శివం- 120 - అచ్చంగా తెలుగు

 శివం - 120

శివుడే చెబుతున్న కథలు

రాజ కార్తీక్ 


        

నేను అనగా శివుడు.. వరద అనగా విష్ణువు 


(జరిగిన కథ .. కార్తికేయుడు నేను కలుసుకోవడం మార్గమధ్యంలో కార్తికేయని చేత కథలు చెప్పించుకొని
నాటక ప్రదర్శనకు హామీ ఇచ్చి వరద రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు ని పరిచయం చేయటం..)

కార్తికేయుడు "ఎంతో ఆనందంగా ఉంది.. గురువుల్లారా.. మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు ఎన్నో జన్మల బంధంగా అనిపించారు.. మీ ఇద్దరి చేతిలో చేయి వేసిన తర్వాత నా సమస్య తిరినంత పని అయింది " అంటున్నాడు మా ఇద్దరి చేతుల్లో చేతులు పెట్టి 

నేను " ఇదిగో కార్తికేయ.. నేనంటే నన్ను అభిమానించే వాళ్ళు ఏది కోరిన ఖచ్చితంగా చేయగలను.. అదే మా బావ వరదరాజ అలా కాదయ్యో.. ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు.. నేను బోళ గా ఏ పనైనా చేస్తాను అదే ఆయన చతురతతో ఆ పని చేస్తాడు.. కాబట్టి నా మీద నువ్వు కసురుకున్నట్టు ఆయన కసురుకున్నావ్ అనుకో ఆయన చెల్లి అదే మా ఆడోళ్ళు అసలు ఊరుకోరు "


విష్ణు దేవుడు నవ్వుతున్నాడు.. ఎందుకంటే.. ఒకానొకసారి భక్తుడు ఏది కోరుకుంటే అది గుడ్డిగా ఇస్తే ఎలా మహాదేవ అని నాకు చెబుతూ.. బాణాసురుడిని ఓడించడానికి.. కృష్ణుడిగా ఉన్న విష్ణు దేవుడు.. సమ్మోహనాస్త్రం వేస్తాను దానికి లొంగిపొండి మహాదేవ అని నన్ను అర్థించి.. మీరు బాణాసురుడికి ఇచ్చిన వరం కారణం చేత ఆ రాక్షసుడు తరఫున మీరు యుద్ధం చేస్తే.. అది అధర్మాన్ని గెలిపించినట్టు అవుతుంది కాబట్టి నా ఆస్త్రానికి మీరు సామాన్య మనిషి వలె లొంగిపొండి అని అన్నప్పుడు ధర్మం కోసం నేను అదే చేశాను.. అదికాక విచిత్ర వరాలు పొందిన గజాసురుడు లాంటి వారి నుండి నన్ను ఎలా బయటపడేసారో ఆ వృత్తాంతాలు మీకు తెలిసినవే కదా..
దేవతలు కైలాస పరివారం త్రిమాతలు బ్రహ్మదేవుడు సైతం ఆంజనేయుడుతో ఇదే ఉటంకించారు..

వరద రాజా "  బావ నువ్వు అలా అంటే ఎలా.. మనం పంచుకున్న బాధ్యతల్లో పోషణ బాధ్యత నాది కాబట్టి.. కొన్ని పనులు ఆచితూచి చేయాలి.. నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకట.. నిన్ను తిడితే ఒకటి నన్ను తిడితే ఒకట.. ఎవరు ఏం చేసినా నీ తర్వాతే నయ్యా "

కా " అవునయ్యా పెద్దమనిషి ఏమి ఇబ్బందులు పెట్టావు ఈయన్ని "

వరద " అది కాదు దర్శక దిగ్గజా! ఫోన్లే కదా అని మా చెల్లి ఇష్టపడింది కదా అని మా చెల్లిని ఇద్దాం అనుకున్నాము , పెళ్లికి వచ్చేటానికి పద్ధతి కూడా తెలియదు .. ఇప్పుడు ఎలా శివుడు లాగా ఉన్నాడో అట్లానే స్మశానవాసి వల్లే పెళ్లి మండపానికి పెళ్ళికి వచ్చాడు .. మా చెల్లి మహా ఇల్లాలు మహా దేవత కాబట్టి వాళ్ళింట్లో వాళ్లు తటపటాయించిన ఆమె వెనకేసుకొచ్చింది "

కా " ఇదేమిటి గురువా బహు తెలివిగలడివి లాగా ఉన్నావు అలా పోవటమేంటి.. మీ అమ్మానాన్న ఏం చేస్తున్నారు "

నేను " నాకు ఎవరూ లేరు నాకు నేనే.. నేనొక్కడినే అంతా నేనే అంతా నాదే అంత నాలోనే.. అందరూ నాకు  ఒకటే.."

