చీకటి ముంపు - అచ్చంగా తెలుగు

   చీకటి ముంపు

     చందలూరి నారాయణరావు
       9704437247    



రాత్రి పూట
భూమిపై ఒక్కడినే కూర్చుని
ఆకాశాన్ని చదివాను

గాలి అర్దం వినపడలేదు
నీరు జాడ తెలియలేదు
చీకటి నీడ కనపడలేదు

ఐనా మనసును
దిక్కుల్లో ముంచి
మట్టి బట్టలు కట్టించి

అడివితో మాట్లాడించి
సముద్రంతో కలిపాను
పర్వతాలను తిప్పి
మైదానాల్లో వదిలేసాను

ఒక్క నిజాన్ని
ప్రేమించలేని మనిషిని చూసి
బెంగతో

భూమి మంచం పట్టి
తూర్పు దిక్కును
ముడుచుకు పడుకుంది.

చీకటి ముంపుకు 
నేల ముఖం మునిగి
మనిషి కొట్టుకుపోయాడు.

***

No comments:

Post a Comment

Pages