ఆడబిడ్డా ! నీ చిరునామా ఎక్కడ ?
అలనాడు ఆడపిల్లగ పుట్టుట కన్న
అడవిలో కలుపుమొక్కగ పుట్టుట మేలు
చదువుసంద్యలు లేని అజ్ఝాన అంధకారమున
ఆంక్షల పరిధిలో ఇంటిలోన సంకెళ్లు
అక్షరజ్ఞానము లేకుండగ కాలము వెళ్లబుచ్చె
కన్యాశుల్కము పేరున అంగడి బొమ్మగ చేసి
పసివయసులోన అమ్మినారు నిన్ను
బాల్య వయసులోన బాల వధువు
వయసు వచ్చినాక బాల విధవ
ఆంక్షల అంధకారమున సాగును
యవ్వన జీవితం అడవిపాలు
భారము తీరునని పసివయసులోనె
పసుపుతాడు బంధంతో కాళ్లకు పారాణి పెట్టి
తోలెదరు అత్తవారింటికి నవ వధువుగా
మొదలగును అప్పటి నుండి ఆడ... పిల్లగ
బతుకుబండి కడు భారముగ లాగలేక
సాగును ఆమె జీవితం గానుగ ఎద్దులాగ
రోజులు మారినా నేటి ఆడపిల్ల బతుకు మారలేదు
పాఠశాల నుంచి ఉధ్యోగ పదవులలోన కూడ
లైంగిక వేధింపులె అన్ని రంగాలలోన
ఆడపిల్లంటె గుండెల మీద కుంపటిగ తలిచి
కడుపులోని పిండము ఆడశిశువని తెలిసిన
బాహ్య ప్రపంచమును చూడకుండగనె
కడుపులోనే కరగబెడుతున్నారు కిరాతముగ నేడు.
* * * *
ఆడబిడ్డా ! నీ చిరునామా ఎక్కడ ?
***
No comments:
Post a Comment