ఆ నిబంధన విధించాను ."
కా " ఆయన ఆదరణకి అభిమానానికి నేను చలిన్చిపోయాను గురువా.. నాకు వచ్చే పైకంతో నా ఆర్థిక అవసరాలు మాత్రమే గట్టి ఎక్కుతున్నాయి అనవసరంగా నేను నాటకం ప్రదర్శిస్తానని ఒప్పుకున్నానేమో ఒప్పందం మీద సంతకం పెట్టానేమో అని బాధపడ్డాను, కానీ నా పరిస్థితి తెలిసిన హరసిద్ధ మహారాజు నాకు ఆ పైకం ఇవ్వటం అనేది ఎంతో ఊరటను కలిగించింది.
ఆయనకు చెప్పిన విధంగా అవి కేవలం నాకు పురమాయించిన పని కోసమే వాడతాను
ఇక ఆ తర్వాత హర సిద్ది అన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరి వచ్చాను "
అక్కడ నుండి బయలుదేరి .. కోటప్పకొండ వచ్చాను అక్కడ నీవు నాకు తగిలావు.. కోటయ్య స్వామి దయవల్ల నీ దగ్గర బృందం ఉన్నారని చెప్పావు.. నీకు నాకు బాగా శృతి కుదిరింది ఇలా మనం కథలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి అసలు పని ఎప్పుడు మొదలుపెడదాం.
నేను " అసలు పనిలోనే మనం ఉన్నాము నాయన! "
కా " గురువా ఉన్నదనాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి "
నేను " ధనమా మన దగ్గర లేని ధనమా సాక్షాత్తు లక్ష్మీదేవికే ధనమిచ్చిన వాడను నేను "
కా " ఏంటి గురువా లచ్చిమి అక్కతో పరాచకాలు చేయవాకు గురువా ! "
నేను " అదే లేవయ్యా నేను శివుడు అని అన్నావు కదా లక్ష్మీదేవికి ధనమిచ్చింది శివుడే కదా అని నా ఉద్దేశం "
కార్తికేయుడు మరియు పరివారం
" చెప్పింది నిజమే కదా అంటూ నాకు నమస్కారం చేసుకుంటున్నారు"
మీరు చేసుకోండి ముందుంది కళావైభవం
No comments:
Post a Comment