శివం-118
శివుడే చెబుతున్న కథలు
రాజ కార్తీక్
నేను అనగా శివుడు
( కోటప్పకొండ నుండి నేను చెప్పిన గమ్యానికి వెళ్తున్న నాకు కార్తికేయునికి... జరిగిన మాటలు మరియు అతని కథలు
హరసిద్ధు డి న్యాయస్థానంలో.. జరిగిన ఒప్పందాన్ని హరసిద్ధుడు తనకి వ్యక్తిగతంగా చేసిన సాయాన్ని.. ఒక పరిణామ క్రమంలో చెప్తూ ముగించాడు కార్తికేయుడు)
కార్తికేయుడు " గురువా ఆ పొద్దున నుండి నడిపిస్తానే ఉన్నావు .. కాళ్లు నొప్పులు పుడుతున్నాయి గురువా "
నేను " దగ్గరికి వచ్చాము లేవయ్యా ఇంక భయపడకు"
కా "హా"
నేను " అయితే ఇప్పుడు నీ ముందు ఒక మంచి నాటకం వేయవలసిన బాధ్యత ఉంది.."
కా " అదే కదా గురువా నీకు నేను చెప్పింది ,"
నేను " నువ్వేమీ భయపడకులే నాకు ఒక నాటక సమాజం ఉంది.. వారందరినీ నీకోసం నేను దింపుతాను "
కా " సంతోషం గురువా వచ్చి రాగానే నువ్వు పరిచయం అయ్యావు పరిచయం అవగానే నీ దగ్గర సమాజం ఉందని చెప్పావు ఇక మనకు ఇబ్బంది ఏముంది మా నాటక సమాజం వారు కాశీ నుంచి తిరిగి వచ్చేలోపు మీ నాటక సమాజంతో ఒక ఒక మంచి నాటకం వేసి ఎప్పటిలాగా రాజు గారిని ఒప్పించి మా భూములు నేను కాపాడుకుంటాను "
నేను " మా దగ్గర ఉన్న కళాకారులు నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకరుయ్యో.. వారి నటన ఉంది కానీ వారి యొక్క భావవ్యక్తీకరణను కానీ , నీవు శ్రద్ధగా వాడుకొనవలెను.."
కా " తప్పక గురువా ! కానీ నాది ఒక చిన్న సందేహం"
నేను " ఏమిటది కార్తికేయ"
కా " వారికి ఎంతో కొంత ధనము ఇవ్వవలెను కదా అవి నాటక ప్రవేశపెట్టిన తర్వాత ఇచ్చే విధంగా మాట్లాడగలవా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పైకము కొంతనే ఉన్నది.."
నేను " ఏమయ్యా నిన్ను ఎవరైనా గానీ ధనం అడిగామా.. మాకు దనముతో పనేలేదు ఆ ధనము విషయాలన్నీ గట్రా, నిన్ను చూసుకుంటాలే గాని. నీవు నాటకము దాని రచన మీద శ్రద్ధ చూపి మంచి కళా ప్రదర్శన చేయవలెనని కృతజ్ఞతతో సత్సంకల్పంతో ఉండుము "
కా " అంతమందికి ధనము సర్దు బలము నీ దగ్గర ఉన్నదా తెలియక అడుగుతున్న తప్పుగా అనుకోబాకు "
నేను " ఓ దానికేముంది.. కొన్ని మాసాలు ఆగు
నీకు కూడా.. ధన బలము కలుగుతున్నది...... ఈ నాటకం అయిపోయేలోపు"
కా " గురువా ఏమిటో తెలియదు గురువా నన్ను సమ్మోహన పరిచావు.. కొద్దిపాటి పరిచయంతోనే నీ వెంట గుడ్డిగా నేను వచ్చేస్తున్నాను"
నేను " నన్ను గుడ్డిగా నమ్మిన వారు ఎవరు వెనుకంజా వెయ్యరులే.."
కా " గురువా మీ యొక్క సంభాషణలు మాత్రం కథానాయకుడికి ఏమాత్రం తీసిపోవు సుమీ "
నేను విచిత్రమైన నవ్వు ఒకటి నవ్వాను..
నాతో పాటు కైలాస పరివారం వైకుంఠ పరివారం దేవత పరివారం కూడా
కా " అలాగే గురువా .. అయితే ధనం విషయం నువ్వు చూసుకుంటావా.. ఒకసారి మన నాటక సమాజాన్ని చూసిన వెంటనే నా దగ్గర ఉన్న రెండు బంగారు నాణాలు నీకు ఇస్తాను దానితో కొంతకాలం కదా నడుపు కొంత పైకం నా దగ్గర ఉంచుకుంటాను తిరిగి మా రాజ్యానికి వెళ్లడానికి "
నేను "నీ బంగారు నాణం నీ దగ్గరే ఉంచుకో స్వామి
. మాకేం అవసరం లేదు.. మా ఆవిడ వాళ్ళ అన్నయ్య భార్య దగ్గర చాలా తరగనీ అంత ధనం ఉంది.. ఆవిడ కేవలం కళ ల మీద అభిమానంతో నాటక సమాజాన్ని పోషిస్తుంది "
అని అనుకుంటుండగా.. అందరూ మీ లక్ష్మీ మాత వైపు చూశారు
లక్ష్మీ మాత " మహదేవుల వారు ఈ జగన్నాటకం కాదు విశ్వనాటకంలో విశ్వనాథ నాయకుని పాత్ర పోషిస్తూ నాకు ఒక మంచి పాత్రని ఇచ్చారు "
కా " ఆ తల్లి ఎవరో ధన్యురాలు అయ్యా.. మా ఆవిడ బాధలు అర్థం చేసుకొని మాకు సహాయం గా ఉంది "
నేను " కార్తికేయ ఆమె కళల్ని ధనమును గౌరవించే వాళ్ళకి మాత్రమే అవన్నీ ఇస్తుంది ఆవిడతో మనం ఎంత మర్యాదగా జాగ్రత్తగా విచ్చలవిడితనం లేకుండా ప్రేమ పూర్వకంగా ఉంటే ఆవిడ మన దగ్గరే ఉంటుంది "
కా " ఆవిడ మన దగ్గర ఉండటం ఏమిటి గురువా "
నేను " అదేనయ్యా ఆమె ఆశీర్వాదం ఆమె మనకు చేసే ధన సహాయం ! పెద్ద రచయితవి దేవుడు పాత్రల మీద తీరు తెన్నులు బాగా రాస్తావు చెప్పే సూక్ష్మమ్ అర్దం చేసుకోలేవు కళ్ళ ముందున్న మనుషులు ఎవరో కూడా అర్థం చేసుకోలేవు "
కా " ఏమిటి గురువా నా కళ్ళ ముందు నువ్వే కదా "
నేను " సరే కానీ ఏమిటి నీ నాటకం "
కా " నేను ఇప్పుడు చచ్చిన చెప్పను.. నా ఓపిక లేదు నువ్వు ఇంటికి వెళ్దాం అన్నావు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత చెబుతాను కాసేపు సేద తీరి"
నేను " అదే చూస్తున్నానయ్యా.. మా బావ ఒకడున్నాడు.. మా బావ వాళ్ళ చుట్టాల ఒకాయన ఉన్నాడు.."
విష్ణు దేవుడు బ్రహ్మదేవుడుతో " బ్రహ్మదేవా నా గురించి మీ గురించి చెబుతున్నారు సిద్ధంగా ఉండండి"
నేను " ఆయన ఇక్కడే ఉంటాడు.. ఆయన కనపడతాడేమో అని చూస్తున్నాను ఆయన రావటంతోనే ఇద్దరం కలిసి మేమున్న చోటికి వెళ్దాం "
కా " ఆయన ఏం చేస్తాడు.."
నేను " నేనేమో ఇలా దేశదిమ్మరీ లాగా నాటకాలని తిరుగుతూ ఉంటాను.. నాకు మడి మైల అలంకారము ఇట్లాంటివి ఏవి ఉండవు.. ఆయన మటుకు మా పరివారం అందరినీ చూస్తూ పోషిస్తూ విషయాలని చక్కబెడుతూ ఉంటాడు.. ఆయన కూడా నటుడు.."
కా "ఓహో అంటే మీరందరూ పెద్ద జమీందారులు అనమాట.. ఇందాక చెప్పావు ఒక ఆవిడ కళాకారులకు ధనమిస్తుందని ఆవిడ ఇప్పుడు మీ బావగారి భార్యనే? "
నేను " సరిగ్గా చెప్పావు. "
కా "మీ బావ నీ లాగానే కలిసిపోతాడా గురువా లేక ఆయన కొంచెం దర్పం ప్రదర్శిస్తాడా"
నేను " భలేవాడివి కార్తికేయ.. నేను వేరు ఆయన వేరు కాదు నేను నీతో ఎలా ఉంటానో ఆయన నీతో అలానే ఉంటాడు.. నేను చెప్పకుండానే నా మనసు అర్థం చేసుకొని చెప్పిన పనులన్నీ చేస్తాడు.. నా చేత పనులు చేయిస్తాడు.. ఆయన్ని పొగిడితే నన్ను ప్రసన్నం చేసుకోవచ్చు నన్ను పొగిడితే ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు అలా ఉంటుంది మా అనుబంధం .."
కా " మొత్తానికి బావ బామ్మర్దులు పరివారాన్ని అల్లాడిస్తున్నారు అనమాట "
అలా అనగానే అందరూ ఒక నవ్వు నవి..
విష్ణు దేవుడు వైపు చూశారు ..
విష్ణు దేవుడు" ఇక ఈ నాటకంలో నా పాత్ర కూడా ఆరంభమైంది "
నేను " ఓ బావ.. ఎక్కడున్నావ్ నువ్వు "
దేవ పరివారం అందరూ ఈ కార్తికేయడు ఎంత అదృష్టవంతుడు కదా.. సాక్షాత్తు హరిహరులని.. తన కళ తో కట్టిపడేశాడు .. అని అనుకుంటున్నారు
విష్ణు దేవుడు " నంది " అని పిలిచాడు
బ్రహ్మదేవుడు "బృంగి " అని పిలిచాడు
నందికి తన కళ్ల వెంట నీరు దారాపాతంగా సాగాయి..
ఇప్పటిదాకా తను మహాదేవుడిను మోసాడు..
ఇప్పుడు కార్తికేయ పుణ్యమా అని మహావిష్ణువుని కూడా మోయబోతున్నాడు
నంది అమితానందంతో.. కార్తికేయని కథల వల్ల తన జీవితంలో విష్ణు దేవుని మోస్తున్నాను అనే అమితమైన భక్తి మాధుర్యంతో పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనదైనా శైలిలో రంకె వేసి విష్ణు దేవుడి ముందు ఎక్కువ నామీద కూర్చో అన్నట్లు ఆహార్యం కనపరిచాడు.
బృంగి కూడా బ్రహ్మ దేవుని
అధిరోహింప చేసుకున్నాడు నంది లాగనే..
కా " ఇంతకీ ఇక్కడి నుంచి ఎంత దూరం అయ్యా మీ ఇల్లు ఇక్కడి నుంచి మళ్లీ మనం వచ్చిన దూరమంత వెళ్లాలా కొంపతీసి " హాస్యంగా
నేను " ఇదిగో అక్కడ గుబురుగా చెట్లు కనపడుతున్నాయి కదా అక్కడ ఒక బాట ఉన్నది..
ఆ బాటలో వెళుతూ ఆ చెట్లని దాటితే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అంతా మా పరివారందే "
కా " అవును గురువా అంత గుబుర్లు వెళ్తుంటే పాములే ఉండవా , దయ్యాలు ప్రే తాలు అలాంటివి ఉండవు కదా "
నేను "ఉంటాయి గాని పామలకు నేనంటే ఇష్టం
నా మీద పాకుతూ ఉంటాయి దయ్యాలు ప్రయత్నాలు నన్ను అనుసరిస్తూ ఉంటాయి "
కా " ఓరి నాయన నువ్వు పెద్ద అఘోరావై ఉన్నట్లు ప్రవర్తిస్తున్నావే "
నేను "ఇదే మా ఆవిడ కూడా అంటుంది అఘోరాలకి అఘోరివి ని , నేనున్నాగా నేను తీసుకెళ్తానుగా నీకు ఎందుకు అంత భయం నీ పని నువ్వు చేయటమే దృష్టి పెట్టు మిగతా దీ అంతా నేను చూసుకుంటాను"
కా "అలాగే గురువా నీదే భారం "
నేను " ఓ బావ! ఎంతసేపు పిలవాలా నిన్ను "
కా " ఆయన ఎవరో అన్ని పనులు చూసుకుంటాడు కదా ,ఇంత ఆలస్యమైంది ఎట్లాగో మనకి ఒక ఐదు నిమిషాలకి పోయేదేముంది మొత్తానికి వాళ్ల చెల్లిని నీకు ఇచ్చాడని భలే పెత్తనం చేస్తున్నావ్ గురువా"
నిజమే కదా అన్నట్లు నవ్వుతున్నారు త్రి మాతలు
అటు నుండి పిలుపు విని పడది
" వస్తున్నా బావ "
కా " అది లెక్క అచ్చం నీ లాగానే సమాధానం ఇచ్చాడు మీ బామ్మర్ది "
నేను " తొందరగా రా పెద్ద రచయిత పెద్ద దర్శకుడు వచ్చాడు మనకోసం"
కా " వద్దులే గురువా నా గురించి అంత పెద్ద పెద్ద మాటలు "
నేను " అలా అంటే ఎలా ఉన్నారు ఉన్నట్టు చెప్పాలి కదా "
కా " ఏదో నీ అభిమానం నీకు రచనలు నచ్చాయి కదా అని వాళ్లకు నచ్చాలని ఏముంది గురువా! "
నేను " నచ్చుతాయి నచ్చి తీరతాయి నచ్చాలి అంతే"
నంది అమితమైన వేగంతో పరిగెత్తుకొస్తున్నట్లు శబ్దం వినపడుతుంది..
ఆ చెట్ల గుబురు లో నుండి నందిని సారీ చేస్తున్న మహావిష్ణువు బయటకు వచ్చాడు .
నేను " ఓ బావ మా నంది చాలా ఆనందంగా ఉన్నట్టుంది దూరం నుంచి కనబడుతుంది "
నంది ఆనందంతో రంకె వేస్తూ "అంబా" అని అరిచింది అవునన్నట్లు..
కార్తికేయుడికి ఆయన్ని చూసి ఎంతో ఆనందం వేసింది
కా " గురువా నువ్వు చెప్తే ఏమనుకున్నా గానీ అచ్చు నువ్వు ఎలా ఉన్నావు దగ్గర దగ్గర ఆయన కూడా అట్లానే ఉన్నాడు.. నిన్ను చూసినప్పుడు ఏమనిపించిందో ఆయన చూసినప్పుడు కూడా అంతే మనసు ఉప్పొంగిపోతుంది.. మన నాటకం లో మహా విష్ణు పాత్రకి మంచి నటుడిని చూపెట్టావు "
ఆనందంతో ఒప్పొంగిపోతున్నాడు నందిలాగా
కా " తస్సదియ్య అదిరిపోయింది"
(సశేషం)
No comments:
Post a Comment