ఆ మాటకు అందరూ ఆరాధన భావంతో చూస్తున్నారు 

కా " గురువా నీకు దండం పెడతా సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు ఈ వేదాంత ధోరణితో ముచ్చట్లు " 

వరద " నిజమే దర్శక ! ఆయన చెప్పింది నిజమే .."

కా " అది సరే ఆరోజు ఏం జరిగింది మరి"

వరద " ఏముంది దర్శక దిగ్గజా! నేనొకడున్నాను కదా మా వాళ్ళందరిని తీసుకెళ్లి ఇయన్ని ముస్తాబు చేసేసరికి.. నా శంఖం లో ప్రాణం చక్రం లోకి వచ్చింది "

కా " మరి మీ చెల్లెలు ఏమంది "

వరద " మా చెల్లెలు ఏమన్నా అనాలా ఆవిడ చూస్తేనే నాకు ఏం చేయాలో అర్థం అయిపోతుంది " 

నేను " బావ వరద నేనేదో మీ చెల్లెల్ని రాచిరంపాన పెట్టినట్టు మాట్లాడతావు .. మీ చెల్లెలు ఉగ్ర రూపం దాలిస్తే నేను మాత్రం తట్టుకోగలనా ఏమిటి ? " 

కా "అవును వరద గురువా ! మార్గమధ్యలో కూడా నాకు అదే చెప్పాడు "

వరదా  "అదే ఒకసారి కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన వారు దుర్మార్గం చేయపోతే , మా చెల్లి అపర ఖాళీ అయి వాళ్ల తాట తీసింది.. ఎంతసేపటికి శాంతించపోయేసరికి  పలుమార్లు ఆమె ఎదురుపడిన పట్టించుకోపోయేసరికి.. శాంతించలేదని ఊరికే అలా మా చెల్లిని వెక్కిరిస్తున్నాడు "

కా " అంటే ఆ తర్వాత నుండి మీ చెల్లెలు గారితో సవ్యంగా ఉండట్లేదా ఈ గురువు!"

వరద "చ అదే మాట.. మా చెల్లెలు అంటే తనకి ప్రాణం. నేనైనా మా ఆవిడ కి గుండెలు మీద స్థానం ఇస్తా.. కానీ మా బావ సగం శరీరం ఇచ్చేశాడు"

కా " మొత్తానికి మహాదేవుడు వలె సగభాగం ఇచ్చాడన్నమాట .. మీరు కూడా విష్ణు దేవుడు వలె గుండెల మీద స్థానం కల్పించారన్నమాట ! బాగుంది మీ బావ బామ్మర్ది చిలిపి ఎత్తిపోతలు"

నేను " పోనీలే రచనా దురంధ! తమరి ప్రశంసా పత్రము మా ఇద్దరికీ లభించినది "

అంటూ నేను విష్ణు దేవుడు బిగ్గరుగా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాము..
కార్తికేయుడు కి ఏమి అర్థం కాక తను కూడా మాతోపాటు నవ్వాడు..
ఇది చూస్తున్న ముల్లోకాలు దేవతలు త్రిమాతలు కూడా సరదాగా నవ్వారు..
ఆంజనేయుడు కూడా అటు ఇటు చూసి ఇంతమంది నవ్వుతుండగా నేను ఎందుకు నవ్వకూడదని సరదాగా నవ్వాడు..

మేమిద్దరము నవ్వు ఆపాము 
మా వైపు అనుమానంగా చూస్తూ కార్తికేయ నవ్వు ఆపాడు

తిరిగి మేమిద్దరము మళ్ళీ బిగ్గరగా నవ్వాము. 

కార్తికేయుడు నవ్వాడు ..

