పుష్పక విమానం
అంబడిపూడి శ్యామసుందర రావు
భారతీయ పురాణాల్లో ప్రస్తావించబడిన గాలిలో ఎగరగలిగే ఒక వాహనం పుష్పక విమానం దీనిలో . ఎంతమంది కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం. రామాయణంలో దీని గురించి వర్ణన సుందరకాండ ఏడవ సర్గ లో రావణాసురుని భవనంలో ఉన్న పుష్పక విమానాన్ని హనుమంతుడు వర్ణిస్తాడు అలాగే ఎనిమిదవ,తొమ్మిదవ సర్గల లో కూడా పుష్పక విమాన వర్ణన ఉంటుంది యుద్ధానంతరం సీత తో కూడి సకాలములో అంటే అరణ్య వాసము పదునాలుగేళ్ళు పూర్తి అయ్యాక భరతుడు ప్రాయోపవేశము చేయడానికి సిద్దమవుతున్నప్పుడు అయోధ్య చేరడానికి శ్రీ రాముడు సపరివారంగా ఈ పుష్పక విమానాన్ని ఉపయోగిస్తాడు.
సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకలో ప్రవేశించి రావణాసురుని భవనంలో పుష్పక విమానాన్ని చూస్తాడు వాల్మీకి రామాయణంలో ఆ విమానం ఇలా వర్ణించబడింది. దేవశిల్పి అయిన విశ్వకర్మ బ్రహ్మ దేవుని కోరికపై ఈ దివ్యమైన విమానాన్ని నిర్మించాడు కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి కానుకగా పొందాడు. కుబేరుని దగ్గర ఆ విమానాన్ని చూసిన రావణుని తల్లి కైకసి ఆ విమానాన్ని తీసుకు రమ్మని చెబితే రావణుడు కుబేరుని జయించి ఆ విమానాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. శ్రీ రామ రావణ యుద్ధానంతరం ఆ విమానంలో అయోధ్య చేరిన తర్వాత కుబేరునికి ఇస్తాడు. ఈ పుష్పక విమానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం ఆ ప్రత్యేకతలను సుందరకాండ లోని ఏడు, ఎనిమిది, తొమ్మిది సర్గలలో చాలా సుందరంగా వర్ణించబడినాయి
పుష్పక విమాన నిర్మాణం సాటిలేనిది, ఊహలకు అందనిది మణులతో, వజ్రములతో చిత్రముగా నిర్మించబడింది, మేలిమి బంగారు కిటికీలు గలది అందులో ఆసీనులైన వారి ఆలోచనలు అనుసరించి అది సంహరించగలదు. దాని గమనం శత్రువులకు నివారింప శక్యము కానిది. వేల కొలది భూత గణములు ఆ విమానాన్ని మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కానీ లేదు.అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహతంగా తిరుగ గలది. పుష్పక విమానం మేఘాల రూపంలో మహోన్నతంగా విశాలముగా ఆహ్లాదకరంగా బంగారముతో నిర్మితమైనది. ఆ విమానం రావణాసురుని స్థాయికి తగ్గట్టుగా ఠీవిగా ఉంది.ఆ విమానం సాక్షాత్తు దివి నుండి భువికి దిగి వచ్చిన స్వర్గము మాదిరిగా ఉన్నది రకరకాల మణులు పొడగబడి కాంతులను విరజిమ్ముతుంది. అత్యంత సుందరమైన ఉన్నతమైన పర్వతం మాదిరిగా హాయిని గొల్పుతున్న పుష్పక విమానాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్య పోయాడు. ,ఆ విమానం గొప్ప తపస్సు ఆధారంగా నిర్మించబడింది
బ్రహ్మ దేవుని కోసం విశ్వ కర్మ ఈ పుష్పక విమానాన్ని నిర్మించగా కుబేరుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి కానుకగా పొందాడు కానీ రావణుడు తన భుజ బలంతో కుబేరుడిని ఓడించి ఆ విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు విశ్వ కర్మ చే నిర్మితమైన ఈ పుష్పక విమానానికి స్తంభాలు వెండి బంగారముల తోను, మెట్లు బంగారం తోనూ నిర్మించబడ్డాయి లోపల అనేక రహస్య మందిరాలు నిర్మించబడ్డాయి. లోపలి వేదికలు ఎంతో సుందరంగా నిర్మించబడ్డాయి. ఆ వేదికలు ఇంద్రనీలాలతో ,మహా నీలాలతో నిర్మింపబడి నేల భాగం అంతా పగడాలతో, మణులతో, ముత్యాలతో కూర్చబడి అత్యంత శోభాయమానంగా ఉంటుంది. సువాసనలు వెదజల్లుతున్న ఎర్ర చందనం ఆ విమానం అంతటా తన పరిమళాన్ని పరిమళాన్ని పరిచింది. అటువంటి లోకాలన్నీ మెచ్చుకునే విధంగా విశ్వకర్మ తయారు చేసిన పుష్క విమానాన్ని అంజనీ సుతుడు హనుమంతుడు దర్శించాడు. ఆ పుష్పక విమానం సాక్షాత్తు దివి నుండి భువికి దిగి వచ్చిన స్వర్గం లాగ ఉన్నది.
***
No comments:
Post a Comment