శివం- 119
శివుడే చెబుతున్న కథలు
రాజ కార్తీక్
దర్శకుని కథ
(కార్తికేయని నేను కోటప్పకొండ లో కలవటం , అక్కడ కార్తికేయుడు రాధ న చూడటం, తన ఇతివృత్తం నాకు చెప్పటం , తమ నాటక అభిలాష తెలియజేయడం . కార్తికేయతో నేను మా ఇంటికి వెళదాం పదా అని తీసుకెళ్లడం దారిలో బాల రామ బాల ఆంజనేయ కథ చెప్పటం , ఇప్పుడు విష్ణుమూర్తి నాకోసం రావటం)
నేను అనగా శివుడు ..
ఆనందంగా ఉరకలేస్తున్న నంది మీద అధిరోహించిన విష్ణు దేవుడు.. సామాన్య మనిషి వలె రైతు వలే వస్త్రధారణ చేసి .. నంది మీద నుంచి " ఓ బావ నేను వస్తున్నాను ఎక్కడికి పోయావు ఎంత కాలం నుంచి చెల్లాయి నీకోసం వెతుకుతుంది ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో చెప్పి పొమ్మని" అని కొద్దిగా ప్రేమతో అరిచినట్టు అడుగుతున్నాడు నన్ను..
విష్ణు దేవుడు " ఎవరినో పెద్ద మనషిని వెంటబెట్టుకొని వచ్చావే.. " అంటూ దూరం నుండి కేకలు పెడుతున్నాడు
కార్తికేయుడు " గురువ నీ పేరు రాజానే కదా "
నేను " ఇప్పుడు నా పేరు గురించి ఎందుకయ్యా అవును నా పేరు రాజానే "
కా " ఆయన ముందు నీ పేరుతో గౌరవంగా పిలిచి తర్వాత వరుస కలుపుతా,మనిషిని చూసి ఆనందపడేలోపే కొంచెం మాటకటువచ్చిందేమిటి " అనుకుంటున్నాడు విష్ణు దేవుడిని చూసి
రై రై ఆగు అంటూ నంది మీద నుంచి దిగి నంది మెడని ప్రేమగా పట్టుకొని నందికి ఒక ముద్దు పెట్టాడు..
విష్ణు " ఇదిగో నంది మీ యజమాని వచ్చాడని నేను ఎక్కితే అ లక్ష్యం చేయికుండా ఉంటావుగా "అంటున్నాడు
దానికి మా నంది.. అలాగే కచ్చితంగా నేను మిమ్మల్ని మోస్తాను అది నా అదృష్టం అన్నట్లు ఆనందంగా తలకాయ్ అటు ఇటు తిప్పుతుంది ..
అందమైన సుందర మోమూతో దగ్గరికి నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు విష్ణుమూర్తి ..
మీ త్రిమాతలు ఆంజనేయుడు ముల్లోకాలు కైలాస పరివారం అందరూ మా ఇద్దరినీ ఎదురుగా చూస్తూ ఉప్పొంగిపోతున్నారు.. బ్రహ్మదేవుడు సైతం
విష్ణువు " ఏమి బావ యాడకని పోయినావు చెల్లి నీ మీద దిగులు పెట్టుకున్నాది "
నేను " అది అది "
విష్ణు మూర్తి " ఏం బావ .. నువ్వు గనక లేకపోతే మా చెల్లి నీ మీద దిగులు పెట్టుకుంటాది కదా.. చెప్పకుండా పోతాయి అట్ట పోనీ నీతో వద్దాం అంటే మా అందరికి అన్నం పెట్టే ఆమె కదా.."