లక్ష్మి దేవి " బాగుంది కదా ఇక ఈ కథలోకి మనం కూడా పాత్రధారులు అవ్వాలి ఏమో"

పార్వతీ మాత " కాకపోతే ఎలా ! మహాదేవుడు ముచ్చటపడి మరి లీల చేస్తున్నాడు కదా "

సరస్వతి మాత " తథాస్తు"

బ్రహ్మదేవుడు " వీరిద్దరి పాత్రలు బానే కుదుర్చుకున్నారు నన్ను ఎక్కడ ఇరికిచ్చి నా పాత్రను కూడా నడిపిస్తారో తెలుసుకోవాలని" అంటున్నారు సరదాగా

నేను మహావిష్ణువు.. కార్తికేయన్తో ఇంకా ఎన్నో సరదా సరదా సంఘటనలు చెప్పుకున్నాము 

కా " గురువా రాజా ! "

అంటే ఇద్దరము పలికాము 

నేను " నటరాజ ? వరదరాజ ? "

కా " అది " 

నేను " ఇద్దరిలో ఎవరికి చెప్పినా ఒకటే "

కా " గురువుల్లారా ! మీ ఇద్దరూ రెండు ఒకటే ఇద్దరు ఒకటే అది ఒకటే అది ఒకటే అని నన్ను వాయిస్తున్నారు, "

వరద "అదేమిటి దర్శక రచయిత, ఎంతైనా మీ శివుడి వేషధారి అయిన ఈ గురువు మీరు ఒకటే ఇద్దరికీ కళలు పట్ల ఎంతో మక్కువ , ఇద్దరికీ నాటకాసక్తి"

నేను "అదేమిటి బావ అదేదో నీకు లేనట్టు నాకు మాత్రమే ఉన్నట్టు నీకు మాత్రం నాటకాలు అంటే ఇష్టం ఉండదు కీర్తనలు సాహిత్యం అంటే ఇష్టం ఉండదా ! "

వరద " ఎంతైనా నీ అంత ఉండదు లే బావ నీ మోతాదు మరింత అమోఘం "

నేను " నువ్వు కూడా అంతే "

కా " అమ్మ అన్నపూర్ణాదేవి "అంటూ గావు కేక వేశాడు 

నేను " మర్చిపోయా మర్చిపోయా! ఆకలితో అలమటిస్తున్నాడు దర్శకుడు తొందరగా మంచి భోజనానికి ఏర్పాటు చేయవలెను"

కా " పోనీలే గురువా ఇప్పుడున్న అర్థం చేసుకున్నావు"

వరద " కానీ లే బావ ఆకలి ఎక్కువ అయితే ఒక అయిదారు ముద్దలు ఎక్కువ తింటాడు.. మా చెల్లి చేత వంట తినాలంటే ఎంత అదృష్టం ఉండాలి"

కా " గురువుల్లారా ! అర్థం చేసుకునేందుకు శుభాభినందనలు"

నేను " ఓ నంది నువ్వు వచ్చావు సరే బృంగి ఎక్కడ .. మిగతా ఎక్కడ "అనగానే మరికొన్ని నంది దళ సభ్యులు వచ్చారు 

వరద " ఓ నంది బ్రింగి మేమిద్దరం మీ ఇద్దరి మీద ఎక్కుతాంలే కానీ , ఈ దర్శకుని కూడా మీలో ఒక ఏక్కించుకొని తీసుకురండి "

నంది బృంగి తో పాటు మిగతా పశువులు కూడా.. సరే అన్నట్లు తల ఆడించాయి 

వరద " బావ నేను నందిని ఎక్కాను కదా ఇప్పుడు బృంగి ను ఎక్కి వస్తాను నువ్వు నంది తో వచ్చేయి "

బృంగి కూడా ఎంతో ఆసక్తిగా రంకె వేశాడు.. ఇందాక మహావిష్ణువుని నంది మోసాడు ఇప్పుడు ఇదే కార్తికేయని పుణ్యం వల్ల బ్రింగి మోస్తున్నాడు బృంగి కూడా అమితానందంతో కళ్ళ వెంట ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు..

నంది బృంగి ఇద్దరూ కార్తికేయని వైపు కృతజ్ఞతతో చూశారు నీవల్ల మేము విష్ణు దేవుడిని మోయగలిగామని ..

నేను " గణ " అని ఒక నంది దళ సభ్యుని పిలిచాను 

గణ ఆనందంగా ముందుకు రంకె వేసుకుంటూ వచ్చింది 

మన అతిధిని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి.. అనగానే చాలా ముద్దుగా తలకాయ ఊప కార్తికేయని దగ్గరికి వచ్చి మీద అధిరోహించు అన్నట్లు సైగ చేసింది.

కా " జై భవాని " అంటూ సింహనాదం చేశాడు.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages