'లింగోద్భవాద్భుతం!' - అచ్చంగా తెలుగు

'లింగోద్భవాద్భుతం!'

Share This

 'లింగోద్భవాద్భుతం!'

--సుజాత.పి.వి.ఎల్.

సైనిక్ పురి, సికిందరాబాద్.





జపతప జాగరణ పుణ్యదినం
అర్థనారీశ్వర కల్యాణ శుభదినం
నైవేద్య సహిత కర్పూర హారతి 
భక్తి పారవశ్య సంపూజనం
నిషితకాల లింగోద్భవాద్భుతం
కైవల్య శరణాగత ఉపవాస దీక్షా మార్గం
శివతత్త్వ ప్రబోధ  పవిత్ర ఘోష ప్రాభవం
శుద్ధచిత్త శక్తిస్వరూప ప్రేరణం
ఆలయ గోపుర అఖండ దీప దేదీప్యమానం 
ఘంటానాద గర్జనం
అభిషేక ప్రియ ఆనంద తాండవ నృత్య మహోత్సవం
కైలాసనాథ కృపా కటాక్ష ప్రసాదితం
జన్మజన్మల పుణ్యఫల వైభవం 
పంచాక్షరి ధ్యాన భుక్తిముక్తిదాయకం
మనోవాక్కాయ భక్తవత్సల  కల్పవృక్ష విగ్రహం
నీలకంఠ నిరామయ నిర్గుణా సత్వ నిగ్రహం
ఆధ్యాత్మిక సత్కాలక్షేప ఉపవాస దీక్షా సంకల్పం
మాఘకృష్ణ చతుర్దశి సోమక్షయం మహాశివరాత్రి పర్వదినం
అంతఃచక్షువుకు శోభాయమానం...
జగత్కల్యాణ కారకం!

***

No comments:

Post a Comment

Pages