వసంత విరహం
కందర్ప మూర్తి ,హైదరాబాద్
మొబైల్, వాట్సప్ : 8374540331
వసంతం ప్రారంభమైంది. ప్రకృతిలో చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్లతో తళతళలాడుతు ఉంటే రంగురంగుల మొగ్గలు, విరిసిన పుష్పాలతో పూలవనం సింగారించుకుంటోంది.
తెలతెలవారుతోంది. ఉదయసూర్యుడి లేలేత బంగారు కిరణాలు రెక్కల మీద మెరుస్తుంటే, మొహంలో నిగారింపు, శరీరంలో యవ్వన సొగసులు కనబడుతుంటే మంచు బిందువులతో తడిసిన గులాబి ఆకు మీద కూర్చున్న మోహిని రాణి తేనెటీగ తన సమ్మోహన రూపానికి గర్వంతో మురిసిపోతోంది.భగవంతుడు ప్రకృతిలో అందాన్ని తనకే అద్దినట్టు తెగ సంబరపడిపోతోంది.
ఆమె సమ్మోహన రూపానికి ఆకర్షితులై అనేక మగ పోతుటీగలు రాణి ఈగ చుట్టు ఎగురుతు నన్ను ప్రేమించు అంటె కాదు నన్నే వరించంటూ విరహ రాగాలు వినిపిస్తున్నాయి. వారి పాట్లు చూసిన రాణి ఈగకు తన అందం మీద మరింత గర్వం పెరిగింది. వారిని తన పాద దాసులుగా చేసుకోవాలని నిర్ణయించుకుంది.
మగ తేనెటీగల్ని ఒకచోటికి చేర్చి వయ్యారంగా" మీలో ఎంతమంది వీరులు ధీరులు ముందుకు వచ్చి నాకు చక్కటి తియ్యని బంగారు తేనె మహల్ నిర్మిస్తారో వారితో ఉంటానని" ఆశ చూపింది.
ఇంకేముంది, మగ తేనెటీగలు తలో దిశకు ప్రయాణమై పూలమొగ్గలు, లేత ఆకులు, పుష్ప రేకుల నుంచి మెత్తని చిక్కని మైనాన్ని- సేకరించి తమ నోటి లాలాజలంతో అరలు అరలుగా అంతస్థులు నిర్మించి వాటినిండా పుష్పాల పుప్పొడి నుంచి తియ్యటి మథువును సేకరించి రాణికి కానుకగా నింపాయి.
మగ తేనెటీగల శ్రమ కృషి వల్ల తనకు ఇంతటి వైభోగాలతో నివాసం ఏర్పడినందుకు ఆనందిస్తు ఎప్పుడూ వీరిని తన గుప్పిటలో ఉంచుకుంటే వసంతం అంతా పండగ
జరుపుకోవచ్చనుకుంది.
తమని రాణి ఈగ ఎప్పుడు కరుణిస్తుందని ఎదురు చూసే మగ తేనెటీగల ఆశలు అడియాసలవుతున్నాయి. రాణి రోజుకొక అర చొప్పున పున్నమి వరకూ నింపిన తేనెను
కడుపునిండా జుర్రి అమావాస్య లోపున కాళీ చేస్తోంది. భగ్న హృదయ పోతుటీగలు మళ్లా గట్లంట, పుట్లంట చెట్లంట వెతికి పువ్వుల నుంచి తేనెను సేకరించి రాణి తేనెటీగ కాళీ చేసిన అరలను తేనెతో నింపుతున్నాయి. ఇలా తేనెపట్టును ఎన్నో పున్నాలకు పూర్తి చేస్తుంటే అమావాస్య లోపున రాణి ఈగ కాళీ చేస్తోంది కాని ఇప్పటి వరకు వాటి ప్రేమ నెరవేరలేదు.
* * * *
No comments:
Post a Comment