కార్తికేయ " రాజా గారు మీకు నిజంగా సొంత బావ న లేక సరదాగా వరుసకు పిలుస్తున్నాడా "
విష్ణు మూర్తి " ఏందయ్యా అంత మాట అన్నావ్, మా చెల్లె రాజ. కుమారి ఈయన ఏదో బైరాగి లా తిరుగుతూ ఉంటాడు
. మనిషి ఉత్తముడని పెళ్లి చేశాము ఇట్టా వదిలేసి పోతే ఎట్లా ఎక్కడెక్కడికో పోతాడు.. ఎక్కడికి పోయావంటే నా వాళ్ళ కోసం పోయొచ్చానంటాడు. ఎవరు ఏం మాట్లాడటానికి లేదు నువ్వు అన్న చెప్పు "
అని అన్నాడు
నేను మాత్రం చిలిపి నవ్వుతున్నాను
కా " ఆర్య తమరి పేరు ఏం పేరు ! "
విష్ణు వు " నా పేరు కూడా రాజానే "
కా " అదేంటి ఇద్దరూ ఒకే పేరు "
విష్ణువు " ఆయన నటరాజ నేను వరదరాజ .. ఇద్దరం అన్ని పనులు సక్కబేడుతూ ఉంటాంలే అందుకే అందరూ నన్ను ఆయన్ని రాజా అనే పిలుస్తారు ,"
కా " ఓహో అంటే అవతల ఉన్న భూముల్ని మీరిద్దరూ కలిసి సాగు చేసి పనులు పంచుకుంటారన్నమాట"
విష్ణువు " అది సరే నీకోసం చెల్లెమ్మ బాధపడుతుంది.."
నేను " ఇంతకీ మా చెల్లెమ్మ ఎలా ఉంది "
విష్ణువు " మీ చెల్లెమ్మకి ఏం బావ నా గుండె మీద చోటు ఇచ్చాను "
నేను " నేను మాత్రం ఏం తక్కువ చేశాను మీ చెల్లికి నా సగం శరీరం ఇచ్చాను కదా "
విష్ణుమూర్తి ఇక్కడ నుండి వరదరాజ అవుతాడు
వరద" చెల్లికి సగభాగం ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలయ్యా స్వామి "
నేను " నేను మీ చెల్లికి ఏం లోటు చేశాను అయ్యా "
వరద " ఏమయ్యా నువ్వు ఎప్పుడూ మా చెల్లి పక్కన ఉండి అన్ని పనులు పర్యవేక్షించాలి నువ్వు ఏమో నీవాళ్లు కోసమని పోయి విపత్కర పరిస్థితిలో చిక్కుకుంటావు ,(రాక్షసులకి విచిత్ర వరాలు ఇచ్చానని ఆయన భావన) ఆ తర్వాత మాకు గట్టి పని పెడతావు "
నేను " నేను ఏం చేసినా అందరూ మంచి కోసమే కదా బావ "
వరద " ఇవన్నీ కాదు ఇక నువ్వు ఎప్పుడు మా చెల్లి దగ్గరే ఉండాలి ఎక్కడికి పోకూడదు మీరే చెప్పండి " అని కార్తీకేయ చూసి అన్నాడు
కా " అవును గురువా మీ బావ చెప్పింది దాంట్లో నిజం ఉంది ఆ మహాతల్లి నీకోసం వండిపెట్టి , అందరికీ భోజనాలు వడ్డిస్తూ నువ్వు రాకపోతే బాధపడదు "
నేను " అన్నా చెల్లెలు ఇద్దరు నామీద పితురీలు చెబుతున్నారు నా వంటి మంచి భర్త ఎప్పుడు ఎవరికీ దొరకడు "
వరద " నిజమే కదా అందుకే కదా నిన్ను మా చెల్లి తో పాటు ఉండి పనులు చక్కబెట్టమని చెబుతున్నాను గాని నువ్వు చెడ్డోడు అని చెప్పట్లేదు కదా అయ్యా"
నేను " సరే బావ ఇప్పుడేమంటావ్ "
కా "ఏం గురువా నువ్వు? మీ బావ గారు చెప్తున్న అర్థం చేసుకోవేంది.. నువ్వు ఇప్పటినుంచి అమ్మగారి దగ్గరుండి పనులు చక్కబెట్టి ఆమె ఆజ్ఞ తీసుకొని లేక ఆమె అనుమతి తీసుకొని మాత్రమే మిగతా పనులు చేయాలి ఏమంటావు నువ్వు" అని అభిమానంతో కూడిన స్వరంతో గద్దించాడు
దానికి పార్వతి మాత ఎంతో ఆనందపడింది అంతేకాకుండా శివకేశవుల సరదా సంభాషణలు చూసి వారి అంతర్లీనత అర్థం చేసుకొని చక్కగా హాయిగా నవ్వుకుంటున్నారు..
