'త్రివేణి సంగమం-మోక్షదాయకం!' - అచ్చంగా తెలుగు

'త్రివేణి సంగమం-మోక్షదాయకం!'

Share This

 'త్రివేణి సంగమం-మోక్షదాయకం!'

--సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.



గంగ యమున సరస్వతీ
నదీమతల్లుల  సంయోగం
భువిపై త్రివేణి సంగమ ప్రాభవం
నాగసాధు తపోశక్తి బలం 
సన్మార్గ బోధన ఋషితత్వం
హిందూ జీవన విధాన
సనాతన ధర్మోత్సవం 
కోటిజన్మ పుణ్యఫలం 
అశేష భక్తజన సందోహం
మహాకుంభ మేళా ప్రవేశం...
సంగమస్నానం...
సాధు స్పర్శనం...
ప్రవచన శ్రవణం...
పూర్వజన్మ ఫల ఫలితం...
జన్మోద్ధారకం...
శుభకరం!
***

No comments:

Post a Comment

Pages