లవణాసురుడు - అచ్చంగా తెలుగు

లవణాసురుడు

అంబడిపూడి శ్యామ సుందర రావు 



లవణాసురుని వృత్తాంతము రామాయణం లోని ఉత్తరా కాండ లో  వస్తుంది ఈ రాక్షసుడు రావణునికి వరుసకు బావ అయిన కృతయుగానికి చెందిన మధువు అనే రాక్షసుని కుమారుడు. మధువు మహాబలశాలి, దైత్య వంశానికి చెందినవాడైనప్పటికీ ఉదారస్వభావుడు దేవతలతో స్నేహం కలిగినవాడు బ్రాహ్మణ భక్తి కలిగినవాడు అతడు పరమశివుని గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు ప్రసన్నుడైన పరమశివుడు తన త్రిశూలం నుండి మరొక శులమును సృష్టించి అతనికి ఇచ్చి ,"రాక్షసా నీ ధర్మ నిరతికి మెచ్చి నీకు ఈ శులాన్ని ఇస్తున్నాను నీవు దేవతల పట్ల బ్రాహ్మణుల పట్ల భక్తి శ్రద్దలతో మెలిగినంత కాలం ఈ శులము నీ వద్దే ఉంటుంది.నిన్ను ఎదిరించి ఎవరైనా యుద్ధము చేస్తే వారిని భస్మం చేసి మరల నీ వద్దకు వస్తుంది. నీ అనంతరం ఈ శులము  వంశపారంపర్యంగా నీ కుమారులలో ఒక్కరికి మాత్రమే సంక్రమిస్తుంది శూలపాణి  అయిన నీ పుత్రుడు సమస్త ప్రాణులకు అవద్యుడు అని వరము ఇచ్చి అంతర్ధానమయినాడు 


విశ్వావసువుకు అనల లకు జన్మించిన కంభినసి మధువు భార్య ఈవిడ తేజస్వి, ఉత్తమురాలు మధువు కంభినసి లకు జన్మించినవాడే లవణాసురుడు ఇతను పరమ భయంకరుడు బాల్యము నుండి అనేకపాపకృత్యములు చేస్తుండేవాడు.తల్లిదండ్రులిద్దరూ ఇతని విషయములో చింతించేవారు  వాణ్ణి మంచిదారిన పెట్టటం మధువు వల్ల కాలేదు శులాన్నిలవణాసురునికి ఇచ్చి దాని ప్రభావం చెప్పి వారిద్దరూ రాజ్యం విడిచి సముద్ర గర్భంలో కలిసిపోతారు. అప్పటి నుంచి లవణాసురుడు లోకములను ప్రత్యేకించి మునులను బాధించేవాడు.

యమునా తీర వాసులైన మునులు నూరు మందికి పైగా రాముడి దర్శనార్థం ఒకనాడు వచ్చారు. వారు కలశాలతో తెచ్చిన నీరు, పళ్ళూ మొదలైన కానుకలు స్వీకరించి, వారందరినీ సుఖాసీనులను చేసి రాముడు, వారు వచ్చిన పని అడిగాడు. లవణాసురు డనేవాడు తమని మహా బాధ పెడుతున్నాడనీ, వాడి బాధ నుంచి విముక్తి కలిగించమని మునులు రాముణ్ణి కోరారు.శివుడి  ద్వారా పొందిన  శూలంతో  దాని అద్భుత శక్తి నెరిగిన లవణుడు మరింత విజృంభించి, అందరినీ బాధిస్తున్నాడు, మునులను మరింత వేపుకుతింటున్నాడు.మునులు చెప్పిన విషయాలన్నీ ఆలకించి రాముడు వారితో, “లవణాసురుణ్ణి నేను చంపిస్తాను. మీరు నిర్భయంగా ఉండండి,” అని అభయమిచ్చాడు. తరువాత అతను తన తమ్ములను చూసి, “లవణాసురుణ్ణి చంపే పనికి ఎవరు పూనుకుంటారు?” అని అడిగాడు. భరతుడు తానా పని చేస్తానన్నాడుకాని శత్రుఘ్నుడు భరతుడి పైన పోటీకి వచ్చి, తానే లవణాసురుణ్ణి చంపుతానని, తానుండగా భరతుడు శ్రమ పడటం భావ్యం కాదని, పడవలసిన శ్రమలన్నీ భరతుడు లోగడ నందిగ్రామంలో ఉన్నప్పుడే పడ్డాడనీ కాబట్టి భరతునికి విశ్రాంతి అవసరం అన్నాడు శ్రీరాముడు కూడా చిరునవ్వుతో అంగీకరించి,",శతృఘ్నా నీవు దుష్టుడైన లవణాసురుని సంహరించిన నిన్ను మధు నగరానికి పట్టాభిషిక్తుడిని చేస్తాను" అని అంటాడు దానికి  శత్రుఘ్నుడు "పెద్ద వారు ఉండగా నేను ఎట్లు పట్టాభిషిక్తుడిని కాగలను అది ధర్మం కాదు" అనెను శత్రుఘ్నుడి   ధర్మ  నిరతికి శ్రీరాముడు సంతసించి నీకు అధర్మ ఫలము అంటకుండా అనుగ్రహిస్తాను అని చెప్పిఒక రాజు చచ్చిపోతే మరొకడు వెంటనే రాజ్యభారం వహించడానికి సిద్ధంగా ఉండాలి.కాబట్టి  శత్రుఘ్నుడి  పట్టాభిషిక్తుడిని చేసి లవణాసురిని గురించి చెప్పెను 