నందిని చూసిన నేను దగ్గరికి వెళ్లి ఏమి నంది బాగున్నావా అని నందిని ముద్దు చేస్తున్నాను..
కా " గురువా "
వరద " ఏంటి స్వామి నీకు కూడా నేను గురువు నేనా"
కా "మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు ఒకే రకమైన ఆనందం కలిగింది.. నాకాయనట్లను నువ్వు కూడా అట్లనే "
వరద " ఎంత బాగా చెప్పావు స్వామి.. ఇది తెలియక ఇంకఎంతోమంది వాదాలు ఆడుకుంటున్నారు కీచులు ఆడుకుంటున్నారు"
కా " అవును గురువా మా శివయ్యని .. (ఎలాగో ఆవేశంలో ఉన్నానని అనుకుంటున్నాడు కదా) నువ్వు చాలా ప్రేమగా అంటున్నావు నువ్వు తిడుతున్న కూడా అది ఎంతో ఆత్మీయత కనపడుతుంది.. మరి ఇలా ఏం పట్టించుకోకుండా తిరుగుతుంటే బైరాగిలాగా ఒక అఘోరాలు లాగా.. నువ్వు ఎందుకు ఏమనవ్ గట్టిగా "
వరద " అదే మనందరి కోసం అదే మా అందరి కోసం ఎవరూ చేయలేని పని ఆయన చేశాడు "
కా " ఆ మా గురువు సమర్థుడే ఏదైనా చేయగలడు ఏం చేశాడు ఇంతకీ "
వరద " మా అందరి బాధలు ఆవేదనలు అని తీసుకొని మా కోసం ఒకసారి విషం తాగాడు "
కా " విషం తాగటం ఏంది గురువా "
వరద " అదే అదే.. విషం తాగినంత పని చేసి మా అందర్నీ కష్టాల నుంచి గట్టెక్కించాడు అందుకే ఆయన ఏమన్నా ఆయన ఎవరు ఏమనము ఎందుకంటే ఆయన కూడా ప్రధాన సమాన హక్కు దారుడు "
కా " ఆహా బ్రహ్మాండం మా గురువు ఈ గురువు ఇద్దరు చాలా మంచోళ్ళు.. ఇద్దరూ ఒకరు శివుడు ఒకరి విష్ణువు "
వరద " ఏమిటి మేము నాటకాల ప్రదర్శన ఇస్తామని అప్పటికే చెప్పేశాడా నీకు మా బావ "
కా " అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను "
వరద " భలేవాడివయ్యా స్వామి ఉన్న కష్టాలు చాలకుండా ఉన్న నాటకాలు చాలకుండా ఇంకో కొత్త నాటకం వేయాల ఈయన కోసం "
నేను " ఓ బావ ఆ నాటకం మాడి తీరాల్సిందే అతగాడికి మాటిచ్చి తీసుకొచ్చాను.. అతగాడు ఎవరనుకున్నావ్ "
వరద " ఎవరు బావ "
నేను " గొప్ప కథా రచయిత గొప్ప దర్శకుడు.. ఆయన చేతిలో పడితే చాలు ఆయన్ని ఏరి కోరి తీసుకొచ్చాను మన కళా దాహం తీర్చుకోవడానికి.. ఎలాగో మన దగ్గర అందరూ ఉన్నారు కదా రచయిత దర్శకుడు మాత్రమే లేడు .. అది ఆయన భర్తీ చేస్తాడు ఈయన కోసం మనం ప్రదర్శన ఇవ్వక తప్పదు నువ్వు అలా అయితేనే చెప్పు నేను వస్తాను లేకపోతే మళ్ళా వెళ్తాను "అని మెలిక పెట్టాను
వరద " బావ నువ్వు ఉండాల్సిన వాడివే.. ఇప్పుడు మన పరివారం అంతా ఈ నాటకం ఆడక తప్పదా "
నేను " అక్కడికేదో నీకు నాటకాలు ఇష్టమ్ లేనట్టు మాట్లాడతావ్ ఏమిటి "
వరద " ఇష్టమే అనుకో ఇతగాడు మనిద్దరిని సమానంగా రంగస్థలం పైన మన ప్రదర్శనను ఏర్పాటు చేయించగలడా ? "
నేను " ఓ బావ ఎవరనుకుంటున్నావ్ ఆయన కార్తికేయడు "
వరద " ఓహో నువ్వు గతంలో చెప్పిన నాటకాలు".. అంటూ కార్తికేయుడు గురించి ముందర కథల్లో దేవతలు అనుకున్నవన్నీ చెప్పాడు
వరద " ఓహో మీ కథలు విన్నానండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మిమ్మల్ని కలుద్దాము అందరు అనుకున్నామని " ఏదో ఒక అభిమానిలా మాట్లాడాడు.
కా " అదేం లేదు గురువా నేను చాలా చిన్నోడిని ఈ గురువుకి నేను ఇంత అభిమానం కాబట్టి అలా అనిపిస్తుంది అంటూ తన వృత్తాంతం మొత్తం చెప్పి.. తనకు సహాయం చేయమని కోరాడు..
నేను " మా వరదా నీకు సహాయం చేయాలంటే ఒకసారి రాముల వారి కదా ఆంజనేయ కదా మరొకసారి చెప్పు అప్పుడే నీకు రుచికరమైన భోజనము మరియు అత్యానందమైన సేద తీరే స్థలమును చూపించగలము" అని మరొక సరదా మెలిక పెట్టాడు
కా " గురువా నీకు చెప్పేటప్పుడు ఎంత ఆనందం వేసిందో ఈ గురువుకి చెప్పేటప్పుడు కూడా నాకు అంతే ఆనందం ఇస్తుంది" అంటూ తన బాల ఆంజనేయ స్వామి కథనంతా చెప్పాడు
వరద విష్ణు రూపంలో విన్న కథని మరొకసారి వరద రూపంలో విని ఎంతో తన్మయత్వం చెంది ఆహా ఆంజనేయ అంటూ కార్తికేయని వాటేసుకున్నాడు..
చూసేవారందరూ.. ఇతడు గుహుడు అయ్యి ఉండడు ఎందుకంటే గుహడు అడిగి ఆలింగన తీసుకున్నాడు.. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆలింగనమందుకున్న ఈ కార్తికేయుడి జన్మ ధన్యము కదా అని అందరితోపాటు ఆంజనేయుడు సైతం అనుకుంటున్నారు..
కా " గురువా అచ్చు ఆ గురువు కూడా అంతే ఆనందపడ్డాడు "
వరద " బ్రహ్మాండంగా ఉంది కార్తికేయ.. నీ గురించి ఈయన చెప్తూనే ఉంటాడు నీ కదా రచనలు నీ కథ నాటక ప్రదర్శనలు ఎన్నో వీక్షించి ఆ సన్నివేశం బావుంది ఈ సన్నివేశం బాగుంది అని మాకే వివరిస్తూ రక్తి కట్టిచ్చే విధంగా చెబుతాడు... నువ్వంటే మా చెల్లి కి వాళ్ళ చెల్లి కూడా ఎంతో ఇష్టం..
కా " అవన్నీ ఎంతో ఆనందం , ఎట్లా కైనా నువ్వు కూడా సహాయం చేసి మా కళాకారుల భూమి పొందే విధంగా చేయి గురువా అని విష్ణుమూర్తి చేతులు తీసుకొని చేతులు పట్టుకున్నాడు ..
అట్లానే నేను కూడా వెళ్లి చేయి పట్టుకున్నాను కార్తికే నది
కార్తికేయని రెండు చేతులు మా ఇద్దరి పిడికిలలో ఉన్నాయి ..
ఒకరు చేయి పెడితేనే ఎంతటి భక్తుడైన కాపాడుతామని ఇక ఇద్దరం హామీ ఇస్తే ఆ కథ వేరే రకంగా ఉంటుంది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment