శ్రీథర మాధురి - 129
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
మనకు ఆయనే అన్నీ. ఆయన మనను ఈ ప్రపంచం లోకి తీసుకు వచ్చి, మనం పోషించడానికి ఒక పాత్రను ఇచ్చి, తానే అన్నిటికి కర్త(అన్నీ చేసేవారు) కనుక, మనద్వారా ఆయనే ఆ పాత్రనుపోషిస్తూ ఉంటారు.
ఈ ప్రపంచంలో మనకి పుట్టే అవకాశాన్ని ఇచ్చినందుకు, ప్రార్థనలు అనేవి వారి పట్ల మనం చూపే కృతజ్ఞత వంటివి. ఆయన మనను ఎన్నో మంచి మంచి అంశాలతో దీవించారు. ఆయన దయ, ప్రార్థనల ద్వారా ఆయన చేసిన ఉపకారాన్ని మనం అనుభూతి చెందేలా చేస్తుంది.
కొంతమంది తమ సమస్యలకు పరిష్కారం కోసం ప్రార్థిస్తారు...
మేము ఆయన పట్ల మాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రార్థిస్తాము.
మేము ఆయన పట్ల మాకున్న కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ప్రార్థిస్తాము.
మేము ఈ జన్మలో ఆయన దీవించిన మంచి అంశాలన్నిటి కోసం ప్రార్థిస్తాము.
ఆయన మాపై వర్షంప చేసిన అపరిమితమైన అనుభవం కోసం మేము ప్రార్థిస్తాము.
ఎప్పటికీ ఆయనకు విధేయులై ఉండేంత దయని పొందడం కోసం మేము ప్రార్థిస్తాము.
అసమానమైన అంకితభావం, నిశ్చయంతో ఈ ప్రపంచానికి సేవ చేసే మరిన్ని అవకాశాలను ఆయన మాకివ్వాలని మేము ప్రార్ధిస్తాము.
సమాజంలో, జీవితంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని శాంతిసామరస్యాలను నెలకొల్పాలని మేము ప్రార్థిస్తాము.
కలిసిమెలిసి ఉండాలని మేము ప్రార్థిస్తాము.
ఇతరుల భావనల పట్ల సానుభూతితో ఉండాలని మేము ప్రార్థిస్తాము.
ఉదారమైన హృదయంతో అవసరంలో ఉన్న వారిని, పేద వారిని ఆదుకోవాలని మేము ప్రార్థిస్తాము.
బుద్ధి హృదయానికి బానిసగా ఉండాలని మేము ప్రార్థిస్తాము.
మా ఆలోచనలు, మాటలు, చర్యలు ఎల్లప్పుడూ ప్రేమతో, దయతో ఉండాలని మేము ప్రార్థిస్తాము.
మేము నివసించే ప్రపంచానికి ఏవిధంగానూ హానిని కానీ, నష్టాన్ని కానీ కలుగజేయకూడదని మేము ప్రార్థిస్తాము.
కాబట్టి ప్రార్థిస్తూ ఉండండి... జపిస్తూ ఉండండి...
ఓం నమో నారాయణాయ...
*****
కొంత మంది ప్రార్థనలు వారి సమస్యలను తీరుస్తాయని, గాయాల్ని మాన్పుతాయని, భావిస్తూ ఉంటారు.
అలా జరగవచ్చు జరగకపోవచ్చు...
కానీ ఒకవేళ మీ నమ్మకం స్థిరంగా ఉంటే, అది అద్భుతాలను చేస్తుంది. మొదట నమ్మకం మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. నమ్మకం వాస్తవాన్ని మీరు ఆమోదించేలా, దానితో జీవించేలా చేస్తుంది. ఒకరు దేన్నైనా అధిగమించాలంటే దానితో జీవించాలి.
నమ్మకం లేదా ప్రార్థనలనేవి కేవలం మీ సమస్యలను తీరుస్తాయనే మీరు చేసినట్లయితే అది భగవంతునితో చేసే వ్యాపారం అవుతుంది. ఇటువంటి ఆర్థిక లావాదేవీల్లో భగవంతుడు మిమ్మల్ని భాగస్వామిగా ఆమోదించక పోవచ్చు.
నామటుకు నమ్మకం లేదా ప్రార్థన అనేది మరింత విశ్వాసంతో, మీకు అన్నింటినీ సమర్థించుకునే బలాన్ని ఇవ్వాలి. నమ్మకం లేదా ప్రార్థనలనేవి ఎటువంటి ఆశించడాలూ లేకుండా ఉండాలి.
అయినా, మీరు నమ్మకంతో ప్రార్థించినప్పుడు, ఒక్కొక్కసారి భగవంతుడు 'అలాగే కానివ్వండి' అంటారనుకోండి!
****
ఎంతోమంది ఆలయాలకు వెళ్ళి, ప్రార్థనలు చేయడాన్ని నేను చూశాను. కొంతమంది ఇంట్లోనే శ్లోకాలు, స్తోత్రాలు చదువుతారు. కొంతమంది యోగా, ధ్యానం చేస్తారు. కొంతమంది గురువులు, సాధువులు, సత్పురుషుల యొక్క ప్రవచనాలకు హాజరవుతారు. ఇలా వారు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే, ఇవన్నీ వారి దైనందిన అనుభవాలతో కలిసి వారికి ప్రశాంతతను చేకూర్చి ఉండాలి. ప్రతి దాన్ని భగవంతుని యొక్క కానుకగా భావించి ఆమోదించే ప్రశాంతతను వారి బుద్ధికి కలిగించి ఉండాలి. కానీ వాస్తవం పూర్తి విభిన్నంగా ఉంటుంది. వీరిలో చాలామంది పూర్తిగా అహంకారం, గర్వం, దురాశ, అసూయ వంటి వాటితో నిండి ఉంటారు. మరి కొన్నిసార్లు వారు పూర్తిగా కోపం, పశ్చాత్తాపం, స్వీయ సానుభూతితో నిండి ఉంటారు.
ఇదంతా నేను చూసినప్పుడు, ఇన్నేళ్లుగా వీరు ఆచరించినవన్నీ, వీరిలో, ప్రతి దానిలో ఉన్న దైవాన్ని ఆమోదించేలా, తగినంత పరిణితిని తీసుకు రాలేకపోయాయే అనుకుంటాను. ఇవన్నీ మీరు యాంత్రికంగా చేస్తున్నట్లుగా, ఇతరులకు గొప్పగా చెప్పుకునేందుకు చేస్తున్న అహపు యాత్రలలాగా అనిపిస్తాయి. వీరి జీవితమంతా బూటకమే, ఒక జీవితకాలం పూర్తిగా వృథా చేయబడింది.
అయినా, దైవం యొక్క పథకాల గురించి, ఎవరు ఆయనను ప్రశ్నించగలరు? అందుకే ఇది కూడా దైవం యొక్క సంకల్పమే, 'ఎలా ఉండకూడదు, ప్రవర్తించకూడదు' అన్నది నేర్పడానికి భగవంతునికి తనవైన దారులున్నాయి.
మా ప్రార్థనలు...
*****
బుద్ధిని అధిగమించడమే ప్రార్థన యొక్క పరమార్థం. ప్రార్థనలు మన బుద్ధికి అతీతంగా వెళ్లడానికి మనకు సహాయం చేస్తాయి. ప్రార్ధన అనేది హృదయం/ఆత్మ నుంచే ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రార్థనలు బుద్ధిని దాటి, హృదయాన్ని చేరుకోవాలి. ఒకవేళ ప్రార్థనలు బుద్ధిని దాటేందుకు మీకు సహాయం చేయనట్లయితే, అది అసలు ప్రార్థనే కాదు. బుద్ధి యొక్క సహాయంతో చేసే గారడీ మాత్రమే.
****
No comments:
Post a Comment