లవణాసురునికి  సంక్రమించిన శులము వలన అతని పై యుద్దానికి వచ్చిన వారు ఆ శులము వలన భస్మము అవుతారు లవణాసురుడు ఆ  శులాన్ని  యుద్ధ సమయములో వాడాలి కాబట్టి అతను నిరాయుధుడిగా ఉన్నప్పుడు మాత్రమే అతనిని ఎదుర్కొనాలి కాబట్టి అతను ఆహార సముపార్జన కొరకు బయటకు వచ్చినప్పుడు తిరిగి నగరంలోకి ప్రవేశించాక మునుపే ఎదుర్కొనాలి అతను నగరం లోకి ప్రవేశిస్తే అతనిని ఎదుర్కొనుట అసాధ్యము అని శ్రీరాముడు శత్రుఘ్నునికి చెప్పి, శ్రీమహావిష్ణువు మధుకైటభులను సంహరించడానికి సృస్టించిన బాణాన్ని  శత్రుఘ్నునికి  ఇచ్చి ఆ బాణము ప్రయోగ ఉపసంహరణ శత్రుఘ్నుడికి కి వివరించి వాడు నగరం వదిలి ఎటైనా వెళ్ళి ఉన్న సమయంలో నీవు నగర ద్వారం ముట్టడించి, వాడు తిరిగి వచ్చినప్పుడు ద్వారం వద్దనే అటకాయించి చంపు. తనను చంపటానికెవరో వస్తున్నట్టు లవణుడికి తెలియగూడదు ఏ పరిస్థితిలోనూ వాడు నగరంలోకి వెళ్ళరాదు, శూలం వాడి చేతికి చిక్కరాదు.”అని శ్రీరాముడు  శత్రుఘ్నునికి చెప్పి  యుద్ధ గతిని వివరించి పంపించాడు

శతృజ్ఞుడు బలాలను ముందుగా పంపి ఒక మాసం తర్వాత తల్లులకు,అన్నలకు  నమస్కరించి శ్రీరాముని అనుమతి తీసుకొని కుల గురువైన వసిష్ఠుని ఆశీస్సులు పొంది మధువనానికి తానొక్కడే బయలు దేరాడు. దారిలో వాల్మీకి ఆశ్రమం చేరి వారి యోగక్షేమాలు తెలుసుకొని వాల్మీకి ద్వారా క ల్మషపాదుని వృత్తాంతం తెలుసుకుంటాడు.(కల్మషపాదుని  వృత్తాంతం మరో వ్యాసంలో తెలుసుకుందాం} కల్మషపాదుని వృత్తాంతము వాల్మీకి మహర్షి ద్వారా తెలుసుకున్న శత్రుఘ్నుడు ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి ఉదయం వాల్మీకి ఆశీస్సులతో  బయలుదేరి ఏడూ రోజులు ప్రయాణం చేసి యమునా నది తీరమున గల చ్యవనాది మహర్షుల ఆశ్రమం చేరాడు శత్రుఘ్నుడు చ్యవన మహర్షిని లవణాసురుని వద్ద ఉన్న శులము యొక్క ప్రభావము గురించి వివరముగా చెప్పమని అడిగాడు అప్పుడు ఆ మహర్షి ఆ శులము ధాటికి మరణించిన ఇక్షాకు వంశానికి చెందిన మాంధాత వృత్తాంతాన్ని చెప్పి మరునాడు ఉదయం లవణాసురుడు శులము తీసుకొనక ముందే వానిని వధించి సకల లోకాలకు శుభము చేకూర్చమని చెపుతాడు. 

