ఏకాంత సాధన ద్వారా యోగస్థితి - అచ్చంగా తెలుగు

ఏకాంత సాధన ద్వారా యోగస్థితి

Share This

ఏకాంత సాధన ద్వారా యోగస్థితి
సి.హెచ్.ప్రతాప్




భగవద్గీత 6 వ అధ్యాయం లోని 10 వ శ్లోకం

యోగీ యుఞ్జీత్ సతతమాత్మానం రహస్య స్థిత: |
ఏకకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహ :

 ఓ అర్జునా, యోగ స్థితిని కోరుకునే వారు ఏకాంతంలో నివసించాలి, నియంత్రిత మనస్సు మరియు శరీరంతో నిరంతరం ధ్యానంలో నిమగ్నమై, ఆనందం కోసం కోరికలు మరియు ఆస్తులను వదిలించుకోవాలి.భౌతికపరమైన సుఖాల కంటే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని కోరుకోవడమే శ్రేయస్కరమని భగవంతుడు అర్జునుడికి పై శ్లోకం ద్వారా బోధించాడు. భగవంతునికై ప్రాకులాడని జీవతం నిరర్థకమని మనం ఎంత వరకు భావించగలుగుతున్నామనేదే మన ఆధ్యాత్మిక జీవితపు తీవ్రతను నిర్ధారిస్తుంది. మనం ఆశలు  ఐహిక సుఖాలతో తృప్తిపడుతున్నంత కాలం ఆధ్యాత్మికా పేక్షకు బలం చేకూరదు.

ఆధ్యాత్మిక పాండిత్యానికి తోడు జీవితంలో కూడా సాధన అవసరం అన్న సంగతిని భగవంతుడు స్పష్టం చెస్తున్నాడు. భగవంతుడు పై శ్లోకం ద్వారా   ఏకాంత ప్రదేశం అవసరం గురించి చెబుతున్నాడు. లౌకిక ప్రపంచంలో జీవించే మనకు మన చుట్టూ సాధారణంగా ప్రాపంచిక వాతావరణం ఉంటుంది. నిరంతరం మనస్సు చేయవలసిన భౌతిక కర్మలు, వ్యాపార వ్యవహారాలు, కుటుంబ సంబంధ విషయాప్లు మనల్ని రోజంతో కట్టిపడేస్తాయి. ఈ భౌతిక కార్యకలాపాలు, వ్యక్తులు మరియు సంభాషణలు అన్నీ మనస్సును మరింత ప్రాపంచికంగా మారుస్తాయి. మనస్సును భగవంతుని వైపు మళ్లించాలంటే, ఏకాంత సాధన కోసం మనం రోజూ కొంత సమయం కేటాయించాలి. పశ్చిమ దేశాలలో దీనిని పెర్సనల్ క్వయిట్ టైం కింద వ్యవహరిస్తారు. ఈ సమయంలో అన్ని సమస్యలు, బాధ్యతలను పక్కన పెట్టి సమస్తేంద్రియాలను కేవలం భగవంతునిపై కేంద్రీకరించేలా అభ్యాసం చేయాలి. ఆ సమయంలో కేవలం భగవంతుని ధ్యానం, నామస్మరణపైనే దృష్టి సారించాలి తప్ప అన్యతరమైన విషయాలకు తీవునీయకూడదు.

భౌతికమైన కార్యకలాపాలలో మనం  నిమగ్నమై ఉన్నప్పుడు కూడా సదా భగవన్నామాన్ని మనసులోనే జపిస్తూ, ఆయనను స్మరించేందుకు ప్రయత్నించాలి. చిత్తశుధ్ది వుంటే ఇది సాధ్యమేనని ఎందరో ఆధ్యాత్మిక వేత్తలు నిరూపించారు. నిరంతరం అలా సాధనచేయడంవల్ల నామస్మరణ అప్రయత్నంగానే చెయ్యగలం. ఈ సాంసారిక విషయాలు అనిత్యమూ, తుచ్ఛమూ అనే విషయాన్ని వివేకంతో గ్రహించడం ద్వారా కూడా నిష్కామభావం పెంపొందించుకోవచ్చు.

ఏ భావాన్ని స్మరిస్తూ శరీరం వదలుతారో సదా ఆ భావమే స్మరిస్తూ ఆ తత్త్వాన్నే పొందుతారని వేదాలు స్పష్టం చెస్తున్నాయి. మరణకాలంలో మనస్సు  అనేక విధములైన ఆందోళనలకు,కాలవరానికి గురవడం వలన భగవంతునిపై కేంద్రీకృతం అవదం అసాధ్యం, కాబట్టి క్రమక్రమంగా కోరికలను వదిలించుకుంటూ భగవంతుని పాదారవిందములపై మనస్సును నిలపడం యుక్త వయస్సు నుండే అభ్యసించాలి. ఈ సాధనే మనస్సును అంతిమంగా భగవంతునిపై దృష్టి కేంద్రీకరించడానికి దాహదం చెస్తుంది. ధ్యానం చేసే యోగికి చరమ వృత్తి వలన బ్రహ్మాను భూతో లేక ఎవరిని ధ్యానం చేశాడో ఆ దేవతానుభూతో కలుగుతుంది. మరణించే వ్యక్తి చరమ వృత్తితో పరమాత్మ భావన ఉంటే ఆ పరమాత్మను పొందుతాడు అని యోగవాశిస్టం కూడా స్పష్టం చేస్తోంది.

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?" అని ఒక శిష్యుడు గురువుగారిని  అడిగితే దానికి ఆయన ఇలా జవాబు చెప్పారు "నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు, నీ మనసును మాత్రం ఆ భగవంతునిపైనే నిలకడగా ఉంచి సాధన చెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతి ప్రియమైన వాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

***

No comments:

Post a Comment

Pages