దేవదేవోత్తముని తిరుతేరు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
రేకు: 0354-06 సం: 04-320
పల్లవి:
దేవదేవోత్తముని తిరుతేరు
దేవతలు గొలువగా తిరుతేరు
చ.1: తిరువీధులేగీని తిరుతేరు
తిరుపుగొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజుల దిరుతేరు
తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు
చ.2: ధిక్కిరించీ మోతలదిరుతేరు
దిక్కరికుంభా లదరదిరుతేరు
తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు
తెక్కులబ్రతాపించీ దిరుతేరు
చ.3: తీరిచె గలకలెల్ల దిరుతేరు
ధీర గరుడవాహపుదిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని -
తీరున నెలకొన్నట్టి తిరుతేరు
భావం
పల్లవి:
దేవదేవోత్తమునిది పూజ్యమైన రథం .
దేవతలు కొలిచేది పూజ్యమైన రథం.
చ.1:
పూజ్యమైన రథం పూజ్యమైన మాడ వీథులలో తిరుగుతున్నది.
పూజ్యమైన రథం గిరగిర తిరుగుతున్నది.
రాక్షసులను నశింపచేయునది పూజ్యమైన రథం.
దిక్కులన్నిటా పూజ్యమైన రథం కదులుతోంది.
చ.2:
పూజ్యమైన రథం మోతలను తిరస్కరిస్తుంది (అనగా రథపు చప్పుడు అధికమని భావం)
పూజ్యమైన రథం 1. ఐరావతము, 2. పుండరీకము, 3. వామనము, 4. కుముదము, 5. అంజనము, 6. పుష్పదంతము, 7. సార్వభౌమము, 8. సుప్రతీకము అను దిగ్గజముల కుంభస్థలములు అదురుచుండగా తిరుగుతున్నది.
గొప్పవైన ముత్యాల కుచ్చులతో ఉన్నది.
పూజ్యమైన రథం గర్వంతో (అతిశయిస్తూ)ప్రతాపము చూపిస్తున్నది.
చ.3:
పూజ్యమైన రథం పాపాలను ,విచారాలను పోగొడుతుంది.
పూజ్యమైన రథం ధీరుడైన గరుత్మంతుడు వాహనముగా కలిగిన విష్ణువుది.
No comments:
Post a Comment