మరునాడు ఉదయం మాంసాహార సేకరణ కోసం లవణాసురుడు నగరం బయటకు వస్తాడు అదే సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుర్బాణాలను ధరించి మదు పుర ద్వారము వద్ద లవణాసురుని కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. లవణాసురుడు మధ్యాహ్నం వేళకు వేటాడిన పెక్కు మృగాలతో నగర ముఖద్వారం వద్దకు చేరి శత్రుఘ్నుని చూసి తన ఆహారముగా భావిస్తాడు.,శత్రుఘ్నుడు లవణాసురునితో, "నేను నీకు ఆహారముగా రాలేదు నేను దశరదుని కుమారుడును శ్రీరాముని సోదరుడిని నిన్ను సంహరించడానికి వచ్చాను" అని చెపుతాడు ఈ మాటలు విన్న లవణాసురుడు, "రావణుని చంపిన శ్రీరాముని సోదరుడివా అయితే  నిన్ను సంహరించి నా ప్రతీకారం తీర్చుకుంటాను ఒక్క క్షణము అగు నేను నా ఆయుధం ను తెచ్చుకొని నిన్ను సంహరిస్తాను అని అంటాడు కానీ శత్రుఘ్నుడు వానికి అవకాశము ఇవ్వక ద్వంద యుద్దానికి సవాలు చేస్తాడు లవణాసురుడు మండిపడుతూ ఒక మహా వృక్షాన్ని పెకలించి శత్రుఘ్నడి  శిరస్సుపై తీవ్రంగా కొడతాడు ఆ దెబ్బకు శత్రుఘ్నుడు మూర్ఛిల్లాడు లవణాసురుడు శత్రుఘ్నుడు మరణించి ఉంటాడని భ్రమతో తనకిక భయము లేదని భావించి నగరము లోకి వెళ్ళడు  ఒక్క క్షణములో స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు శ్రీరాముడు తనకు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని లవణాసురుని విశాల వక్షస్థలముపై ప్రయోగిస్తాడు ఆ శరము లవణాసురుని వక్షస్థలాన్ని చీల్చి రసాతలమున ప్రవేశించి మరల శత్రుఘ్నుని తూణీరము లోకి చేరుతుంది. లవణాసురుడు హతుడైన వెంటనే అతని వద్ద ఉన్న పరమశివుని చే ప్రసాదింపైబడిన శూలము పరమశివుని చేరుతుంది. దేవతలు ఋషులు శత్రుఘ్నిని ప్రస్తుతింస్టారు ఇంద్రాది దేవతలు శత్రుఘ్నుని ప్రశింసించి ఒక వరము కోరుకోమంటారు శతృఘ్నుడు దేవతల  చే నిర్మింపబడ్డ మధు నగరాన్ని రాజధానిగా చేసికొని ఇచ్చటనే నివసిస్తాను మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతాడు. దేవతలు నీవు కోరినట్లు ఈ మదుపురం అన్ని రకాలుగా సుసంపన్నము అవుతుంది అని దీవించి వారి స్వస్థానములకు తిరిగి వెళతారు. ఆ విధముగా ,శతృఘ్నుడు లవణాసురుని సంహరించి మునులకు శాంతిని కలుగజేస్తాడు.

*** 


No comments:

Post a Comment

Pages